newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా బారినపడిన తెలంగాణ.. 24 గంటల్లో 1,850 కేసులు

05-07-202005-07-2020 08:47:49 IST
Updated On 05-07-2020 09:58:01 ISTUpdated On 05-07-20202020-07-05T03:17:49.692Z05-07-2020 2020-07-05T03:17:39.327Z - 2020-07-05T04:28:01.028Z - 05-07-2020

కరోనా బారినపడిన తెలంగాణ.. 24 గంటల్లో 1,850 కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా మరో 1,850 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 6,427 నమూనాలు పరీక్షించగా, అందులో 4,577 నెగెటివ్‌ వచ్చినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,312కు చేరింది. ఇందులో 10,487 యాక్టివ్‌ కేసులు ఉండగా, 11,537 మంది కరోనా నుంచి కోలుకున్నారు. శనివారం కరోనాతో మరో ఐదుగురు చనిపోగా, ఇప్పటి వరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 288కి చేరింది. రాష్ట్రంలో మొత్తంగా 1,10,545 నమూనాలను పరీక్షించగా, 83,656 నెగెటివ్‌ వచ్చాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా జీహెచ్‌ఎంసీలో 1,572 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 92, మేడ్చల్‌లో 53, వరంగల్‌ అర్బన్‌లో 31, కరీంనగర్‌లో 18, నిజామాబాద్‌లో 17, నల్లగొండలో 10, సంగారెడ్డిలో 8, ఖమ్మంలో 7, వరంగల్‌ రూరల్‌లో 6, జగిత్యాల, మహబూబ్‌నగర్, సిద్దిపేటలో 5 చొప్పున, భూపాలపల్లిలో 4, సిరిసిల్ల, కొత్తగూడెం, వికారాబాద్, జనగామ జిల్లాల్లో 3 చొప్పున, గద్వాలలో 2, నిర్మల్, భువనగిరి, మెదక్‌ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. 

తెలంగాణలో కొత్తగా 1342 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 11,537 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 10,487 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 

ప్రైవేట్‌ ల్యాబ్‌ల నిర్వాకం.. అధికారులకు టెన్షన్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో తీవ్ర ఆందోళనలో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి మరో షాక్‌ తగిలింది. ప్రస్తుతం కోవిడ్‌ పరీక్షల కోసం ప్రైవేట్‌ ల్యాబ్‌లకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత పది రోజులుగా కరోనా పాజిటివ్‌ వచ్చిన 3 వేల మంది రోగుల వివరాలను ప్రైవేట్‌ ల్యాబ్‌లు ప్రభుత్వానికి నివేదించలేదని తెలిసింది. మరింత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ప్రస్తుతం వీరికి సంబంధించిన 6వేల ప్రైమరీ కాంటక్ట్‌ల గురించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం వీరిని ఎలా గుర్తించాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు.

ప్రైవేట్‌ ల్యాబ్‌లలో పరీక్షలకు అనుమతిచ్చిన నాటి నుంచి తెలంగాణలో కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది. దాంతో అధికారులు ప్రైవేట్‌ ల్యాబ్‌ల మీద పరిశోధన చేయడంతో ఈ షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. దాదాపు 3వేలకు పైగా పాజిటివ్‌ కేసుల గురించి ప్రైవేట్‌ ల్యాబ్‌లు రాష్ట్ర ఆరోగ్య శాఖకు కానీ ఐసీఎంఆర్‌కు కానీ నివేదించలేదని తెలిసింది. కరోనా రోగులను టెస్ట్‌ చేయడం, గుర్తించడం, చికిత్స చేయడం వంటి అంశాల గురించి ప్రైవేట్‌ ఆస్పత్రులకు సరిగా తెలియకపోవడం వల్లే ఈ తప్పిదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా ప్రతి రోజు జరిపే కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన అతడు / ఆమె వివరాలను పరీక్షాకేంద్రాలు ప్రభుత్వానికి, కోవిడ్‌-19 పోర్టల్‌కు నివేదిస్తారు. అలా ఆ వ్యక్తికి ఒక యూనిక్‌ ఐడీ నంబర్‌ కేటాయిస్తారు. ఈ ఐడీ ద్వారా ప్రభుత్వ ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్‌ సదరు పేషెంట్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌ను ట్రేస్‌ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఉద్యోగుల బృందం పని చేస్తోంది. 

అయితే ప్రైవేట్‌ ల్యాబ్‌లు కరోనా టెస్ట్‌లు చేయడం కోసం వచ్చిన వారి దగ్గర నుంచి 3నుంచి 6 వేల రూపాయలు వసూలు చేశాయి. రిపోర్టులు ఇచ్చిన తర్వాత రోగులను గాలికి వదిలేసారు. ఆ వివరాలను ప్రభుత్వానికి తెలపలేదు. దాంతో పాజిటివ్‌ పేషంట్లు సామాన్య జనాల్లో కలిసిపోయారు. ప్రైవేట్‌ ల్యాబ్‌ల దగ్గర బిల్‌ నంబర్లు ఉన్నాయి కానీ యూనిక్‌ ఐడీలు లేవన్నారు అధికారులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో ప్రజలు ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. అధికారులు దీనిపై స్పందిస్తూ.. బాధ్యతారహితంగా ప్రవర్తించిన ప్రైవేట్‌ ల్యాబ్‌ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   12 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   8 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   15 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   18 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   19 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle