newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా రెడ్ జోన్ గా ఫిల్మ్ నగర్.. కేసులపై స్పష్టత లేదా?

28-03-202028-03-2020 12:23:05 IST
2020-03-28T06:53:05.749Z28-03-2020 2020-03-28T06:50:36.397Z - - 18-04-2021

కరోనా రెడ్ జోన్ గా ఫిల్మ్ నగర్.. కేసులపై స్పష్టత లేదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినిమా వాళ్ళు కొందరు.. బడా పారిశ్రామిక వేత్తల కలగలుపుగా ఉండే ఫిల్మ్ నగర్ ఇప్పుడు కరోనా వైరస్ రెడ్ జోన్ గా మారింది. జీహెచ్ఎంసి తాజాగా ఈ ప్రాంతంలో రెడ్ జోన్ అంటూ ఫ్లెక్షీలు ఏర్పాటు చేసింది. లాక్ డౌన్ తో పాటు ఈ ప్రాంతంలో వైరస్ వ్యాప్తిలో కీలకంగా ఉందని.. అందరూ ఇళ్లకే పరిమితం కావాలని గ్రేటర్ అధికారులు ఆ ఫ్లెక్షీలలో పేర్కొన్నారు.

ఇక ఫిల్మ్ నగర్ బస్తీలో అయితే పోలీసుల పహారా కాస్తూ ఎవరినీ ఇంటి నుండి బయటకు రాకుండా చూస్తున్నారు. ఇక సిటీకి దూరంగా ఉండే అటు బీహెచ్ఎల్, చందానగర్, కోకాపేట, కొత్తపేట, తుర్కయాంజాల్, గచ్చిబౌలిలను కూడా రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు ఫిల్మ్ నగర్ లో మాత్రం కీలకంగా వ్యహరిస్తున్నారు. ఫిల్మ్ నగర్ ప్రాంతంలో ఇప్పటికే ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో అనుమానితుల జాబితా చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. సాధారణంగా జీహెచ్ఎంసి బ్యానర్లు కట్టిన ప్రాంతాలలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు అర్ధం. కానీ ఇక్కడ ఫిల్మ్ నగర్లో మాత్రం ఎన్ని కేసులు అన్నది స్పష్టంగా తేలడం లేదని తెలుస్తుంది. దీంతో పాటు ఈప్రాంతంలో అనుమానితుల సంఖ్య భారీగా ఉన్నట్లుగా తెలుస్తుంది.

అనుమానితులలో కొందరు క్వారంటైన్ లో ఉంటే మరికొందరు హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం అనుమానితుల జాబితా సిద్ధంగా ఉండడంతో ఈ అనుమానితులలో పాజిటివ్ కేసులు నమోదైనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుగానే ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించినట్లుగా కనిపిస్తుంది. ఒకటి రెండు రోజులలో ఈ ప్రాంతంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

జీహెచ్ఎంసి అధికారులు ప్రకటించిన రెడ్ జోన్ కేంద్రాల్లో ఫిల్మ్ నగర్ ఉందా లేదా అన్నది స్పష్టత ఇవ్వలేదు కానీ ఫిల్మ్ నగర్ ప్రాంతంలో మాత్రం ఫ్లెక్షీలు ఏర్పాటు చేశారు. అయితే, ఒకటి రెండు రోజులలో అనుమానితుల రిపోర్టుల తర్వాత ఇక్కడ పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉండగా ఈలోగా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టకి ఈ ఫ్లెక్షీల ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది.

ఇక నగరంలోని మిగతా రెడ్ జోన్ ప్రాంతాలతో పాటు అటు కరీంనగర్ లో కూడా ప్రభుత్వం కఠినంగా ఆంక్షలు విధిస్తుంది. ప్రజలెవరూ బయటకు రాకుండా ఉండేలా చూస్తూ వైరస్ కట్టడిగా తీవ్రంగా శ్రమిస్తోంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 59కి చేరింది. అనుమానితుల సంఖ్య భారీగానే ఉంది. వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను సిద్ధం చేసుకుంటుంది.

ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా కరోనా వైద్యానికి సిద్ధం చేస్తున్న తెలంగాణ సర్కార్ వైరస్ ఉదృతిని బట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీలను కూడా క్వారంటైన్ వార్డులుగా మార్చేందుకు సిద్దమవుతుంది. ఇప్పటికే ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లను చేస్తుంది. వీటితో పాటు పెద్ద ఎత్తున మెడికల్ సామగ్రిని కూడా కొనుగోలు చేసేందుకు సీఎం జెండా ఊపేసారు.

 

 

 

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   2 hours ago


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   4 hours ago


షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

   4 hours ago


జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

   5 hours ago


అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

   6 hours ago


కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

   19 hours ago


కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

   a day ago


దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

   21 hours ago


Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle