కరోనా కట్టడిలో కేసీఆర్ ఫెయిలా.. మరి మోదీ పాసయ్యారా.. కేటీఆర్ సవాల్
14-07-202014-07-2020 09:08:15 IST
Updated On 14-07-2020 12:04:24 ISTUpdated On 14-07-20202020-07-14T03:38:15.150Z14-07-2020 2020-07-14T03:38:11.503Z - 2020-07-14T06:34:24.584Z - 14-07-2020

కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో ప్రతిపక్షాలు నోరు పారేసుకుంటున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం లేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షలను ఇంకా పెంచమంటే పెంచుతామని స్పష్టం చేశారు. విమర్శలకు ఇది సమయం కాదని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలసి సోమవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. ‘కరోనా విషయంలో సీఎం కేసీఆర్ విఫల మయ్యారని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. కొన్ని పత్రికలూ అదే రాస్తున్నాయి. మరి పాస్ అయిందెవరో, కరోనాను పూర్తిగా ఎవరు నిర్మూలించారో ప్రపంచంలో.., అలాగే దేశంలో ఒక్కరిని చూపించండి. ఎవరైనా నాయకుడు లేదా ఏదైనా ఒక ప్రభుత్వం గొప్పగా ఏ పనైనా చేసిందా? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చేత సాయం, మాట సాయం చేయాలే తప్ప విమర్శలు తగవు. ఏదైనా ఉంటే నిర్మాణాత్మక సూచన లివ్వండి.. వాటిని కచ్చితంగా పాటిస్తాం’ అంటూ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే కరోనా వ్యాప్తిలో భారత్ మూడవ స్థానంలో ఉందని, దాని ప్రకారం ప్రధాని మోదీ ఫెయిల్ అని అందామా? అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరోనా లాంటి అతిపెద్ద విపత్తులో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని, కానీ వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయవొద్దని విపక్షాలకు ఆయన హితవు చెప్పారు. కరోనా విషయంలో కలిసి రావాలని విపక్షాలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 34 వేల మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వారిలో 98 శాతం మంది పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్తున్నారని చెప్పారు. కేవలం 2 శాతం మంది మాత్రమే చనిపోతున్నారన్నారు. ‘ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే కరోనా కేసుల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. మరి దీనికి ప్రధాని మోదీ వైఫల్యమనుకోవాలా’అని ప్రశ్నించారు. కరోనా వ్యాక్సిన్ కోసం దేశంలో ఆరు ఫార్మా కంపెనీలు పని చేస్తుంటే వాటిలో భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్యునలాజికల్స్, బయలజికల్ ఇవాన్స్, శాంతా బయోటెక్స్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేయడం మనం గర్వించదగ్గ విషయమన్నారు. కరోనా విజృంభన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విపక్ష పార్టీలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఈ విమర్శలపై మంత్రి కేటీఆర్ సున్నితంగా స్పందించారు. ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారమే పరీక్షలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పెద్ద మొత్తంలో కరోనా కేసుల్లో 98 శాతం మంది బాధితులు రికవరీ అవుతున్నారని, 2 శాతం మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. విపక్ష నేతలు ఆ 2 శాతంపైనే ఫోకస్ చేయడం సరికాదన్నారు. కాగా, కోవిడ్ 19 తర్వాత ప్రైవేటు ఆస్పత్రుల్లో చాలా మంది పేషెంట్లను తిరస్కరించినా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందించామని చెప్పుకొచ్చారు. చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లిన వారు డబ్బులు కడతామన్నా.. పడకలు లేవని వారిని వెళ్లగొడుతున్నాయని, ప్రైవేట్ రంగం తిరస్కరించినా కరోనా రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య సిబ్బందే అండగా నిలుస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో నాలుగు కోట్ల మందికి ఒక్క గాంధీ ఆస్పత్రిలో మాత్రమే చికిత్స అందుతున్నట్లు ప్రజలు అపో హలో ఉన్నారన్నారు. అది నిజం కాదని, వికేంద్రీకరణతో స్థానికంగా ఎక్కడికక్కడ కరోనా వైద్య సేవలందిస్తున్నామని స్పష్టంచేశారు. దాదాపు అన్ని జిల్లాలకూ రాపిడ్ యాంటిజన్ కిట్లు సరఫరా చేశామని చెప్పిన మంత్రి.. కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభించామన్నారు. నేడు భారతదేశంలో ఫార్మా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీ చేసేందుకు పోటీ పడుతున్నాయని, ఆ కంపెనీల్లో ఇండియాకు చెందిన ఆరు కంపెనీలో ఉన్నాయని చెప్పారు. ఇక ఆ ఆరు కంపెనీల్లో నాలుగు తెలంగాణ రాష్ట్రానికి చెందినవేనని పేర్కొన్నారు. కరోనాపై పోరాటం సాగిస్తున్న తరుణంలో వైద్యుల, ప్రభుత్వ పెద్దల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా కాకుండా ప్రతిపక్షాలు సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
2 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
3 hours ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
3 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
4 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
5 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
5 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
22-04-2021
ఇంకా