newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా చికిత్స అనుమతుల రద్దు.. కార్పొరేట్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వ ఆగ్రహం..

02-08-202002-08-2020 08:18:43 IST
2020-08-02T02:48:43.519Z02-08-2020 2020-08-02T02:48:40.424Z - - 22-04-2021

కరోనా చికిత్స అనుమతుల రద్దు.. కార్పొరేట్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వ ఆగ్రహం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్-19 చికిత్స మార్గదర్శక సూత్రాలను ఉల్లంఘించి లక్షల్లో ఫీజులు గుంజుతున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులపై తెలంగాణ ప్రభుత్వం మండిపడింది. ఆయా ఆస్పత్రులకు ఇచ్చిన కరోనా చికిత్స అనుమతులను రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. భారీగా ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఇలాంటి ఆస్పత్రులపై రెండు, మూడు రోజుల్లో తనిఖీలు నిర్వహించి చికిత్సలు, ఫీజుల రికా ర్డులను పరిశీలించనుంది. అందుకోసం బృందాలను సిద్ధం చేసింది. 

కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు సభ్యులు చనిపోయినా మానవత్వం మరిచి ఇంకా రూ. లక్షలు చెల్లించాలంటూ ఒక ఆస్పత్రి డిమాండ్‌ చేసిన విషయం మంత్రి కేటీఆర్‌ దృష్టికి రావడం, దానిపై ఆయన స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌కు సూచించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాసుల కక్కుర్తి ప్రదర్శిస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలకు సర్కారు రంగం సిద్ధం చేసింది. కరోనా చికిత్స పేరిట రోగుల నుంచి రూ. లక్షల్లో ఫీజులు గుంజుతున్న ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులపై రాష్ట్ర ప్రభుత్వం అటోఇటో తేల్చుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రైవేట్‌ ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుచేసి విచారణ జరిపించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశాలు జారీచేశారు. ఈ అంశంపై శనివారం ఆయన బీఆర్కే భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం ధరలు నిర్ణయించినా.. మందులు, పీపీఈ కిట్లు, ఐసీయూ చార్జీలు, వైద్య సిబ్బందికి అధిక జీతాల పేరుతో అడ్డగోలుగా ప్రజల మీద భారం మోపడం తగదని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. వైద్యం అందించాల్సిన బాధ్యత మర్చిపోయి ప్రైవేట్‌ ఆస్పత్రులు లాభాల కోసం మానవతా దృక్పథం లేకుండా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సమయంలో ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ వ్యాపార కోణంలో ఆలోచించకుండా, ప్రజల ప్రాణాలు కాపాడటంలో తమవంతు బాధ్యత పోషించాలని కోరారు. ప్రజల భయాన్ని సొమ్ము చేసుకోవడం తగదన్నారు. సాధారణ పరిస్థితి కంటే పది రెట్లు ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం ఫీజుల వసూలు, పడకల ఖాళీలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందించడం చేయాలని ఆదేశాలు జారీచేశారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

రాష్ట్రంలోని చాలా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా వేళ యాజమాన్యాలు కనికరం చూపట్లేదని, అధిక ఫీజు వసూళ్లు, నాసిరకం వైద్యం చేస్తున్నాయని మండిపడుతున్నారు. కరోనా చికిత్సలకు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏవైనా సమస్యలుంటే తమకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం గత నెల 16న 9154170960 వాట్సాప్‌ నంబర్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వెయ్యికిపైగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల్లో ఎక్కువగా ఫీజుల దోపిడీకి సంబంధించినవే ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. 

అలాగే ప్రైవేటు బీమా సౌకర్యం ఉన్నా ఆస్పత్రులు దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా డబ్బులు వసూలు చేస్తున్నాయని మరికొందరు ఫిర్యాదు చేశారు. కరోనా నెగెటివ్‌ వచ్చినా పాజిటివ్‌ అని చెప్పి వైద్యం చేస్తూ రూ. లక్షలు గుంజుతున్నాయని మరికొన్ని ఫిర్యాదులు అందాయి. విచిత్రమేంటంటే ఒక పెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రి అయితే ఒక వ్యక్తికి వైద్యం చేసినందుకు ఏకంగా రూ. 18 లక్షలకుపైగా బిల్లు వేసిందని ఫిర్యాదు అందింది. కొందరికి సాధారణ లక్షణాలున్నా ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి రూ. లక్షల్లో ఫీజు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 

ఒక కుటుంబానికైతే తీవ్ర ఆవేదన కలిగించేలా ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం వ్యవహరించింది. కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని, ఫీజు కింద మొత్తం రూ. 5 లక్షలు చెల్లిస్తే డిశ్చార్జి చేస్తామని చెప్పింది. తీరా ఫీజు కట్టాక ఆ కుటుంబానికి శవాన్ని అప్పగించినట్లు ఫిర్యాదు అందిందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. శవాలపై పేలాలు ఏరుకున్నట్లుగా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు వ్యవహరిస్తున్నాయని బాధితులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు.

ఈ వ్యవహారం మంత్రి కేటీఆర్‌ దృష్టికి రావడంతో వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగం మొత్తం కదిలింది. అమానుషంగా వ్యవహరిస్తున్న కొన్ని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. నెల క్రితం కొన్ని ప్రైవేటు డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఇష్టారాజ్యంగా, నాసిరకంగా కరోనా పరీక్షలు చేసినప్పుడు వాటికి నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం... ఇప్పుడు కొన్ని ఆస్పత్రులకు కరోనా చికిత్స చేసే వెసులుబాటును రద్దు చేయనుంది. దీనిపై ఇప్పటికే వాటికి నోటీసులు పంపింది. అన్ని నిబంధనలనూ ఉల్లంఘిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులలో చేరవద్దని, ఉచితంగా లభిస్తున్న వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేరాలని ప్రజలను కోరింది.

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   6 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   9 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   13 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle