కరోనా ఎఫెక్ట్ : ఖాళీ రోడ్లు... పర్యాటక ప్రాంతాల మూసివేత
16-03-202016-03-2020 08:35:47 IST
Updated On 16-03-2020 13:21:23 ISTUpdated On 16-03-20202020-03-16T03:05:47.216Z16-03-2020 2020-03-16T03:05:43.213Z - 2020-03-16T07:51:23.113Z - 16-03-2020

తెలంగాణలో కరోనా భయంతో పాఠశాలలు, స్కూళ్ళు, కాలేజీలు, సినిమా థియేటర్లను క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలోని వివిధ పర్యాటక ప్రాంతాలపై కరోనా ప్రభావం కూడా పడింది. వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపంలో గల అనంతగిరిలోని హరిత వ్యాలి వ్యూ రిసార్ట్ ను పోలీసులు మరియు వైద్య అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. పర్యాటకులను ఖాళీ చేయించి ఎవ్వరికీ లోపలికి అనుమతించడం లేదు.
ఇతర దేశాలనుండి వచ్చే ప్రయాణికులను అనంతగిరి హరిత రిసార్ట్ కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హరిత రిసార్ట్ లో పనిచేస్తున్న కార్మికులు భయానికి గురై విధులు వదిలి యాజమాన్యంకు వినతి పత్రం అందజేశారు. యాజమాన్యం అడ్డుకున్నా కూడా వినకుండా మాకు వ్యాధి వస్తే మాకుటుంబాల పరిస్థితి ఏంటి అని వారంతా వెళ్లిపోయారు. దీంతో హరిత వ్యాలీ రిసార్ట్ బోసి పోతోంది. వైద్యాధికారులు కూడా వచ్చినట్టు తెలుస్తోంది.
కానీ అధికారులు అధికారికంగా ఏ విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వ్యాధి లక్షణాలు ఉంటే వారిని టిబి ఆసుపత్రి లో గల కొన్ని వార్డు లను ఉపయోగించి వైద్యం అందించనున్నట్టు సమాచారం.
ఇటు హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. షాపింగ్ మాల్స్, థియేటర్లు, హోటళ్లు, పార్కులు, పబ్బులు మూతబడ్డాయి. సండే మార్కెట్లు బోసిపోయాయి. నిత్యం రద్దీగా వుండే ప్రాంతాల్లో జనసంచారం బాగా తగ్గిపోయింది. తప్పనిసరైతేనే బయటకు వస్తున్నారు. ఒక్కసారిగా సందడి తగ్గిపోవడంతో వ్యాపారాలు బాగా పడిపోయాయని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఆదివారం కళకళ లాడే మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు సహా సాధారణ మార్కెట్లకు జనం తాకిడిలేదు.

నాంపల్లి చికెన్ మార్కెట్ వ్యాపారం లేక వెలవెలబోయింది. కరోనా వైరస్ ఇతరులు వాడే పదార్థాలు, వస్తువులను తాకడం, తుమ్మినా, దగ్గినా వస్తుండటం మూలంగా ఛాయ్ తాగేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. నెహ్రూ జూలాజికల్ పార్క్, బిర్లామందిర్, ఛార్మినార్, గోల్కోండ, హైటెక్ సిటీ, శిల్పారామం ప్రాంతాలలో జనం రాక తగ్గిపోయింది. మరోవైపు మన దేశంలో కరోనా భయం పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 107కి పెరిగింది. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 12 కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
భాగ్యనగరంలో ప్రముఖ పార్కులన్నీ మూసివేస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు ప్రకటించారు. నగరంలో ఎక్కువగా జనసంచారం ఉండే లంబినీపార్క్, ఎన్టీఆర్గార్డెన్, ఎన్డీఆర్ మెమోరియల్, సంజీవయ్య పార్క్‌లను ఈ నెల 21వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు నిర్ణయం ప్రకటించింది. ఇందిరా పార్క్, పబ్లిక్ గార్డెన్, జలవిహార్, ఆక్సిజన్ పార్కు జలగం వెంగళరావు పార్కు, నెహ్రూ జువలాజికల్ జూపార్క్లను మొదలయిన చిన్న పెద్దా పార్కులను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కువగా సభలు నిర్వహించే నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలోని సభలు, సమావేశాలకు అనుమతులు రద్దు చేశారు.
మహారాష్ట్రలో బుల్దానాలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన 71 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకలేదని నిర్ధారణ అయినట్టుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణ మరణాలను కరోనాగా చూపిస్తే కఠినచర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
10 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
6 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
8 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
11 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
13 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
16 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
17 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
18 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా