newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

06-04-202006-04-2020 17:10:49 IST
Updated On 06-04-2020 17:14:43 ISTUpdated On 06-04-20202020-04-06T11:40:49.542Z06-04-2020 2020-04-06T11:40:47.393Z - 2020-04-06T11:44:43.634Z - 06-04-2020

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కేసులతో ఆదివారం ఒక్కసారిగా కర్నూలు జిల్లా ఉలిక్కిపడింది. ఒక్కరోజే ఇక్కడ 49 కేసులు నమోదు కావడంతో జిల్లాలో హై–అలర్ట్‌ ప్రకటించారు.  మొత్తం 53 కేసులతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ కేసులన్నీ ఢిల్లీ జమాతేకు వెళ్లొచ్చిన వారే కావడం గమనార్హం. దీంతో కర్నూలు జిల్లాలో మొత్తం కరోనా కేసులు 53కి చేరాయి. తాజా పరిణామాలతో రాష్ట్రంలోనే అత్యధిక కేసులున్న జిల్లా కూడా ఇదే. ఒక్కసారిగా జిల్లాలో కరోనా విజృంభణతో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఇక్కడ మరింత కఠినతరం చేశారు. 

మరోవైపు..  శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం సా.5 గంటలు వరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 60 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 252కు చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. ఆదివారం ప్రకాశం జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 7, నెల్లూరు జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆదివారం వరకు నమోదైన కేసుల్లో 11 విదేశాల నుంచి వచ్చిన వారు కాగా, వారి కాంటాక్టŠస్‌ ద్వారా ఆరుగురికి , మరో ఆరుగురు కరోనా లక్షణాలతో చేరినట్లు వైద్య శాఖ పేర్కొంది. 

దీని ప్రకారం రాష్ట్రంలో నమోదైన మొత్తం 252 కేసుల్లో 229 కేసులు ఢిల్లీ మూలాలు ఉన్నవారివే. కాగా, కరోనా కేసులు బయటపడుతున్న ప్రాంతాలపై రాష్ట్ర వైద్య శాఖ ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఆయా ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించి అక్కడ రాకపోకలను పూర్తిగా నిషేధించడమే కాకుండా, శానిటైజేషన్, బ్లీచింగ్‌ వంటి కార్యక్రమలను పెద్దఎత్తున చేపడుతోంది. 

కరోనా వైరస్‌ను జయించిన మరో యువకుడు ఆదివారం విజయవాడ ప్రభుత్వాసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. నగరంలోని వన్‌టౌన్‌కు చెందిన యువకుడు శనివారం డిశ్చార్జి కాగా.. గాయత్రి నగర్‌కు చెందిన మరో యువకుడు ఆదివారం డిశ్చార్జి అయ్యాడు. ఆమెరికాలోని వాషింగ్టన్‌లో ఉండే ఇతను మార్చి 22న నగరానికి వచ్చాడు. కరోనా లక్షణాలు ఉండటంతో మరుసటి రోజే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేరగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో 14 రోజులుగా ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నాడు.

తాజాగా అతనికి నెగిటివ్‌ రావటంతో ఆదివారం డిశ్చార్జి చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పోతురాజు నాంచారయ్య, కోవిడ్‌–19 ట్రీట్‌మెంట్‌ సెంటర్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎన్‌. గోపిచంద్‌లు తెలిపారు. డిశ్చార్జి అయిన యువకుడిని కలెక్టర్‌ ఇంతియాజ్‌ అభినందించారు. మరోవైపు.. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి పూరిగా కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. 

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   5 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   7 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   10 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   12 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   13 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   13 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   13 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   14 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   14 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle