newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా పోటీ మొదలైనట్లే.. తెలంగాణలో ఒక్కరోజులో 730, ఏపీలో 477 కేసులు

22-06-202022-06-2020 07:13:53 IST
Updated On 22-06-2020 07:44:21 ISTUpdated On 22-06-20202020-06-22T01:43:53.086Z22-06-2020 2020-06-22T01:43:49.642Z - 2020-06-22T02:14:21.952Z - 22-06-2020

కరోనా పోటీ మొదలైనట్లే.. తెలంగాణలో ఒక్కరోజులో 730, ఏపీలో 477 కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన  పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 730 మందికి ఈ వైరస్‌ సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో కలిపితే రాష్ట్రంలో కోవిడ్‌–19 వచ్చిన వారి సంఖ్య 7,802కు పెరిగిం ది. ఇందులో 3,861 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,731 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

ఇక తాజాగా మరో ఏడుగురు కరోనా వైరస్‌ ప్రభావంతో మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 210కి పెరిగింది. రాష్ట్రంలో ఆదివారం 3,297 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 57,054 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 659 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత జనగామ లో 34, రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్‌ జిల్లాలో 9, వరంగల్‌లో 6, ఆసిఫాబాద్‌ లో 3, వికారాబాద్‌లో 2, సంగారెడ్డి, ఆదిలాబాద్, యాదాద్రి భువనగిరి, కొత్తగూడెం, నారాయణపేట, మెదక్, నల్లగొండ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైంది. 

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు 7,802 కాగా.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 9.3% కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేసే విషయమే. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 57,054 మందికి పరీక్షలు నిర్వహించగా.. 13.67% మందికి కరోనా సోకినట్లు తేలింది.

రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికం ఈ నెలలోనే నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఈనెల 1వ తేదీ నుంచి 21 వరకు ఏకంగా 5,104 కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌కు ముందు 22 కేసులు నమోదు కాగా, లాక్‌డౌన్‌ 1 (మార్చి 22–ఏప్రిల్‌ 14)లో 622, లాక్‌డౌన్‌ 2(ఏప్రిల్‌ 15–మే 3)లో 438, లాక్‌డౌన్‌ 3 (మే 4–మే 17)లో 469, లాక్‌డౌన్‌ 4 (మే 18–మే 31)లో 1,147 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. 

అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని రంగాలను మూసేయడంతో రాష్ట్రంలో కేసుల నమోదు తక్కువగా ఉంది. సడలింపులు మొదలైన వెంటనే జనసంచారం అధికమై క్రమక్రమంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగాయి. ఈక్రమంలో లాక్‌డౌన్‌ 4లో కేసుల సంఖ్య నాలుగంకెలకు చేరింది. ఇక లాక్‌డౌన్‌ 5లో నిబంధనలను పూర్తిగా సడలించి జూన్‌ 31 వరకు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 1 నుంచి 21వ తేదీ వరకు ఏకంగా కేసుల సంఖ్య నాలుగున్నర రెట్లు పెరిగింది.

హైదరాబాద్‌లో ఆదివారం ఒక్కరోజే.. 659 

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 730 కేసులు నమోదు కాగా ఏడుగురు మృతి చెందారు.  ఇక హైదరాబాద్‌లో అయితే కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోయాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 659 కేసులు నమోదు అయ్యాయి. జనగామలో 34, మేడ్చల్‌లో 9, ఆసీఫాబాద్‌లో 3, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొత్తగూడెం, నారాయణపేట, మెదక్, నల్గొండ, వికారాబాద్, వరంగల్, యాదాద్రిలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయింది. కరోనా సోకి ఇప్పటివరకూ మొత్తం 210 మంది చనిపోయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 

ఏపీలో కొత్తగా 477 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8929కి చేరింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 24,451 నమూనాలు పరీక్షించగా 439 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 34 మందికి, విదేశాల నుంచి వచ్చిన 4 మందికి కరోనా సోకినట్లు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన 24 గంటల్లో 151 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4307కు చేరుకుంది. కరోనాతో ఇవాళ ఐదుగురు మరణించడంతో మృతుల సంఖ్య 106కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4516 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 22 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. దీన్ని 30 వేలకు పెంచుతాం. పరీక్షలకు రోజుకు రూ.2 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నాం. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సర్కార్‌ ముందుకెళుతోంది. 40 వేల మందికి ఏకకాలంలో వైద్యం అందించేలా పడకలు సిద్ధం చేస్తున్నాం. ఇందులో 20 వేల వరకు ఆక్సిజన్‌ పడకలే’ అంటున్నారు.. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle