newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

కరోనా అనంతర జీవితం ఇలా ప్రారంభం.. విమానాల్లో తీవ్ర ఆంక్షలు

06-05-202006-05-2020 06:42:39 IST
Updated On 06-05-2020 09:19:13 ISTUpdated On 06-05-20202020-05-06T01:12:39.864Z06-05-2020 2020-05-06T01:12:37.296Z - 2020-05-06T03:49:13.939Z - 06-05-2020

కరోనా అనంతర జీవితం ఇలా ప్రారంభం.. విమానాల్లో తీవ్ర ఆంక్షలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ అనంతర జీవితం ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు తెలంగాణ ఇప్పటినుంచి సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైంది. మొదట్లో మహానగరాల్లో మాత్రమే 33 శాతం ఆక్యుపెన్సీతో విమానాలు నడపనున్నారు. లాక్‌డౌన్‌ అనంతర సేవలకు విమానాశ్రయాలు సిద్ధమవుతున్నాయి. కాగా దశలవారీగా విస్తరణకు ఎయిర్‌లైన్స్‌ సన్నాహాలు చేపడుతోంది. లాక్‌డౌన్‌ అనంతరం హైదరాబాద్‌ నుంచి ప్రధాన నగరాలకు మాత్రమే డొమెస్టిక్‌ విమానాలు పరిమితంగా రాకపోకలు సాగించనున్నాయి. వాటిలోనూ అతి తక్కువమంది ప్రయాణికులను అనుమతిస్తారు. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం తప్పనిసరి చేసేలా చర్యలు తీసుకుంటారు. గమ్యస్థానం చేరేవరకు ప్రయాణికులు విధిగా మాస్కులను ధరించవలసి ఉంటుంది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా తీవ్రమైన ఆంక్షల నడుమనే అన్ని రంగాలూ పనిచేయాల్సి ఉంటుందని విమానాశ్రయాలు సిద్దమవుతున్న తీరు చెబుతోంది.

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా హైదరాబాద్‌ నుంచి కొన్ని మహానగరాలకు మాత్రమే పరిమిత సంఖ్యలో డొమెస్టిక్‌ విమానాలను నడిపేందుకు పలు ఎయిర్‌లైన్స్‌ సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 17తో మూడో దశ లాక్‌ డౌన్‌ ముగియనుంది. దీంతో 18 నుంచి పలు రాజధాని నగరాలకు మాత్రమే విమానాలను నడుపనున్నారు. హైదరాబాద్‌ నుంచి మొదటి దశలో ఢిల్లీ, బెంగళూర్, చెన్నై, ముంబయి వంటి ముఖ్యమైన నగరాలకు విమానాలు అందుబాటులోకి రానున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ విమానాలను సైతం కేవలం 33% ఆక్యుపెన్సీతో నడుపుతారు. ఇక లాక్‌డౌన్‌ అనంతర సేవలకు హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా సిద్ధమైంది. 

సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి సుమారు 60 వేల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. 450కి పైగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్‌ సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల 18 నుంచి డొమెస్టిక్‌ సర్వీసులకు మాత్రమే అనుమతి లభించనుంది. కానీ అత్యవసర ప్రయాణికులు మాత్రమే రాకపోకలు సాగిస్తారు. జూన్‌ నుంచి దశలవారీగా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను విస్తరించే అవకాశం ఉంది.  

దశలవారీగా విస్తరణ... లాక్‌డౌన్‌ తరువాత ఈ నెల 18 నుంచి విమానాలను నడిపేందుకు కొన్ని ఎయిర్‌లైన్స్‌ సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా బుకింగ్‌లను మాత్రం ప్రారం   భించలేదు. మరో వారం, పది రోజుల తరువాత ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా బుకింగ్‌లను తెరిచే అవకాశం ఉంది. హైదరాబాద్‌ నుంచి ఇండిగో, స్పైస్‌జెట్, గో ఎయిర్‌ తదితర సంస్థలు పెద్ద ఎత్తున సర్వీసులను అందజేస్తున్నాయి. ఎయిర్‌ ఇండియా మాత్రం జూన్‌లోనే సేవలను ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

లాక్‌డౌన్‌ అనంతర సేవల కోసం విమానాశ్రయాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేశారు. ప్రయాణికులు, ఎయిర్‌పోర్టు సిబ్బంది భౌతిక దూరాన్ని పాటించేవిధంగా అన్ని చోట్ల మార్కింగ్‌ చేశారు. ఈ మేరకు సిటీ సైడ్, చెకిన్‌ హాల్స్, సెక్యూరిటీ చెక్, బోర్డింగ్‌ గేట్స్, తదితర ప్రాంతాల్లో క్యూలైన్‌లు ఏర్పాటు చేశారు. కుర్చీల మధ్య ఖాళీ స్థలం వదిలారు. ఈ మేరకు స్టిక్కర్లను సైతం అతికించారు. ఎయిర్‌పోర్టులోని 7 అంతస్తుల్లో శానిటైజేషన్, ఫ్యూమిగేషన్‌ చేశారు.

టెర్మినల్‌లో పనిచేసే సిబ్బంది, ప్రయాణికుల కోసం పలు చోట్ల సెన్సర్‌ ఆధారిత ఆటోమేటిక్‌ హ్యాండ్‌ శానిటైజర్‌ డిస్పెన్సింగ్‌ మెషీన్లను ఏర్పాటు చేశారు. అన్ని చెకిన్‌ కౌంటర్ల వద్ద బోర్డింగ్‌ కార్డు, బ్యాగ్‌ ట్యాగ్‌ డిస్పెన్సర్లు సరాసరి ప్రయాణికులకే అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. ఫుడ్‌ కోర్టులు, ఔట్‌ లెట్లు, లాంజ్‌లు, రిటైల్‌ షాపుల వద్ద కూడా భౌతిక దూరం తప్పనిసరి. మొబైల్‌ వ్యాలెట్‌లతో జరిపే కొనుగోళ్లనే ప్రోత్సహిస్తారు. ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరిని థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle