newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనాపై పోరాటంలో సాయం .. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ భరోసా

20-03-202020-03-2020 15:19:33 IST
Updated On 20-03-2020 15:20:25 ISTUpdated On 20-03-20202020-03-20T09:49:33.198Z20-03-2020 2020-03-20T09:49:31.512Z - 2020-03-20T09:50:25.343Z - 20-03-2020

కరోనాపై పోరాటంలో సాయం .. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ భరోసా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ తీవ్రంగా భయపెడుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారుకేంద్ర మంత్రి డాక్టర్  హర్షవర్ధన్. కరోనాను ఎదుర్కొందాం-ఎవరూ ఇళ్లల్లోనుంచి బయటకు రావొద్దని పిలుపునిచ్చారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు,  కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో... అరికట్టేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్టు  కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని ఆందోళన అవసరం లేదన్నారు. కేంద్ర హోం శాఖాసహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రమంత్రి హర్షవర్ధన్ ని కలిశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన ఇద్దరు నేతలూ కరీంనగర్లో కరోనా పాజిటివ్ కేసులు, వ్యాధిబాధితుల వివరాలు అందజేశారు. కరీంనగర్లో ప్రస్తుత పరిస్థితిని  వివరించారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకునే చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి  అన్నివిధాలా సహకరిస్తామని హర్షవర్ధన్  హామీ ఇచ్చారని వారు తెలిపారు. 

ప్రభుత్వానికి సహకరించడం అంటే ఇంటినుంచి బయటకు రాకపోవడమే అన్నారు బండి సంజయ్. కరీంనగర్ ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని,  అప్రమత్తంగా ఉండాలని బండి సంజయ్ కోరారు. కలెక్టర్ సహా సిబ్బంది అంతా కరోనాను అరికట్టే చర్యల్లో నిమగ్నమయ్యారని ఆయన తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం కరీంనగర్ పట్టణంలో పర్యటించనున్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ నుంచి వచ్చిన కొద్దిమందికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో అధికార యంత్రాంగం పట్టణంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 

ముఖ్యమంత్రి కూడా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పలు సూచనలు చేస్తూ వచ్చారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారికి తప్ప, స్థానికులెవరికీ వ్యాధి సోకకుండా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయి.  కరీంనగర్ లో పరిస్థితిని స్వయంగా పరిశీలించి, పర్యవేక్షించేందుకు శుక్రవారమే ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనరగ్ లో పర్యటించాలని భావించారు. కానీ శుక్రవారం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ఉండడంతో ఈ పర్యటన శనివారానికి వాయిదా పడింది. సిఎంతో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కూడా కరీంనగర్లో పర్యటిస్తారు. అక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తారు.

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   13 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   16 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle