కరోనా దెబ్బకు భయంతో వణుకుతున్న హైదరాబాద్
05-03-202005-03-2020 08:29:30 IST
Updated On 05-03-2020 13:10:22 ISTUpdated On 05-03-20202020-03-05T02:59:30.710Z05-03-2020 2020-03-05T02:59:28.146Z - 2020-03-05T07:40:22.179Z - 05-03-2020

భయానికి భయం వేస్తే ఎలాగుంటుందో హైదరాబాద్‌లో బుధవారం ఒక్కరోజులో మారిన పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపించాయి. గత నెలరోజులుగా ప్రపంచాన్ని ఆవరిస్తున్న కరోనా వైరస్ కాస్త ఆలస్యంగా హైదరాబాద్‌లో వాలడంతో నగరం నగరం వణికిపోతోంది. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రవేశించిన కోవిడ్-19(కరోనా వైరస్) ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీలను సైతం గడగడలాడిస్తోంది. ఇంతకాలంగా కరోనా వైరస్‌పై జోకులేసుకుంటూ గడిపిన నగరవాసులు ఒక్కసారికా మెడికల్ షాపులపై పడటంతో వైరస్ రాకుండా ధరించే మాస్కులు హాట్ కేక్స్ లాగ అమ్ముడయిపోయాయి. వాస్తవ ధరకంటే ఎక్కువ ధరకు మాస్కులను అమ్మితే కఠిన చర్యలు తప్పవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా మాస్కుల ధరలు ఒక్కరాత్రికే పదిరెట్లు పెరిగాయి. ఆఫీసు పనిమీద ఇటలీ వెళ్లి తిరిగివచ్చిన మైండ్ స్పేస్‌లో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఎగ్జిక్యూటివ్‌కి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో అతిపెద్దదైన మైండ్ స్పేస్ భవనం దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఉద్యోగులు మూకుమ్మడిగా ఆఫీసులకు రావడం మాని వర్క్ ఫ్రమ్ హోమ్ కు సిద్దమయ్యారు. ఇటీవలే ఇటలీ పర్యటనకు వెళ్లొచ్చిన మైండ్‌స్పేస్ బిల్డింగ్-20లోని డీఎ్‌సఎం కంపెనీ ఉద్యోగినికి కరోనా నిర్ధారణ అయిందని ఆ సంస్థే ప్రకటించడంతో హైటెక్ సిటీ ఉలిక్కిపడింది. హైదరాబాద్‌లోని మైండ్ స్పేస్ భవంతిలో కరోనా వైరస్‌కు సంబంధించిన లక్షణాలు బయటపడటంతో సదరు బిల్డింగ్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగులను ఇంటికి పంపించి.. వర్క్ ఫ్రం హోంకు ఆదేశించాయి. హైదరాబాద్‌లో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని ఆదేశించాయి. హ్యాండ్ సానిటైజర్స్ ఉపయోగించాలని... జన సమ్మర్ధం ఉన్నచోట వస్తువులను తాకడం, కరచాలనం చేయకూడదని ఉద్యోగులకు సూచించాయి. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు మెట్ల మార్గం ఉపయోగించాలని.. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత శుభ్రత పాటించాలని పేర్కొన్నాయి. రహేజా మైండ్ స్పేస్‌లో గల ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఎగ్జిక్యూటివ్ ఇటీవలే ఇటలీకి వెళ్లి వచ్చారు. సదరు ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. ఈ విషయం అదే కంపెనీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి మెయిల్ ద్వారా మీడియాకు తెలుపడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు భయంతో కంపించిపోతున్నారు. మైండ్ స్పేస్ బ్లాక్‌లో 23 భవనాలున్నాయి. బిల్డింగ్-20లో డీఎ్‌సఎం కంపెనీ ఉంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మైండ్స్పే్సలోని కార్యాలయంతో పాటు బ్రైట్స్పేస్ భవనాన్ని కూడా ఖాళీ చేయాలని కంపెనీ ఆదేశించడంతో ఉద్యోగులంతా ఇంటిబాట పట్టారు. బిల్డింగ్-20లోని ఇతర కార్యాలయాలు సైతం తమ ఉద్యోగులను ఇంటికి పంపాయి. మరో బిల్డింగ్‌లోని వరైజాన్, యష్ టెక్నాలజీస్, ఐబీఎం, మైండ్ స్పేస్, కాగ్నిజెంట్, ఇంటెల్ తదితర కంపెనీలు సైతం ఉద్యోగులను కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించకూడదని కోరాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలని సూచించాయి. ఈ 2 భవనాల్లోని 11వేలకు పైగా ఉద్యోగులు ఇళ్లకు వెళ్లిపోయారు. కాగా, ఉద్యోగినికి వైరస్ సోకినట్లు ఇంకా నిర్ధారించలేదు. మేం భయపడుతున్నాం. ఇటలీ నుంచి తిరిగివచ్చాక ఆమె ఒకరోజు ఆఫీసులో పనిచేసింది కూడా. అంతేకాకుండా కాన్పరెన్స్ హాల్లో పెద్ద సమావేశం కూడా ఏర్పాటు చేసింది. కాన్ఫరెన్స్ హాల్ పొడవునా ఆమె తిరగడమే కాకుండా కెఫెటేరియాలోకి కూడా వెళ్లింది అని మరో సాఫ్ట్ వేర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. దీంతో రహేజా మైండ్ స్పేస్‌లోని ఉద్యోగులందరనీ ఇళ్లకు పంపించి వేశారు. హైదరాబాద్‌లో తొలి కరోనా వైరస్ కేసు గురించి బయటకు పొక్కడంతో మామూలు జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ప్రజలు కూడా వందల సంఖ్యలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఆసుపత్రులకు పోటెత్తారు. వైద్యులు రద్దీని తట్టుకుని వచ్చినవారిని సాదరంగా ఆహ్వానిస్తూ పరీక్షలు జరుపుతున్నారు. ఇలా ఉండగా సికిందరాబాద్ మహీంద్రా హిల్స్ ప్రాంతంలోని పిల్లలను పాఠశాలలకు పంపకుండా చాలామంది తల్లిదండ్రులు ఇళ్లలోనే ఉంచేసుకున్నారు. బెంగుళూరు నుంచి బస్సులో ప్రయాణించివచ్చిన ఈ ప్రాంత వాసికే తొలుత కరోనా వైరస్ సోకినట్లు తెలియడంతో మహీంద్రా హిల్స్ ప్రాంతం గజగజ వణుకుతోంది. అప్పటికే ఈ ప్రాంతంలో బస్సుల్లో ప్రయాణించి స్కూళ్లకు వచ్చిన విద్యార్థులను ఆయాలు గమనించి నలతగా ఉన్నట్లు కనిపించిన పిల్లలందరినీ తిరిగి ఇళ్లకు పంపించి డాక్టర్ వద్దకు తీసుకెల్లమని సలహా కూడా ఇచ్చారు. అంతేకాకుండా స్కూల్స్ లోని టాయెలెట్లను, రెయిలింగుల్ని, మెట్లను ఎలా ఉపయోగించాలనే విషయమై పాఠశాలలు మార్గదర్శక సూత్రాలను విడుదల చేశాయి. దాదాపు నగరంలోని అన్ని మీడియా సంస్థలు తమ ఉద్యోగులకు పరిశుభ్రత పాటించడంపై నోటీసులు అంటించాయి. నగరంలో కరొనా వైరస్ ఉనికి గురించి తెలియగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చి 15న హైదరాబాద్‌లో పౌరసత్వ సవరణ చట్టంపై జరుగనున్న భారీ బహిరంగ సభకు హాజరుకావడం రద్దు చేసుకున్నారు. నగర బీజేపీ కార్యకర్తలు, నేతలు లాల్ బహదూర్ స్టేడియంలో మార్చి 15న నిర్వహించతలపెట్టిన భారీ సభ రద్దయింది. కాగా హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగులను మరో నెలరోజుల పాటు పనుల పేరిట విదేశాలకు పంపవద్దని పోలీసులు సూచించారు. విదేశాలకు వెళ్లి తిరిగి వస్తూ కరోనాను వెంటబెట్టుకు రావడం గమనించిన ప్రభుత్వం విమానాశ్రయాలను అప్రమత్తం చేసింది. అయితే కంపెనీలు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరఫున సీపీ సజ్జనార్‌తోపాటు, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఆరోగ్యశాఖ డైరక్టర్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతి ఇచ్చేటప్పుడు ఐటీ, పరిశ్రమల శాఖకు తెలపాలని సూచించారు. తమ అనుమతి లేకుండా కంపెనీలు ఖాళీ చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. డీఎస్ఎమ్ కంపెనీ ఒక్కరోజు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించదన్నారు. కేవలం 23 మందికి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చారని తెలిపారు. సహచర ఉద్యోగులుకు కరోనా సోకిందనేది అవాస్తవం అన్నారు. ఐటీ కారిడర్ ఖాళీ కాలేదని, వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాధికారులు కోరారు. ఇది గాలి ద్వారా సోకే వైరస్ కాదని తెలిపారు. కేవలం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుందన్నారు. చేతులను నిరంతరమ సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. వచ్చే రెండు నెలల వరకు ఐటీ ఉద్యోగులను విదేశాలకు పంపొద్దని కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. కరోనా గురించి అనుమానాలు ఉంటే 104కు కాల్ చేయవచ్చని చెప్పారు. నగరంలోని సాఫ్ట్ వేర్ ఆఫీసులనుంచి బుధవారం రోజు 11 వేలమంది ఉద్యోగులను ఇంటికి పంపించిన కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం కి ఆదేశాలిచ్చాయి. ఉద్యోగుల ఆరోగ్య రక్షణే తమ తొలి ప్రాధాన్యమంటూ ‘వర్క్ ఫ్రం హోం’కు పలు కంపెనీలు వెసులుబాటు ఇవ్వగా.. దీనికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలంటూ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రకటించడంపై ఐటీ ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారు. అమెజాన్, గూగుల్ లాంటి కంపెనీలు విదేశాల్లో ఉద్యోగుల ఆరోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండగా.. హైదరాబాద్‌లో పూర్తి విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
13 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
9 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
12 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
14 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
16 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
18 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
19 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
21 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
21 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
a day ago
ఇంకా