newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘‘కరోనా కేసుల కట్టడిలో చిత్తశుద్ధి ఏదీ?’’

13-06-202013-06-2020 09:26:05 IST
Updated On 13-06-2020 12:49:12 ISTUpdated On 13-06-20202020-06-13T03:56:05.915Z13-06-2020 2020-06-13T03:55:53.967Z - 2020-06-13T07:19:12.679Z - 13-06-2020

‘‘కరోనా కేసుల కట్టడిలో చిత్తశుద్ధి ఏదీ?’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి, కరోనా కేసులకు చికిత్స అందించడంలో గాంధీ ఆస్పత్రిపై వత్తిడి పెరుగుతోంది. కరోనా వల్ల చనిపోయిన వాకి మృతదేహాలకు టెస్టులు నిర్వహించడంలో అలసత్వంపై హైకోర్టు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. కరోనా వైరస్ జీహెచ్‌ఎంసీ సిబ్బందిని వెంటాడుతోంది. ఇప్పటికే 10 మంది బల్దియా సిబ్బందికి కరోనా సోకింది. మేయర్‌ బొంతు రామ్మోహన్ డ్రై వర్‌కు పాజిటివ్ వచ్చింది.

మేయర్‌ పేషీలో అటెండర్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో మిగిలినవారికి కూడా టెస్టులు చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన డ్రైవర్‌ డ్యూటీ చేసినట్టు తెలుస్తోంది. డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో మేయర్‌ బొంతు రా మ్మోహన్ తోపాటు కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌ అయ్యారు. మేయర్ మరోసారి టెస్టులు చేయించుకున్నారు. నాలుగు రోజుల క్రితమే బొంతు రామ్మోహన్‌ కు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు నెగటివ్‌ అని తేలింది.

మరోవైపు కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కరోనా వైరస్ కలకలం కలిగిస్తోంది.  గాంధీ ఆస్ప‌త్రి, ఉస్మానియా, నిలోఫ‌ర్ ఆస్ప‌త్రుల్లో వైద్యులు, సిబ్బంది అనేక మంది కోవిడ్ బారిన‌ప‌డ్డారు. తాజాగా రంగారెడ్డి జిల్లా కొండాపూర్ ఏరియా ఆస్ప‌త్రిలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. ఆస్ప‌త్రి సూరింటెండెంట్‌కు క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో అదే ఆస్ప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డుకు త‌ర‌లించి చికిత్స అంద‌జేస్తున్నారు. గ‌త మూడ్రోజులుగా హైఫీవ‌ర్‌తో సూప‌రింటెండెంట్‌ బాధ‌ప‌డుతుండ‌గా..అత‌న్ని ప్రైమ‌రీ కాంటాక్టుల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ఇటు ఆస్ప‌త్రి సిబ్బంది మొత్తానికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలని నిర్ణయించారు అధికారులు. 

ఇటు తెలంగాణలో కరోనా కేసులు పెరగడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వ తీరుని తప్పుుబట్టారు. ‘‘నాలుగు కోట్ల జనాభాకు ఒక్క గాంధీ ఆస్పత్రా? రాష్ట్రంలో 15 మెడికల్‌ కాలేజీలున్నాయి. లెక్క ప్రకారం ప్రతి కాలేజీలో ఆరు వందల పడకలు ఉండాలి. అన్ని చోట్లా ఆ సంఖ్యలో ఉన్నాయా? ఉంటే వాడుతున్నారా? లేకపోతే వాటి అనుమతి రద్దు చేస్తారా?.’’ అని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, పలువురు వక్తలు ప్రశ్నించారు.

నాంపల్లిలో వైద్యరంగ నిష్ణాతులతో రౌండ్‌ టేబుల్‌ సదస్సు నిర్వహించారు కోదండరాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గచ్చిబౌలి టిమ్స్‌లో ఒక్క డాక్టరూ లేరూ, ఒక్క నర్సూ లేరని పలువురు వక్తలు విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జూనియర్‌ డాక్టర్లు, ప్రజలు పరస్పరం తన్నుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని, పరీక్షల పూర్తి వివరాలు అందించాలని కోర్టు ఆదేశించినా.. ప్రభుత్వం మిన్న‌కుండ‌డం స‌రికాద‌న్నారు. కరోనా నిర్మూలన కోసం హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్ర‌భుత్వం వెంటనే అమలు చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో కరోనా చికిత్స అందించాలని, ప్ర‌జారోగ్యం పై ప్రభుత్వం ఇంకా ఎక్కువగా ఖర్చు చేయాలని అన్నారు.

జిహెచ్ఎమ్‌సీలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంపై కేసీయార్ స్పందించడం లేదన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తక్షణం అఖిల పక్ష భేటీ జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే ప్రతిపక్షాలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదన్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle