newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనాపై హై అలర్ట్.. ఎయిర్ పోర్టులో ఈటల తనిఖీలు

10-03-202010-03-2020 09:14:31 IST
2020-03-10T03:44:31.265Z10-03-2020 2020-03-10T03:44:04.330Z - - 17-04-2021

కరోనాపై హై అలర్ట్.. ఎయిర్ పోర్టులో ఈటల తనిఖీలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా వున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో స్క్రీనింగ్ పరికరాలను పరిశీలించిన ఈటల రాజేందర్ పలు అంశాలను పరిశీలించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ప్రతి రోజు 550 మంది విదేశాల నుండి వస్తుంటారు కాబట్టి వారిని స్కానింగ్ చెయ్యడం తప్పనిసరి అన్నారు. ఎయిర్ పోర్టులో నాలుగు ప్రధాన ద్వారాలు వుంటాయని, వాటి దగ్గర డాక్టర్ లు నర్సులు హెల్పర్లు ఉంటారన్నారు. విదేశాల నుండి వచ్చే ప్రతి వ్యక్తిని స్కానింగ్ చేయడానికి తగిన సిబ్బందిని నియమించామన్నారు.

స్కానింగ్ చేసిన వ్యక్తి అనుమానంగా కనిపిస్తే ప్రత్యేకంగా ఎయిర్ పోర్ట్ లో ఏర్పాటు చేసిన రూమ్ లోకి తీసుకెళ్ళి ‌అతనికి పూర్తిగా మాస్కులు వేసి ప్రత్యేక వాహనంలో ప్రత్యేక ద్వారం నుండి గాంధీ ఆస్పత్రికి తరలించడం జరుగుతుందన్నారు. గతంలో కేవలం 11,12 దేశాల నుండి వచ్చే ప్రయాణికులను మాత్రమే స్క్రీనింగ్ చేసేవాళ్ళమని, నీ ఇప్పుడు ప్రపంచ దేశాలనుండి వచ్చే ప్రతి ఒక్కరిని స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం వుందన్నారు.

24 గంటల పాటు థర్మల్ స్క్రీనింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి ఈటల. ఒక్క ప్రయాణికుడు కూడా తప్పిపోకుండా అందరినీ స్కానింగ్ చేసే ఏర్పాట్లు చేస్తామని, కరోనా గురించి భయపడాల్సింది ఏమీ లేదన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కరోనా వైరస్ కు సంబంధించిన స్కానర్ లు ఎలా పని చేస్తున్నాయో , ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్టులు ఎలా చేస్తున్నారనే దానిపై రీజినల్ డైరక్టర్ డాక్టర్ అనురాధ పలు అంశాలు వివరించారు.

ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులను టెస్ట్ చేసేందుకు నాలుగు బ్యాచ్ లు 12 గంటలపాటు పని చేస్తున్నాయి. నాలుగు ఏరో బ్రిడ్జీల వద్ద డాక్టర్ లు పనిచేస్తున్నారన్నారు. మ్యాన్ పవర్ తక్కువగా ఉండడంతో ఇబ్బంది కలుగుతోందని, మ్యాన్ పవర్ కోసం ప్రభుత్వంతో మాట్లాడితే సానుకూలంగా స్పందించారన్నారు.

ఇన్ సాల్వెంట్ థర్మామీటర్లు ఎనిమిది ఉన్నాయి. వాటితో రెండుసార్లు చెకింగ్ చేస్తున్నామన్నారు. ప్రయాణికునికి దగ్గు, జలుబు, జ్వరం లాంటివి ఉంటే అతనికి కూడా స్క్రీనింగ్ చేసి  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ లో ఫీవర్ అస్పత్రికి లేదా గాంధీకి సమాచారం అందించి పంపుతామన్నారు. విదేశాల నుండి వచ్చే ప్రయాణికులను ఒక నిమిషంలో స్కానింగ్ చేస్తామని, ఆలస్యం జరగదన్నారు.

స్క్రీనింగ్ స్కానర్ కు మూడు ఫీట్ల దూరం నుండే స్కానింగ్ పనిచేస్తుందన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇప్పటి వరకు 44 వేల మందికి స్కానింగ్ చేశామని, 8 మంది అనుమానితులను గుర్తించామన్నారు డాక్టర్ అనూరాధ. కరోనా విషయంలో అనుమానితులే తప్ప కన్ ఫర్మ్ అయినవారు లేరని ప్రజలు ఎవరు భయాందోళనకు గురి కావద్దన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలో ఇప్పటి వరకు కరోనా లేదు. అనుమానితులు అయినంతమాత్రాన కరోనా ఉన్నట్లు కాదన్నారు. 

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   an hour ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   5 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   20 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16-04-2021


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle