కరోనా పరీక్షల తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
09-06-202009-06-2020 07:39:48 IST
Updated On 09-06-2020 09:18:07 ISTUpdated On 09-06-20202020-06-09T02:09:48.580Z09-06-2020 2020-06-09T02:09:46.290Z - 2020-06-09T03:48:07.120Z - 09-06-2020

తెలంగాణలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు.. కరోనా పరీక్షలపై తమ ఆదేశాలు సరిగా అమలు కావడం లేదని ప్రభుత్వంపై మండిపడింది హైకోర్టు. ఆ ఆదేశాలు అమలు కాకపోతే వైద్యారోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. దీనికి.. వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను బాధ్యుల్ని చేస్తామని పేర్కింది హైకోర్టు.. ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకూ పరీక్షలు చేయాలన్న ఆదేశాలు అమలు కావడం లేదని గుర్తు చేసింది హైకోర్టు... అయితే, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశామని.. విచారణ జరగాల్సి ఉందన్న ఈ సందర్భంగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏజీ. దీంతో.. సుప్రీంకోర్టు విచారణ జరిగే వరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనన్న ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజల్లో కరోనా ర్యాండమ్ టెస్టులు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.. రక్షణ కిట్లు తగినంత సరఫరా చేయనందుకే వైద్యులకు కరోనా సోకిందని వ్యాఖ్యానించింది హైకోర్టు.. మీడియా బులెటిన్లలో తప్పుడు లెక్కలు ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. వాస్తవాలు తెలియకుంటే ప్రజలకు కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని అభిప్రాయపడింది హైకోర్టు.. ఈనెల 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్యారోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈవిషయంలో తెలంగాణ సీఎం కేసీయార్ వాదన మరోలా వుంది. మరణాలన్నీ కరోనాతో చనిపోయినట్టు కాదు.. 95 శాతం ఇతర కారణాలతో చనిపోతున్నారన్నారు సీఎం కేసీఆర్. కరోనాతో దేశవ్యాప్తంగా వైద్యులు కూడా చనిపోతున్నారని కేసీయార్ అన్నారు. ణలో కొత్తగా 154 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం 3650కి చేరాయి కరోనాతో తాజాగ ఐదుగురు మృతి చెందారు. లాక్ డౌన్ సడలింపుల వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందని అధికారులు అంటున్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
2 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
3 hours ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
2 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
4 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
5 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
5 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
22-04-2021
ఇంకా