కరోనా పరిస్థితిపై ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
08-07-202008-07-2020 08:03:34 IST
Updated On 08-07-2020 10:36:41 ISTUpdated On 08-07-20202020-07-08T02:33:34.825Z08-07-2020 2020-07-08T02:33:06.632Z - 2020-07-08T05:06:41.058Z - 08-07-2020

తెలంగాణలో కరోనా అదుపు తప్పుతోంది. కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదనే భావన అందరిలోనూ వ్యక్తం అవుతోంది. ప్రితి రోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,220 శాంపిల్స్ పరీక్షించగా.. 1879 మందికి పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. అలాగే ఈ ఒక్క రోజే ఏడుగురు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 27,613కి చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 313కి పెరిగింది. ఈ ఒక్క రోజులో భారీగా 1506 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 16,287కి చేరింది. ప్రస్తుతం 11,012 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1422 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్లో 94, కరీంనగర్లో 32, నల్లగొండలో 31 మంది చొప్పున కరోనా బారిన పడ్డారు. కేసులు ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 1422 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో కేసులు పెరిగిపోతున్నాయి, గతంలో కేసులు లేనిచోట కూడా కొత్త కేసులు బయటకు రావడంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరం నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు హోమ్ క్వారెంటైన్లో ఉండాలని సూచించారు. ఇందుకు అవసరమైన చర్యలను అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న రీత్యా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు సంబంధించి స్థానిక అధికారులు,ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ సమితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం, పరిశుభ్రత పాటించాలని చెప్పారు. స్వీయ నియంత్రణ అవసరమని.. ప్రజలను భాగస్వాములుగా చేసుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు కరోనా నియంత్రణకు పాటుపడాలని చెప్పారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్లే కరోనా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కట్టడిలో ఉందన్నారు. తెలంగాణకు 6వ విడత హరిత హారంలో భాగంగా క్యాంపు కార్యాలయంలో, రైతు వేదిక స్థలంలో మరికొన్ని చోట్ల మొక్కలు నాటారు. ఒక్క జనగామ జిల్లాలోనే ఈ ఏడాది 65లక్షల 92వేల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. కల్లాలు, రైతు వేదికల దరఖాస్తులకు మరో వారం రోజులపాటు గడువు పెంచుతున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా వారు జంకుతున్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
9 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
12 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
16 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
6 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
16 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
14 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
16 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
17 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
11 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
19 hours ago
ఇంకా