newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా బాధితులకు నితిన్, సత్య నాదెళ్ల, ప్రభుత్వ ఉద్యోగుల విరాళం

24-03-202024-03-2020 16:43:35 IST
Updated On 24-03-2020 16:43:28 ISTUpdated On 24-03-20202020-03-24T11:13:35.771Z24-03-2020 2020-03-24T11:12:00.580Z - 2020-03-24T11:13:28.816Z - 24-03-2020

కరోనా బాధితులకు నితిన్, సత్య నాదెళ్ల, ప్రభుత్వ ఉద్యోగుల విరాళం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా బాధితులకు సాయం చేసేందుకు పలువురు ముందుకు వచ్చారు. లాక్ డౌన్ కారణంగా జీవనభృతి కోల్పోయిన వారికి నిత్యావసరాలు అందించేందుకు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ఆపన్న హస్తం అందిస్తున్నారు. ప్రభుత్వానికి తమవంతు విరాళాలు అందచేస్తున్నారు. పేదలు నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. యువ నటుడు నితిన్ రూ10 లక్షల విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి కేసీయార్ కు అందచేశారు.

నితిన్ తో పాటు ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైక్రోసాఫ్ట్ దిగ్గజం సీఈవో సత్యనాదెళ్ళ భార్య శ్రీమతి అనుపమ వేణుగోపాల్ నాదెళ్ల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 కోట్ల రూపాయలు అందచేశారు.ఈ విరాళాన్ని సత్యనాదెళ్ళ మామ, అనుపమ నాదెళ్ల తండ్రి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి వేణుగోపాల్  అందించారు. వీరితోపాటు ప్రభుత్వ ఉద్యోగుల తరఫున జేఏసీ నాయకులు కారెం రవీందర్ రెడ్డి 48 కోట్ల రూపాయల చెక్కు ముఖ్యమంత్రి అందచేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు తమ ఒకరోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందచేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీయార్ వీరికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల సంఘం నేత కారెం రవీందర్ రెడ్డితో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీఎంని కలిసిన వారిలో వున్నారు. ఇప్పటికే సినిమా హీరోలు తమవంతు సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. జీవిత, రాజశేఖర్ దంపతులు సినీ కళాకారులకు నిత్యావసరాలు అందిస్తానన్నారు. 

కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రోజువారీ కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి సాయం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   14 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   7 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle