newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా ఎఫెక్ట్‌తో తగ్గిన ఎక్సైజ్ ఆదాయం

17-06-202017-06-2020 09:42:03 IST
Updated On 17-06-2020 11:50:00 ISTUpdated On 17-06-20202020-06-17T04:12:03.924Z17-06-2020 2020-06-17T04:11:48.599Z - 2020-06-17T06:20:00.947Z - 17-06-2020

కరోనా ఎఫెక్ట్‌తో తగ్గిన ఎక్సైజ్ ఆదాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా రెండునెలలకు పైగా మందుబాబులు నానా ఇబ్బందులు పడ్డారు. లాక్ డౌన్ నిబంధనల కారణంగా లిక్కర్ షాపులు తెరవకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. అడపదడపా అక్కడక్కడా మందు బాబులకు బ్లాక్ లో మద్యం లభించేది. ఖర్చు ఎంతైనా వారు దానిని కొనుగోలు చేసి తమ మందు దాహం తీర్చుకునేవారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాత మందుషాపులు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 

అయితే, కరోనా సోకకుండా భౌతిక దూరం పాటించడం, బారికేడ్లు ఏర్పాటుచేయడం, మాస్కు లేకుంటే మద్యం అమ్మకూడదనే నిబంధనలు విధించింది. మొదట్లో నిబంధనలు పాటించారు. మద్యం అమ్మకాలు కూడా భారీగానే పెరిగాయి. రానురాను అమ్మకాలు క్షీణించడంతో ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇబ్బందులు మొదలయ్యాయి. టార్గెట్లు అందుకోలేక వారు తీవ్ర వత్తిడికి గురవుతున్నారు. లాక్ డౌన్, కరోనా భయం కారణంగా ప్రజల ఆదాయం గణనీయంగా తగ్గడంతో చాలామంది మద్యం విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. దీనికితోడు ధరలు పెంచడంతో మద్యం విషయంలో ప్రజలు ఎవరికి వారు కంట్రోల్‌ విధించుకున్నారు. 

ఈ ఎండాకాలంలో బీర్ల అమ్మకాల్లో భారీ తగ్గుదల కనిపించింది. ఇదివరకు ఆరోగ్యం క్షీణిస్తుందని, జేబులకు చిల్లు పడుతుందని తెలిసినా మందుబాబులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఏదో సాకుతో పీకలదాక తాగేసి చిందులేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. లాకడౌన్‌ అమలులో ఉన్నందున పని దొరకక, చేతిలో పైసలు లేక మద్యం ప్రియులు గిలగిలలాడిపోతున్నారు. మళ్లీ దుకాణాలు తెరవడంతో ఎగిరి గంతేశారు. అయితే ఆదాయం లేకపోవడంతో చాలామంది మద్యం దుకాణాల వైపే వెళ్లడంలేదు. దీంతో కొన్నిరోజులుగా మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. 

సర్కారు ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ప్రభుత్వం 16 శాతం ధర పెంచడం, వలస కూలీలు స్వగ్రామాలకు వెళ్లడం కూడా అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.తెరుచుకున్న దుకాణాల్లో మొదట్లో కొన్నిరోజులు బీరు, లిక్కర్‌ అమ్మకాలు జోరుగా సాగినా అనంతరం తగ్గుముఖం పట్టాయని, ఆదాయం భారీగా తగ్గిందని లిక్కర్ షాపు యజమానులు చెప్పారు.

దీంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. చివరకు ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు సైతం తలలుపట్టుకుంటున్నారు. తెలంగాణలో శని, ఆదివారాల్లో మద్యం అమ్మకాలు భారీగా వుండేవి. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదు. ఎక్సైజ్ శాఖకు చెందిన డిపోల నుంచి లిక్కర్ షాపులకు వెళ్లే లారీలు కూడా బాగా తగ్గాయని తెలుస్తోంది. లిక్కర్ అమ్మకాల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని భావించిన అధికారులకు తాజా పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. గతంలో షాపుల ముందు బార్లు తీరిన మందుబాబులు ఇప్పుడు కనిపించడం లేదు. 

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   6 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   13 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle