కరోనా యోధులపై పూలవర్షం. వాయుసేన వినూత్న కార్యక్రమం
03-05-202003-05-2020 11:47:36 IST
Updated On 03-05-2020 11:53:56 ISTUpdated On 03-05-20202020-05-03T06:17:36.595Z03-05-2020 2020-05-03T06:16:17.905Z - 2020-05-03T06:23:56.450Z - 03-05-2020

కరోనా యోధులకు దేశం సమున్నతంగా ధన్యవాదాలు తెలిపింది. ఆదివారం దేశవ్యాప్తంగా కోవిడ్ ఆసుపత్రులపై వాయుసేన పూలవర్షం కురిపించారు. వైద్యులు, పారామెడికల్, పోలీసు, పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావంగా సాయుధ దళాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీస్ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి సమర్పించి వందన సమర్పరణతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. పోలీసు సేవలకు ప్రశంసగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చాపర్ పోలీస్ వార్ మెమోరియల్‌పై పూలవర్షం కురింపించింది. ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో ఉన్న పట్టణాల్లో కోవిడ్ ఆసుపత్రులపై వాయుసేన పూలవర్షం కురిపిస్తున్నారు. గాంధీ ఆసుపత్రితో పాటు రాత్రి, పగలు తేడా లేకుండా అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు, వైద్యులు, పారామెడికల్, పారిశుద్య సిబ్బందికి వాయుసేన హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తూ తమ సంఘీభావం ప్రకటించారు. వాయుసేన పూలవర్షం కురిపించిన అనంతరం వైద్యులు చప్పట్లు కొట్టి తమ సంతోషాన్ని పంచుకున్నారు. సరిలేరు మీకెవ్వరూ అంటూ ప్రపంచం మొత్తం వైద్యులకు ఇప్పుడు సాహో అంటోంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో వారు చేస్తున్న అలుపెరగని పోరాటానికి జయహో అంటూ సలాం చేసింది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న నోళ్లే ఇప్పుడు సర్కారీ వైద్యులే భేష్ అంటూ కితాబిస్తున్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్యకార్మికులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులను వినూత్నంగా సత్కరించాలని భారత నౌకాదళం నిర్ణయించింది. దీనిలో భాగంగా విశాఖ నగరంలోని ఛాతి, అంటువ్యాధుల ఆసుపత్రి, గీతం ఆసుపత్రులపై ఒక హెలీకాప్టర్‌తో ఆదివారం ఉదయం పూలజల్లు కురిపించారు. ఇటు భారత్‌లో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు రికార్డుస్థాయిలో పెరుగుతోంది. ఆదివారం ఉదయానికి దేశంలో ఈ మహమ్మారి బారనపడి మరణించిన వారిసంఖ్య 1301కి చేరింది. దేశవ్యాప్తంగా 83 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం ప్రకటించింది. కొత్తగా 2,644 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఒకే రోజు ఇన్ని కేసులు బయటపడడం ఇదే తొలిసారి అని పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39,980కి చేరిందని తెలిపింది. ఇప్పటివరకు 10,663 మంది వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. తాజా మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 1301కి చేరుకుందని, ప్రస్తుతం దేశంలో 28,046 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 1525, తెలంగాణలో 1061 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న ఒక్కరోజే 62పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 1525కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 33మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలంగాణలో నిన్న కొత్తగా 17కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1061కి చేరగా 29మంది మరణించినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. వారం రోజుల వ్యవధిలోనే భారత్‌లో 13 వేల కేసులు, 700 మరణాలు సంభవించడం గమనార్హం. ఇక మూడో దశ లాక్‌డౌన్‌ను మే 3 నుంచి మే 17 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ కేసులు నమోదైన వివరాల ఆధారంగా ఆయా ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా కేంద్రం విభజించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లాక్డౌన్ సడలింపులు ఉండగా.. రెడ్ జోన్లలో కఠిన నిబంధనలు కొనసాగనున్నాయి. ఇక 12 వేల పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర దేశంలోప్రథమ స్థానంలో ఉంది.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
10 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
6 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
8 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
11 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
13 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
16 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
17 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
18 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా