కరోనా ఎఫెక్ట్: ఈసారి ఖైరతాబాద్ గణపతి 27 అడుగులే !
30-07-202030-07-2020 12:19:08 IST
Updated On 30-07-2020 13:45:07 ISTUpdated On 30-07-20202020-07-30T06:49:08.166Z30-07-2020 2020-07-30T06:41:06.196Z - 2020-07-30T08:15:07.198Z - 30-07-2020

ఒక్క వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా అందరి కడుపుల మీద కొడుతోంది. ఇప్పటికే పలు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు పనిలేక ఖాళీగా ఉండి, దిక్కుతోచని స్థితిలో ఉండగా.. తాజాగా కరోనా ఎఫెక్ట్ వినాయక ప్రతిమలు తయారు చేసే వారిపై కూడా పడింది. ఏటా వినాయక చవితి సమీపిస్తుండగా భారీగా ఆర్డర్లతో చేతినిండా పనితో ఉండే తయారీదారులు ఈసారి పనుల్లేక ఖాళీగా దర్శనమిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పలుచోట్ల గణేశ్ ఉత్సవాలు కూడా నిర్వహించబోమని పలు కమిటీలు తేల్చి చెప్పగా మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. వినాయక చవితి సందడి అంటే హైదరాబాద్ లో మామూలుగా వుండదు. ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఎంతో క్రేజ్. అత్యధిక ఎత్తుతో.. శోభయమానంగా గణేశుడు కొలువుదీరతాడు. గవర్నర్ తొలిపూజతో నవరాత్రులు ప్రారంభమవుతాయి. ప్రత్యేక పూజల తర్వాత.. నిమజ్జనం కూడా అట్టహాసంగా జరుగుతుంది. ఈసారి ఒక్క అడుగే విగ్రహం వుంటుందని భావించారు. ఈసారి భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు 27 అడుగుల ఎత్తు వరకు విగ్రహాం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ తొందరగా వచ్చేలా చేయాలని భగవంతుడి ఆశీస్సులు కొరతామని.. ధన్వంతరి వినాయకుడిని ప్రతిష్టిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఎత్తు విషయాన్ని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ సారి వినాయకుడు ధన్వంతరి రూపంలో భక్తులు దర్శించబోతున్నారు. ఒక చేతిలో అమృతం, మరో చేతిలో ఆయుర్వేదంతో గణనాథుడు కనిపిస్తారు. ఈ సారి కూడా శిల్పి రాజేందర్ వినాయకుడి విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. తొలిసారిగా 1954లో ఒక్క అడుగు ఎత్తుతో ఏర్పాటుచేసిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఏటా అడుగు చొప్పున పెంచుతూ 2014 నాటికి 60 అడుగులకు చేరింది. తర్వాత ఒక్కో అడుగు తగ్గించుకుంటూ వచ్చినా 2019లో 61 అడుగులు భారీ విగ్రహాన్ని రూపొందించారు. ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా స్వామి దర్శనమిచ్చారు. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో.. 61 అడుగుల ఎత్తులో భారీ గణపతి రూపుదిద్దుకున్నాడు. వినాయకుడి కుడి వైపున మహా విష్ణువు, ఏకాదశి దేవి.. ఎడమ వైపున బ్రహ్మా, విష్ణు, మహేశ సమేత దుర్గాదేవి కొలువదీరారు. ఒక్కో తలకు ఒక్కో రకమైన రంగుతో గణనాథుడు తయారుచేశారు. గతంలో కంటే ముందే వినాయకనిమజ్జనం గత ఏడాది ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగిసింది. అలాంటిది ఈసారి అంత ధూం ధాం కనిపించేలా లేదు. వినాయక విగ్రహాల తయారీ దారులు కరోనా కారణంగా ఉపాధి లేకుండా పోతోందని వాపోతున్నారు. ప్రతిసారీ వినాయక చవితి పండుగ వస్తుందంటేవనే నెలరోజులు ముందుగానే యువత సందడి చేసేవారు. ఎత్తుల విషయంలో పోటీపడి మరీ గణేశ్ ప్రతిమలను ఆర్డర్లపై దూర ప్రాంతాల నుంచి తెప్పించి ప్రతిష్ఠించేవారు. కానీ ఈసారి కరోనా వైరస్ యువత ఆశలపై నీళ్లు జల్లింది. చాలా చోట్ల ఉత్సవాలు నిర్వహించొద్దని ఇప్పటికే కమిటీలు తీర్మానం చేసుకోవడంతో తయారీదారులు లబోదిబోమంటున్నారు. ఈ ఏడాది ఆగస్టు 22న వినాయక చవితి పండుగ వచ్చింది. ఇప్పటివరకు సరైన ఆర్డర్లు రాలేదని హైదరాబాద్ కి చెందిన విగ్రహ తయారీదారులు చెబుతున్నారు. ఏటా లక్షలాదిరూపాయల అడ్వాన్స్ లు వచ్చేవని ఈసారి దాదాపు 50 శాతం మంది తగ్గిపోయాయని తయారీదారులు అంటున్నారు. దీంతో తాము తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవానాధారం కోల్పోవడంతో సగం మంది రోడ్డున పడ్డామని తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఏపీలో స్కూల్స్ బంద్
13 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
13 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
17 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
19 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
14 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
21 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
21 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
14 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
16 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
a day ago
ఇంకా