కరోనా ఎఫెక్ట్... పిల్లలా....అప్పుడే వద్దులే!
11-07-202011-07-2020 09:34:41 IST
Updated On 11-07-2020 11:37:04 ISTUpdated On 11-07-20202020-07-11T04:04:41.795Z11-07-2020 2020-07-11T04:03:14.071Z - 2020-07-11T06:07:04.463Z - 11-07-2020

కరోనా వైరస్ ప్రభావం, ఆర్థిక పరిస్థితులు, కెరీర్ కారణంగా యువత పిల్లలపై అనాసక్తి చూపిస్తున్నారు. కరోనా మహమ్మారి ఆర్థిక, పారిశ్రామిక, ఉపాధి రంగాలపైనే కాదు.. దేశ భవిష్యత్‌ను శాసించ గలిగే శిశువుల పుట్టుకపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గతంలో జరిగిన పలు అధ్యయనాలు సుదీర్ఘ లాక్డౌన్ అవాంఛిత గర్భదారణకు దారితీసిందంటూ నివేదికలు ప్రచురించాయి. కానీ తాజాగా జరుగుతున్న అధ్యయనాలు ఇందుకు భిన్నమైన యదార్థాల్ని మనముందు వుంచుతున్నాయి. కోవిడ్-19 ప్రభావం యువతపై తీవ్రంగా ఉందని, దీని వల్ల సంతాన సాఫల్యత బాగా తగ్గినట్టు తెలుస్తోంది. చాలామంది దంపతులు దాంపత్యజీవితానికి దూరంగా వుంటున్నారు. కరోనా వ్యాపిస్తుందని భయపడడమే కాదు, గర్భం వస్తుందని వారు భయపడుతున్నారు. కరోనా కాలంలో తమ ఉపాధి గురించి బెంగగా వున్న యువత తమ భవిష్యత్ పట్ల భయాందోళనకు గురవుతున్నారు. ఈ మహమ్మారి మధ్య గర్భం దాల్చే ఆలోచనను 80శాతానికిపైగా ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు ఈ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మహమ్మారి సమయంలో వీరెవరూ గర్భదారణకు ప్రణాళికలు సిద్ధం చేయడంలేదు. ఇందుకు వీరు పలు కారణాల్ని ఉదహరిస్తున్నారు. 70 శాతం మంది యువత ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమకిప్పుడు ఇలాంటి ఆలోచన లేదని స్పష్టం చేస్తున్నారు. 73శాతం మంది ఒకవేళ గర్భం దాల్చిన తర్వాత పొరపాటున మహమ్మారి బారిన పడితే కలిగేతే తమ పరిస్థితి ఏంటని వారు తర్జనభర్జన పడుతున్నారు. కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో గర్భం ధరించే ఉద్దేశ్యం తమకు లేదన్నారు. అంతేకాదు.. మహమ్మారి వెలుగుచూడక ముందు గర్భధారణకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న వారిలో 78శాతం మంది ఆ ఉద్దేశ్యాన్ని మార్చుకున్నారు. 18నుంచి 32ఏళ్ళ మధ్య వయసుగలమహిళలు, పురుషులు పాల్గొన్న ఈ అధ్యయనంలో కనీసం ఏడాదిపాటు గర్బం గురించి ఆలోచించడం లేదని, ఆ ఆలోచనకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో కంటే నగరాల్లోనే ఈధోరణి ఎక్కువగా ఉందని తెలుస్తోంది. కొత్తగా పెళ్లయిన, రెండుమూడేళ్ళయిన వారిపై కరోనా ప్రభావం వారి మానసిక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. దీని నుంచి బయటపడగలమన్న భరోసా వీరికి లేదు. భవిష్యత్‌లో ఆర్థిక సంక్షోభాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో వీరికి అర్థం కావడంలేదు. అలాగే ప్రస్తుతం వీరికి కొనసాగుతున్న ఉపాధి అవకాశాలు ఎంతవరకు నిలదొక్కుకుంటాయోనన్న ఆందోళన అతలాకుతలం చేస్తోంది. ఈ దశలో పిల్లల ఆలోచనకు దూరంగా వుంటున్నారు. భవిష్యత్‌లో కలిగే ఆర్థిక ఇబ్బందుల భయం పిల్లల్ని కనాలన్న ఆకాంక్షను వారు దూరం పెడుతున్నారు. . 30ఏళ్ళు దాటితే గర్భధారణ ఆరోగ్యానికి హానికరమంటూ డాక్టర్లు చేసిన సూచనలు కూడా వీరిపై పని చేయడంలేదు. అయితే ఇలాంటి అధ్యయనంలో పాల్గొన్న వారంతా లాక్డౌన్ సమయంలో కలిసి వున్నా జాగ్రత్తలు పాటిస్తున్నామని వారు చెబుతున్నారు. ఈ విషయంలో లింగపరమైన బేధాల్లేకుండా ప్రతి ఒక్కరు అందుకు తాము సిద్ధంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. లైంగిక సంపర్కం వల్ల కరోనా వస్తుందనే ఆధారాలు లేకపోవడం కూడా వారిపై ప్రభావం చూపుతోంది. ఈ లాక్ డౌన్ టైంలో కండోమ్ లు, ఫిమేల్ కండోమ్ ల వినియోగం పెరగడమే అందుకు కారణంగా చెబుతున్నారు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఈ ఏడాది జననాల రేటు బాగా పడిపోతుందంటున్నారు. లాక్డౌన్ విధింపు అనంతరం దేశంలో గర్భ నిరోధక మాత్రల విక్రయాలు 46శాతం పెరిగినట్లు ఇటీవల అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో యువత ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారత్ లో యువత ఆలోచనలు ఆందోళనకరంగా మారుతున్నాయి. పిల్లల విషయంలో వారికి భరోసా కలిగితేనే పరిస్థితుల్లో మార్పులు రాగలవంటున్నారు.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
2 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
4 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
5 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
6 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
7 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
8 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
5 hours ago

నా రూటే సెపరేటు
9 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా