newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనాపై పోరాడే జర్నలిస్ట్‌లను ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్‌

12-05-202012-05-2020 18:20:31 IST
Updated On 12-05-2020 18:51:39 ISTUpdated On 12-05-20202020-05-12T12:50:31.357Z12-05-2020 2020-05-12T12:50:07.594Z - 2020-05-12T13:21:39.403Z - 12-05-2020

కరోనాపై పోరాడే జర్నలిస్ట్‌లను ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం, తాజా వార్తలను అందించడంలో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని వారిని ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్ వేశారు. డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు కరోనా యోధులుగా ఉన్నారు. వీరితో పాటు జర్నలిస్టులు కూడా కరోనాకి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ వారికి ఎవరు అంతగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు కూడా వారిని ఆదుకోవడానికి ముందు రావడం లేదు. దీనికి సంబంధించి కరోనా పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ న్యాయవాది, కాంగ్రెస్ నేత రాపోలు భాస్కర్‌  తెలంగాణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

దీనిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రాణాలకు తెగించి కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని పిటిషనర్‌ కోర్టును కోరారు. పిటిషనర్‌ తరుపున వాదనలను సీనియర్‌ కౌన్సిల్‌ మాచర్ల రంగయ్య వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుకు 25 వేలు ఇవ్వాలని, దీనికి సంబంధించి ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. 

కరోనా వైరస్ గురించిన వార్తలు కవర్‌ చేస్తోన్న ప్రతి జర్నలిస్ట్‌కు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కల్పించాలని పిటిషనర్‌ కోరారు. విధి నిర్వహణలో వున్న జర్నలిస్టుకలు మెడికల్‌ కిట్లు, మాస్క్‌లు ఉచితంగా అందించే విధంగా కూడా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా పిటిషనర్‌ కోరారు. ఈ విషయానికి సంబంధించి తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇన్ఫర్మేషన్ అండ్  పబ్లిక్  రిలేషన్స్ డిపార్ట్ మెంట్, ప్రెస్ అకాడమీ చైర్మన్ కు హైకోర్టు నోటీసులు జారిచేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు.

దీనిపై తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే జర్నలిస్టులను ఆదుకోవాలంటూ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కరోనా పోరాటంలో అలుపెరుగక శ్రమిస్తున్న జర్నలిస్టులకు ఆరు నెలల పాటు పదివేల చొప్పున రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాలు చొరవ తీసుకుని సహాయం చేయాలన్నారు రేవంత్. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలకు లేఖ‌ రాస్తాన‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   12 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   8 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   15 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle