newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా ఎఫెక్ట్.. యాదాద్రి మూడు రోజులు బంద్!

09-09-202009-09-2020 15:09:21 IST
2020-09-09T09:39:21.778Z09-09-2020 2020-09-09T09:39:17.079Z - - 19-04-2021

కరోనా ఎఫెక్ట్.. యాదాద్రి మూడు రోజులు బంద్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇక్కడా అక్కడా అని లేకుండా అంతటా కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుల నుండి ప్రజాప్రతినిధుల వరకు వైరస్ బారినపడుతుండగా దేవాలయాలు, ప్రార్ధన మందిరాలలో సైతం పాజిటివ్ కేసుల నమోదుతో మహమ్మారి హడలెత్తిస్తోంది. ఇప్పటికే ప్రపంచ ప్రముఖ దైవ క్షేత్రం తిరుమలలో అర్చకుల నుండి సిబ్బంది వరకు పలువురికి పాజిటివ్ కేసులు నమోదు కాగా భక్తులను పరిమిత సంఖ్యలోనే అనుమతులు ఇస్తూ దర్శనాలు చేస్తున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ దైవ క్షేత్రాలలో సైతం చాలా వాటిలో కరోనా పాజిటివ్ కేసులతో దైవదర్శనాలు ఆటంకం కలుగుతూనే ఉంది. ఈక్రమంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బుధవారం నుంచి  మూడు రోజుల పాటు భక్తుల దర్శనాలకు బ్రేక్ పడింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కొద్దిరోజులపాటు దర్శనాలు రద్దు చేయాలని  దేవాదాయ శాఖ నిర్ణయించింది. దీంతో భక్తుల దర్శనాలు నిలిపి వేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

భక్తులకు దైవ దర్శనం నిలిపివేసిన ఆలయంలో పూజాకార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని దేవాదాయశాఖ తెలిపింది. స్వామివారికి ఆన్ లైన్ పూజలతో పాటు ఏకాంత సేవలో నిత్య కైంకర్యాలు యధావిధిగా జరుగుతాయని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. కాగా, మూడు రోజుల పాటు దర్శనాలను నిలిపివేయడంతో యాదాద్రి పరిసరాలు బోసిపోయి కనిపించాయి. నిత్యం వేలాది భక్తజనంతో నిత్యకల్యాణం, పచ్చతోరణంలా కళకళ లాడే యాదాద్రి భక్తులు లేక  నిర్మానుష్యంగా మారింది.

యాదగిరిగుట్టలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంతో పాటు ప్రధానార్చకులు, మరో ఇద్దరు అర్చకులు, ఉద్యోగికి వైరస్‌ సోకడంతో దర్శనాలు నిలిపివేయాలని పలు పార్టీల నాయకులు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతకు వినతి పత్రాలు అందజేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రజాప్రతినిధులు, స్థానికులు లాక్‌డౌన్‌ విధించాలని కోరారని విప్‌ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు దేవదాయశాఖ యాదాద్రిలో దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

 

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   4 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   6 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   an hour ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   8 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   8 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   31 minutes ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   10 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle