newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా ఎఫెక్ట్.. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం లేనట్టే..!

24-07-202024-07-2020 08:22:26 IST
Updated On 24-07-2020 09:17:45 ISTUpdated On 24-07-20202020-07-24T02:52:26.356Z24-07-2020 2020-07-24T02:52:18.935Z - 2020-07-24T03:47:45.283Z - 24-07-2020

కరోనా ఎఫెక్ట్.. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం లేనట్టే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వినాయకచవితి సందడి హైదరాబాద్ లో మామూలుగా వుండదు. ఎత్తైన విగ్రహ ప్రతిమలతో పదిరోజుల పాటు పూజలందుకుంటాడు విఘ్ననాయకుడు. కానీ ఈసారి అవేం కనిపించేలా లేవు. ఈ ఏడాది ఆగస్టు 22న వినాయకచవితి వచ్చింది. కరోనా వైరస్ అప్పటికి తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించడంతో వినాయక ఉత్సవాల కమిటీలు అప్రమత్తం అయ్యాయి. 

వినాయక చవితి ఉత్సవాల పేరుచెబితే హైద‌రాబాద్‌లోని ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ విగ్రహాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ఉత్సవాల ప్రారంభం నాడు జరిగే వేలం పాట అందరికీ గుర్తుండిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల చూపు బాలాపూర్ గ‌ణేష్‌పైనే ఉంటుంది.. తొలిసారి గ‌ణేష్ ల‌డ్డూవేలాన్ని ప్రారంభించి వార్త‌ల్లో నిలిచిన బాలాపూర్ గ‌ణేష్‌.. ప్ర‌తీ ఏడాది కొత్త రికార్డు సృష్టిస్తూ.. ల‌డ్డూ ధ‌ర పెరిగిపోతూనే ఉంది. భ‌క్తులు పోటీప‌డి ల‌డ్డూను ద‌‌క్కించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తారు.

బా‌లాపూర్ గ‌ణేష్ ల‌డ్డూ ఎంత ప‌లుకుతుంద‌నే ఉత్కంఠ అంద‌రిలోనూ ఉంటుంది. బాలాపూర్ గ‌ణేష్ శోభ‌యాత్ర‌కు కూడా ప్రాముఖ్య‌త ఉంది.. బాలా‌పూర్ గ‌ణేష్ బ‌య‌ల్దేరిన త‌ర్వాతే.. హైద‌రాబాద్ ఓల్డ్ సిటీలోని గ‌ణ‌ప‌తులు, మిగిలిన వినాయక విగ్రహాలు నిమ‌జ్జ‌నానికి బ‌య‌ల్దేర‌తారు.. అయితే.. క‌రోనావైర‌స్ నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది బాలాపూర్ గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి. గ‌ణేష్ ఉత్స‌వ కమిటీ సభ్యులు మరియు పెద్దలు.. క‌రోనా నేప‌థ్యంలో భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

ఈ ఏడాది బాలా‌పూర్ గ‌ణేష్ విగ్ర‌హాన్ని 6 అడుగుల ఎత్తులో త‌యారు చేయాల‌ని నిర్ణ‌యించారు.. ప్రతీ ఏడాది నిర్వ‌హించే ల‌డ్డూ వేలాన్ని క‌రోనా నేప‌థ్యంలో ఈ ఏడాది నిర్వ‌హించ‌కూడ‌ద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు.. ఈ సంవత్సరం మొదటి పూజ కేవలం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జ‌రుగుతుంది.. ఈ సంవత్సరం భక్తులు ఎలాంటి పూజలు... మరియు దర్శనాలకు అనుమ‌తి లేదు.. ప్రతీ సంవత్సరం జరిగే గణేష్ శోభా యాత్ర ప్రభుత్వ అనుమతులు మేరకు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. దయచేసి భక్తులందరూ ఈ సంవత్సరం జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సహకరించాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేశారు బాలాపూర్ గ‌ణేష్ ఉత్స‌వ క‌మిటీ అధ్య‌క్షులు క‌ళ్లెం నిరంజ‌న్‌రెడ్డి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి వారు తమ ఇంట్లోనే పూజలు చేసుకోవాలని కోరారు. 

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   32 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   2 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   4 minutes ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   3 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   5 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   a day ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle