newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా ఆస్పత్రుల్లో స్మార్ట్ ఫోన్లు వాడొచ్చు

05-08-202005-08-2020 19:54:16 IST
Updated On 05-08-2020 20:13:06 ISTUpdated On 05-08-20202020-08-05T14:24:16.414Z05-08-2020 2020-08-05T14:24:04.920Z - 2020-08-05T14:43:06.731Z - 05-08-2020

కరోనా ఆస్పత్రుల్లో స్మార్ట్ ఫోన్లు వాడొచ్చు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లు, ఐసోలేషన్ సెంటర్లలో స్మార్ట్ ఫోన్ల వాడకంపై ఆంక్షలున్నాయి. తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఆస్పత్రుల్లో ఇకపై స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వాడకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోగులు వీటిని నిర్భయంగా వాడుకునేందుకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలకు సూచించింది. స్మార్ట్ పరికరాల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లలో మాట్లాడుకోవడం ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి వున్న ఫీలింగ్ కలుగుతుంది.

కేంద్రం తన నిర్ణయంతో కుటుంబసభ్యులతో కరోనా రోగుల సంబంధాలు దెబ్బతినకుండా మానసికంగా కూడా వారికి మంచి ఊరట లభిస్తుందని భావిస్తోంది.  అప్పుడే రోగులు త్వరగా కోలుకునే అవకాశం కూడా ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం రోగులకు సెల్ ఫోన్ వాడేందుకు కరోనా ఆస్పత్రుల్లో అధికారులు పరిమితంగా అనుమతిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లతో వీడియో కాల్స్ మాట్లాడుకునే వెసులుబాటు మాత్రం లేదు.

దీంతో కేంద్రానికి ఈ విషయంపై పలు వినతులు  అందాయి. వీటిని పరిశీలించిన కేంద్రం.. తాజా ఆదేశాలు ఇచ్చింది. కొన్ని రాష్ట్రాలు కరోనా రోగులకు తమ కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ లో మాట్లాడేందుకు అనుమతించడం లేదని, దీనిపై వారి కుటుంబ సభ్యుల నుంచి తమకు విజ్ఞప్తులు వచ్చాయని, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల చికిత్సకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ పంపిన తాజా లేఖలో పేర్కొంది. ఆస్పత్రుల్లో ఇతర రోగులకు ఇబ్బంది కలగకుండా రోగులు ఈ సదుపాయం పొందవచ్చు. 

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   3 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   44 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle