కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ, పోలీసుల మాస్టర్ ప్లాన్
23-04-202023-04-2020 10:54:18 IST
Updated On 23-04-2020 11:30:20 ISTUpdated On 23-04-20202020-04-23T05:24:18.914Z23-04-2020 2020-04-23T05:24:13.689Z - 2020-04-23T06:00:20.878Z - 23-04-2020

హైదరాబాద్ నగరంలో కరోనా కట్టడికి పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ ఎప్పటికప్పుడు అధికారులతో మమేకం అవుతున్నారు. వలస కూలీలు, నిరు పేదలు పస్తులుండకుండా భోజనం, వసతి ఏర్పాటు చేశామని మేయర్ బొంతు రామ్మోహన్ చెబుతున్నారు. ఈ నెల రోజులు ప్రజలు లాక్ డౌన్ కు ఎంతో సహకరించారని, మే 7 వ తేదీ వరకు ప్రజలు ఇళ్ల లోనే ఉండాలని ఆయన సూచించారు.
పారిశుద్ధ కార్మికుల రుణం తీర్చుకోలేనిదని, వైద్యులు, పోలీసుల సేవలు అమోఘం అన్నారు. కార్డు లేని వారికి బియ్యం,500 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. నగరంలో ఇంటి యజమానులు రెంట్ల కోసం ఇబ్బంది పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోహ్యంగాల పై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. కంటైన్మెంట్ ఏరియా లలో అవసరాలు తీర్చడానికి మున్సిపల్ సిబ్బందిని నియమించామన్నారు. లాక్ డౌన్ కారణంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం ఏర్పడిందన్నారు. నగరంలో 3 వేల కోట్ల తో రోడ్లు వెడల్పు, కాలువల నిర్మాణాలతో పాటు అనేక పనులు చేపట్టామన్నారు. ప్రజలు లాక్ డౌన్ పాటించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు.

మరోవైపు లాక్ డౌన్ వేళ యథేచ్ఛగా రోడ్లమీదకు వచ్చేవారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మార్చి 23 నుంచి ఇప్పటివరకు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నమోదైన 5,88,989 ఉల్లంఘన గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. 15,605 వాహనాలను ఇరు కమిషనరేట్ల పోలీసులు సీజ్ చేశారు. సైబరాబాద్‌లో 5,05,439 ట్రాఫిక్ కేసులు నమోదు కాగా.. 10,694 వాహనాలను సీజ్ చేశారు.

ఇటు రాచకొండలో 83,550 ట్రాఫిక్ కేసులు నమోదైతే 4,911 వాహనాలు సీజ్ అయ్యాయి. మూడు కిలోమీటర్ల పరిధిని చూసీ చూడనట్టు వ్యవహరించిన పోలీసులు రెండు రోజులుగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆయా చోదకుల ఆధార్‌కార్డు చిరునామా ఆధారంగా వాహనాలను సీజ్ చేస్తున్నారు. సరైన కారణం ఉంటే తప్ప పోలీసులు వదలడంలేదు. సీజ్ చేసిన వాహనాలను సమీప ఠాణాలకు తరలిస్తున్నారు. లేదంటే సమీప ప్రాంతాల్లోని సినిమా థియేటర్ల ఆవరణలో పార్కింగ్ చేస్తున్నారు.
లాక్‌డౌన్‌ను వచ్చే నెల మే 7 వరకు పొడిగించడంతో ఈసారి సమర్థంగా అమలుచేస్తున్నాం. లాక్డౌన్ ముగిశాక సంబంధిత వాహనదారులు కోర్టుకు హాజరు కావాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు రెండు నెలల సమయం పట్టవచ్చు. అందుకని ఎవరూ రోడ్లపైకి రావద్దని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. ఇటు రంజాన్ మాసం ప్రారంభం కానుండడంతో పాతబస్తీ దారులన్నింటినీ మూసివేశారు.

ఫ్లై ఓవర్ బ్రిడ్జ్‌పై రాకపోకలను కట్టడిచేశారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనిల్‌కుమార్, నగర ట్రాఫిక్ డీసీపీ బాబురావు తదితరులు పాతబస్తీలో పర్యటించి లాక్డౌన్ అమలు తీరును స్వయంగా పరిశీలిస్తున్నారు. అవసరమయిన సూచనలు, ఆదేశాలు జారీచేస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో లాక్డౌన్ అమలు జరగడం లేదు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడం లేదు. అన్నదానాలు, నిత్యావసర సరుకుల పంపిణీ కొనసాగుతూనే ఉంది. గ్రామాల్లో అక్రమంగా కల్లు, మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.
ఇటు రెడ్ జోన్ అమలు జరుగుతున్న ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో లాక్డౌన్ పటిష్టంగా అమలు జరుగుతుంది. సరైన కారణం లేకుండా బయటకు వస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు బుక్ చేస్తున్నారు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్ వెనక వీధి, ఖైరతాబాద్ ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్, చింతల్‌బస్తీ, ఫిలింనగర్, బంజారాహిల్స్ సయ్యద్‌నగర్, వెంకటగిరి ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో బారికేడ్లు, గ్రిల్స్ ఏర్పాటు చేశారు.ప్రజలకు ఇళ్ల వద్దకే నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
9 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
12 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
15 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
5 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
15 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
13 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
16 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
16 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
10 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
19 hours ago
ఇంకా