కరోనాపై భయం వద్దు.. జనతా కర్ఫ్యూకి సహకరిద్దాం
21-03-202021-03-2020 16:36:10 IST
Updated On 21-03-2020 16:43:33 ISTUpdated On 21-03-20202020-03-21T11:06:10.446Z21-03-2020 2020-03-21T11:05:38.370Z - 2020-03-21T11:13:33.132Z - 21-03-2020

చైనాలో పుట్టి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనా వైరస్ ఈ మహమ్మారి బారినుంచి మానవాళిని రక్షించుకోవడం అసాధ్యం అవుతోంది. చైనా తర్వాత ఇటలీలో ఈ వ్యాధి మరింతగా ముదిరిపోయింది. రోజూ ఆరేడువందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో భారత దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం స్వీయ గృహ నిర్బంధం విధించుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆదివారం జనతా కర్ఫ్యూకు అందరూ సహకారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీయార్ కోరారు. ఆదివారం ఉదయం 6 గంటలనుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24గంటల పాటు కర్ఫ్యూ కొనసాగుతుందని ఆయన వివరించారు. ప్రధాని పిలుపును కొందరు సన్నాసులు అపహాస్యం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని కేసీయార్ తీవ్రంగా పరిగణించారు. తెలంగాణలో నూటికి నూరు శాతం ఆర్టీసీ బస్సులు తిరగవని, ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులను రాష్ట్రంలోకి అనుమతివ్వమని కేసీయార్ అన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చేవారి వివరాలు ప్రభుత్వానికి అందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. షాపులు, మాల్స్ స్వచ్ఛందంగా మూసివేయాలని, ఒకరోజు మూసేసినంత మాత్రాన ఏం కాదన్నారు. వ్యాపార, వర్తక సంఘాల ప్రతినిధులు ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.మెట్రో, ఎంఎంటిఎస్ సర్వీసులు కూడా ఆపేస్తామన్నారు. కరోనా వైరస్ మహారాష్ట్రలో తన ప్రతాపం చూపుతోంది. ఈ నేపథ్యంలో రెండురోజుల తర్వాత మహారాష్ట్ర బార్డర్‌ను మూసివేసే ఆలోచన చేస్తున్నామని, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని కేసీయార్ అన్నారు. కరోనా వైరస్‌పై ముందుగానే అప్రమత్తమై చర్యలు చేపట్టామని, ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు. భయపడాల్సింది ఏమీ లేదని, ఎన్నికోట్లు ఖర్చుపెట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మార్చి 1నుంచి ఇప్పటివరకు 20 వేల మందికి పైగా విదేశాల నుంచి వచ్చారు. 11వేల మందిని ఆధీనంలోకి తీసుకున్నాం. 5,274 నిఘా బృందాలు పని చేస్తున్నాయన్నారు. మొత్తం 52 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. 78 మంది జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్‌లు పని చేస్తున్నాయన్నారు. 700 మందికి పైగా అనుమానితులు ఉన్నారు. ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేసీయార్ వివరించారు. విదేశాలనుంచి వచ్చినవారు జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే తక్షణం రిపోర్టు చేయాలని, వైద్య పరీక్షలు నిర్వహించి వారిని సురక్షితంగా ఉంచుతామన్నారు. కరోనా నియంత్రణ సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. ఇతర దేశాలనుంచి వచ్చేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఏపీలో స్కూల్స్ బంద్
12 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
12 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
16 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
18 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
13 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
20 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
20 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
13 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
15 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
21 hours ago
ఇంకా