newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా ఎఫెక్ట్ : వ్యాపారస్తుల అనూహ్య నిర్ణయం

19-06-202019-06-2020 08:32:17 IST
Updated On 19-06-2020 10:40:42 ISTUpdated On 19-06-20202020-06-19T03:02:17.157Z19-06-2020 2020-06-19T02:55:55.826Z - 2020-06-19T05:10:42.914Z - 19-06-2020

కరోనా ఎఫెక్ట్ : వ్యాపారస్తుల అనూహ్య నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గురువా రం ఒక్కరోజే ఏకంగా 352 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 6 వేలు దాటింది. గురువారం నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 302 ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్‌ జిల్లాలో 10, మంచిర్యాలలో 4, జనగామ, వరంగల్‌ అర్బన్‌లో 3, భూపాలపల్లి, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో రెండు చొప్పున, ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కేసులు వెలుగుచూడడంతో వ్యాపారస్తులు కూడా ముందస్తు జాగ్రత్తలకు దిగారు. 

హైదరాబాద్‌లో స్వచ్చందంగా లాక్‌డౌన్ విధించుకున్నారు వ్యాపారస్తులు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే షాపులు తెర‌వాల‌ని మార్కెట్ అసోసియేష‌న్ తీర్మానం చేయడం చర్చనీయాంశం అయింది. హైదరాబాద్ లో భారీగా వ్యాపారం జరిగే బేగం బజార్, ఫిల్‌ఖనా, సిద్ధి అంబర్ బజార్ సాయంత్రం 3 గంటల వరకే తెరిచి వుంచుతారు.

బేగంబజార్‌ హైదరాబాదీయులకే కాదు తెలుగు రాష్ట్రాల వారికి కూడా పరిచయమయిన పేరు. ఏ వస్తువైనా చౌకగా లభిస్తుండటంతో చిన్నచిన్న వ్యాపారులంతా ఇక్కడి నుంచే కొనుగోలు చేసి తమ ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. నిత్యం దాదాపు రూ.500 కోట్ల మేర ఇక్కడ లావాదేవీలు జరుగుతాయని అంచనా.

కరోనా కారణంగా బేగంబజార్ అల్లాడిపోతోంది. ఈవైరస్‌ మహమ్మారి ఎక్కడ నుంచి ఎలా వస్తుందో తెలీక వ్యాపారస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌ సమయాన్ని తగ్గించాలని నిర్ణయించారు. శుక్రవారం నుంచి ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హోల్‌సేల్‌ కిరాణా దుకాణాలు తెరిచి ఉంచుతామని అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠీ తెలిపారు. కరోనా పెరుగుతుండటం తో తమ వ్యాపారస్తులంతా భయంతోనే వ్యాపారాలు చేస్తున్నారని పేర్కొన్నారు.  దీంతో స్వచ్ఛందంగానే తాము లాక్ డౌన్ విధించుకున్నామన్నారు. 

లాక్ డౌన్ ప్రారంభమయిన మార్చి 22 నుంచి బేగంబజార్‌లోని నిత్యావసర వస్తువుల దుకాణాలు మినహా మిగిలినవన్నీ మూసేశారు. దీంతో వ్యాపారులు తీవ్రస్థాయిలో నష్టపోయారు. లాక్‌డౌన్‌లో కూడా నిత్యవసర వస్తువుల దుకాణాలను ఉద యం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వ రకు తెరిచి ఉంచారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంచారు. ప్రస్తుతం వినియోగదారులు ఎక్కువగా నిత్యావసర వస్తువులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో అద్దెకు తీసుకున్న వ్యాపారస్తులకు అద్దె డబ్బులు కూడా రావడం లేదని, అప్పుల పాలయిపోయామని వాపోతున్నారు. 

గుండుసూది నుంచి బంగారం, వెండి వస్తువులు, ఎలక్ట్రానిక్స్, అలంకరణ సామాగ్రి, తినుబండారాలు, సుగంధ ద్రవ్యాలు బేగంబజార్‌లో తక్కువ ధరకే దొరుకుతాయి.  నిజాం కాలంనుంచే కాదు ఏకంగా 1770 నుంచే ఇక్కడ మార్కెట్‌ కొనసాగుతోంది. వందల సంఖ్యలో ఉన్న దుకాణాల్లో రోజూ కోట్లలో వ్యాపారం జరుగుతుంది.

ఈ దుకాణాలన్నీ జనంతో నిత్యం కిటకిటలాడుతుంటాయి. కరోనా వల్గ గత మూడునెలలుగా బేగంబజార్ కళ తప్పింది. తాజా నిర్ణయానికి కిరాణా వ్యాపారులు కూడా మద్దతు తెలిపారు. కిరాణా షాపులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తెరుస్తారు. అంతేకాదు కరోనా నివారణ చర్యలు కూడా తీసుకుంటున్నారు. ప్రతి షాపులో థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటుచేశారు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేయడంతోపాటు వినియోగదారులకు చేతి గ్లౌజులు అందించడం, వారికి శానిటైజర్లు ఇవ్వడం, భౌతిక దూరం నిబంధనలు అమలుచేయనున్నారు. 

 

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   26 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle