newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా పాజిటివ్ బారిన హరీష్.. త్వరగా కోలుకోవాలన్న గవర్నర్

06-09-202006-09-2020 11:42:44 IST
Updated On 06-09-2020 12:13:11 ISTUpdated On 06-09-20202020-09-06T06:12:44.941Z06-09-2020 2020-09-06T06:12:36.866Z - 2020-09-06T06:43:11.468Z - 06-09-2020

కరోనా పాజిటివ్ బారిన హరీష్.. త్వరగా కోలుకోవాలన్న గవర్నర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి వుంది. 20 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. కోవిడ్ 19 నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఇదిలా వుంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు కొవిడ్ పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేవారంతా ఖచ్చితంగా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం కోరింది. సభకు హాజరుకావాలంటే కరోనాటెస్ట్ నెగిటివ్ రావాలి. 

నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునే క్రమంలో ప్రజాప్రతినిధులు కూడా కరోనాబారిన పడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు కరోనా బారిన పడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న వేళ ప్రజాప్రతినిధులు టెన్షన్ పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో వైరస్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షచేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని మంత్రి హ‌రీష్‌రావు స్వయంగాట్విట్టర్‌ ద్వారా వెల్లడించిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉన్నారు. వైద్యుల సూచనలను పాటిస్తున్నారు. ‘కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో నేను వైరస్‌ నిర్ధారణ పరీక్షచేయించుకున్నాను. పాజిటివ్‌గా నివేదిక వచ్చింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇటీవల నన్ను కలిసినవాళ్లు ఐసొలేషన్‌లో ఉండి, కరోనా టెస్ట్‌ చేయించుకోండి. ఎవరూ నన్ను కలుసుకోవడానికి ప్రయత్నించకండి. నా హెల్త్‌ అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు మీతో షేర్‌ చేసుకుంటాను’ అని మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌చేశారు.  

నాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రేమతో, అభిమానంతో ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ ప్రేమే నాకు అసలైన వైధ్యం. దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, నన్ను కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నా హెల్త్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ట్విటర్ ద్వారా మీతో షేర్ చేసుకుంటాను అని ట్వీట్ చేశారు హరీష్. 

ఈనేపథ్యంలో హరీష్ రావు త్వరగా కోలుకోవాలని మంత్రులు, టీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ట్వీట్ చేశారు. క‌రోనా నుంచి హ‌రీష్‌రావు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాన‌ని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు గారు త్వరగా కోలుకొవాలని ఆకాంక్షిస్తున్నాను....I wish speedy recovery of Telangana State Finance Minister Shri T. Harish Rao garu అంటూ ట్వీట్ చేశారామె. ఇటీవల గవర్నర్ తమిళసై సౌందరరాజన్ బాబాయ్ ఎంపీ హెచ్ వసంతకుమార్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   6 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   9 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   12 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   13 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle