newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా కాటు.... ప్రైవేటు హాస్పిటల్ వన్డే బిల్లెంతో తెలుసా?

05-07-202005-07-2020 16:55:31 IST
Updated On 05-07-2020 17:17:52 ISTUpdated On 05-07-20202020-07-05T11:25:31.785Z05-07-2020 2020-07-05T11:24:57.772Z - 2020-07-05T11:47:52.938Z - 05-07-2020

కరోనా కాటు.... ప్రైవేటు హాస్పిటల్ వన్డే బిల్లెంతో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత బెంబేలెత్తిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా మహమ్మారి వైరస్ నియంత్రణలోకి రాని పరిస్థితి నెలకొంది. భారత దేశంలో కేసుల సంఖ్య కూడా బాగా పెరిగిపోతోంది. గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 24,850 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. 613 మంది  మృతి చెందగా పాజిటివ్ కేసులు  6,73,165కు చేరాయి. 19,268కు పెరిగిన మృతుల సంఖ్య..యాక్టీవ్ కేసులు 2,44,814, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,09,083.ఈ ఉదయానికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య కోటీ 13లక్షల 86వేల 433కు  చేరుకుంది. అలాగే కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5లక్షల 33 వేల, 580కి పెరిగింది. అగ్రరాజ్యం అమెరికా కరోనా కేసులు, మరణాల విషయంలో ప్రథమ స్థానంలో నిలిచింది.

దేశం                                                      కరోనా కేసులు                                                 మరణాలు

అమెరికా                                                  2,935,770                                                    132,318

బ్రెజిల్                                                      1,578,376                                                      64,365

రష్యా                                                        674,515                                                        10,027

ఇండియా                                                673,904                                                        19,279

పెరు                                                        299,080                                                        10,412

ఒక్క రోజు బిల్లు లక్షా 15వేలు.. రోగి నిర్బంధం 

కరోనా వైరస్ ట్రీట్ మెంట్ ఎంత ఖరీదైంతో జనాలకు అర్థం అవుతోంది. తాజాగా కరోనాకు చికిత్స పేరుతో ఒక్క రోజులోనే లక్ష రూపాయలు బిల్లు వేసిన ఘటన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జరిగింది. పైపెచ్చు ఈ విషయాన్ని ప్రశ్నించిన రోగిని ఆసుపత్రి సిబ్బంది నిర్బంధించారు. నగరంలో సంచలనం సృష్టిస్తున్న ఘటనపై చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నగరంలోని ఫీవర్ ఆసుపత్రి డీఎంవో సుల్తానా కరోనా లక్షణాలతో చాదర్ ఘాట్ వద్ద ఉన్న తుంబే హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. 

అయితే చికిత్స అందించిన ఆసుపత్రి వైద్యులు... ఆమెకు 24గంటలకు రూ.1.15లక్షల బిల్లు వేశారు. ఆ బిల్లు దెబ్బకు ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె.. ఇదేంటని ప్రశ్నించారు. దీంతో సదరు ఆసుపత్రి యాజమాన్యం ఆమెను నిర్బంధించింది.  సరైన చికిత్స అందించడం లేదని, ఆసుపత్రి వర్గాలు బాధిస్తున్నాయని వాపోయారు. అంత పెద్ద హాస్పిటల్ వైద్యురాలికే ఇంతలా ఇబ్బందులు ఎదురవుతుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అవకాశం వచ్చింది కదాని లక్షల్లో బిల్లు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై సామాన్యులు మండిపడుతున్నారు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle