newssting
BITING NEWS :
*ప్రధాని నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ.. లాక్ డౌన్ పై చర్చ *మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహరంలో తుది తీర్పు .. వెంటనే విధులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం *కొండపోచమ్మ జలాశయం ప్రారంభం. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం.. ఇదో ఉజ్వల ఘట్టం అన్నకేసీయార్ *కరోన ఇప్పుడే పోయేది కాదు..సౌదీ అరేబియా నుండి వందలాది మంది వస్తున్నారు..కరోన అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు..ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి : ఈటల *ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 50కి పైగా కేసులలో చుక్కెదురైనా పద్ధతి మార్చుకోవడం లేదు..రమేష్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం : సీఎం రమేష్ - ఎంపీ *ఏపీలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి.3330 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.కరోనాతో 60 మంది మృతి * చోటా కె.నాయుడు సోదరుడు అరెస్ట్..ఎస్.ఆర్.నగర్‌లో శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు..ఆర్టిస్ట్ సుధను పెళ్లిపేరుతో మోసం చేశాడని ఆరోపణ..సుధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు*భారత్ లో విజృంభిస్తున్న కరోనా. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కరోనా కేసులు. 175 మంది మృతి. దేశవ్యాప్తంగా 1,65,799 కి చేరిన కరోనా కేసులు. 89,987 యాక్టివ్ కేసులుండగా, 71,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మొత్తం 4,706 కరోనా మరణాలు

కరోనా కట్టడికి నడుం బిగించిన సీఎం కేసీఆర్!

21-03-202021-03-2020 11:09:59 IST
2020-03-21T05:39:59.781Z21-03-2020 2020-03-21T05:39:57.392Z - - 30-05-2020

కరోనా కట్టడికి నడుం బిగించిన సీఎం కేసీఆర్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా వైరస్ ఉదృతంగా వ్యాపిస్తుంది. రోజులు గుడుస్తుంటే కేసులు కూడా పెరుగుతూ పోతున్నాయి. హైదరాబాద్ నగరంలోని మహీంద్రా హిల్స్ లో నమోదైన తొలి కేసుతో మొదలై కరీంనగర్ లో ఒకేసారి ఏడు పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. కరీంనగర్ కు కరోనా తెచ్చిన ఇతర దేశాల నుండి వచ్చిన మత ప్రచారకులు రాష్ట్రంలో ఎక్కడెక్కడ తిరిగారో ప్రభుత్వం గత రెండు రోజులుగా మొత్తం జల్లెడపడుతుంది.

ఇక కరీంనగర్ లో అయితే ఆ వ్యక్తులు దిగిన రైల్వేస్టేషన్ బస చేసిన హోటల్ చుట్టూ మొత్తం మూడు కిమీ పరిధిలో ప్రతి ఒక్కరికి, ఇంటింటికి తిరిగి ధర్మల్ స్క్రీనింగ్ చేశారు. ఎవరూ కూడా ఇళ్ల నుండి బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరించింది. మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ లోనే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. ఇక శుక్రవారం కూడా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమవుతుంది.

కరోనా కట్టడి చర్యలలో భాగంగా సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. శనివారం సీఎం కరీంనగర్ లో పర్యటనకు వెళ్లారు. నిజానికి శుక్రవారమే ఈ పర్యటన ఉండగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫిరెన్స్ ఉండడంతో శనివారానికి వాయిదా వేసుకున్నారు. ఏకంగా సీఎం రంగంలోకి దిగుతుండడంతో ప్రభుత్వ వర్గాలలో మరింత అప్రమత్తత మొదలైంది.

ఇప్పటికే కరీంనగర్ లో వంద వైద్య బృందాలు.. పోలీసు వర్గాలు, మంత్రులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నా సీఎం స్వయంగా పర్యటించడం మంచి పరిణామమే. కరోనా అంటే ప్రస్తుతం ప్రజలలో ఒకవిధమైన ఆందోళన నెలకొంది. అసలే వైద్య బృందాలు ఎక్కడిక్కడ ప్రజలను పరీక్షలు చేయడంతో ఏదో అయిపోతుందన్న భావన కరీంనగర్ ప్రజలలో నెలకొంది. ఈక్రమంలో అక్కడ నివారణ చర్యలతో పాటు ప్రజలకు భరోసా కల్పించడం చాలా అవసరం.

దీనికోసమే సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా పర్యటించి అక్కడి పరిస్థితులపై అంచనా వేసి అందుకు తగిన విధంగా చర్యలకు సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే అక్కడ మంత్రులకు బాధ్యతలు అప్పగించినా  పరిస్థితులను బట్టి ఆ జిల్లా కోసమే ప్రత్యేక నిధులను ప్రకటించడంతో పాటు సీఎం కార్యాలయంలో పనిచేసే ఐఏఎస్ అధికారులలో ఒకరిని కరీంనగర్ బాధ్యతలు చూసేలా ఇంచార్జిగా నియమించనున్నట్లుగా తెలుస్తుంది.

ప్రస్తుతం సీఎంఓలో ఉన్న అధికారులలో స్మితా సభర్వాల్ గతంలో కరీంనగర్ జిల్లా కలెక్టరుగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అందునా విధుల నిర్వహణలో ఎక్కడా కాంప్రమైజ్ కారన్న పేరు కూడా స్మితా సొంతం. అందుకే ఇప్పుడు అక్కడనున్న పరిస్థితులలో ఆమెను ఇంచార్జిగా నియమించే అవకాశం ఉంది. మరోవైపు రానున్న రెండు రోజులలో పరిస్థితులను బట్టి జిల్లాలో పూర్తిస్థాయి నియంత్రణ విధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

కరోనా మహమ్మారి ప్రభావం ఎంతో తెలిసినా మంత్రులు అక్కడే ఉండి ప్రజలకు భరోసా నింపడం హర్షించదగిన విషయం కాగా వైద్యశాఖ, మంత్రులు, యంత్రాంగం అక్కడే ఉండి పనిచేస్తున్నా సీఎం కూడా క్షేత్రస్థాయికి వెళ్లి సమీక్ష చేస్తుండడం మంచి పరిణామంగా చెప్పుకోవాలి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతగా శ్రమిస్తుండగా ప్రజలు స్వీయ నియంత్రణ, తగిన జాగ్రత్తలు తీసుకోకుపోతే ఎంతటి చర్యలు కూడా సూన్యమే అవుతుంది. ప్రజలు కూడా అందుకు తగిన విధంగా అప్రమత్తతతో వ్యవహరించి మహమ్మారిని ఎదుర్కోవాలని ఆశిద్దాం!

 

 

కొని తెచ్చుకున్న వివాదాలతో జగన్ రాజకీయ పోరాటం!

కొని తెచ్చుకున్న వివాదాలతో జగన్ రాజకీయ పోరాటం!

   an hour ago


తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

   15 hours ago


 కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

   15 hours ago


కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

   19 hours ago


నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి..  జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

   20 hours ago


శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

   a day ago


జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

   a day ago


కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

   a day ago


కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

   a day ago


కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle