newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా ఇప్పట్లో పోదు.. అంతా జాగ్రత్తగా ఉండండి

02-08-202002-08-2020 08:49:25 IST
Updated On 02-08-2020 09:27:22 ISTUpdated On 02-08-20202020-08-02T03:19:25.408Z02-08-2020 2020-08-02T03:12:10.579Z - 2020-08-02T03:57:22.251Z - 02-08-2020

కరోనా ఇప్పట్లో పోదు.. అంతా జాగ్రత్తగా ఉండండి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా కేసులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. పాజిటివ్ కేసులు 17లక్షల 51 వేలు దాటాయి. కొత్తగా 2083 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య  64 వేల 786కి చేరింది. గత 24 గంటల్లో 1114 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 43 వేల 751 మందికి చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 17 వేల 754 మంది చికిత్స పొందుతున్నారు. మొన్న రాత్రి నుంచి నిన్న రాత్రి వరకు వైరస్ సోకి 11 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 530కి చేరింది.

తెలంగాణలోనూ కేసుల తీవ్రత కొనసాగుతోంది. కరోనా కారణంగా రాజకీయ పార్టీల కార్యకలాపాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కరోనా వైరస్‌ ఉధృతి పెరుగుతున్న ప్రస్తుత సందర్భంలో, ఇప్పుటికే మారిన, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా పార్టీలు, నేతలు తమ ప్రచార పద్ధతులు, కార్యక్రమాల స్వరూపాలను మార్చుకోక బీజేపీ కార్యాలయాన్ని ఇప్పటికే మూసివేశారు. కాంగ్రెస్, తెలంగాణ భవన్ లకు నేతల రాక తగ్గింది. 

ఇప్పటికే ప్రధానపార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఉభయ కమ్యూనిస్టుపార్టీలు, టీజేఎస్, ఇతర రాజకీయపక్షాలు డిజిటల్‌ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. జూమ్‌ యాప్, ఇతర సాంకేతికతల ద్వారా ఆన్‌లైన్‌ మీడియా కాన్ఫరెన్స్‌లను నిర్వహిస్తున్నాయి. కొంతకాలంగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం టీజేఎస్, టీటీడీపీ, ఇతర వామపక్షపార్టీలు కలిసి ఆన్‌లైన్‌లో సంయుక్తంగా అఖిలపక్ష సమావేశాలు, రౌండ్‌టేబుల్‌ భేటీలు నిర్వహిస్తున్నాయి. కమ్యూనిస్టుపార్టీలు ఆన్‌లైన్‌ రచ్చబండ చేపడుతున్నాయి. 

నిత్యం నేతలు, కార్యకర్తలతో కళకళలాడే పార్టీ కార్యాలయాలు ఇప్పుడు జనం లేక బోసిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టే అవకాశాల్లేవు. కనీసం ఏడాది దాకా భౌతికదూరం పాటించడం తప్పనిసరి. దీంతో ప్రజలు, కార్యకర్తలను రాజకీయపార్టీల నేతలు ముఖాముఖి కలుసుకోవడం దాదాపు అసాధ్యమే.అందుకే డిజిటల్ మోడ్ లో తమ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ టచ్ లో వుంటున్నాయి పార్టీలు. ట్విట్టర్, ఫేస్ బుక్, జూమ్ యాప్ లతో పార్టీలు సందడి చేస్తున్నాయి. 

కరోనా ఇప్పట్లో పోయేలా లేదని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అంటున్నారు. అందుకే కరోనా విషయంలో ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కరోనా చికిత్సలపై వెంటనే స్పందించాలని. ఎక్కడ ఎలాంటి కొరత ఉన్నా వెంటనే స్పందించాలని, ప్లాస్మా దాతలపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. వారిని ప్రోత్సహించాలన్నారు. 

ప్రతి జిల్లాలో పార్టీ భవనాల నిర్మాణం పూర్తి చెయ్యాలన్నారు. విపక్షాల విషయంలో రాజీ పడవద్దని, కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడినా ఎదురుదాడి చెయ్యాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న పార్టీ కార్యకర్తలకు రూ. 2 లక్షల ప్రమాద బీమా కోసం, ప్రీమియం మొత్తం రూ. 16 కోట్ల 11 లక్షల చెక్కును ఇన్సూరెన్స్ కంపెనీకి అందజేశారు కేటీయార్. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle