newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

కరోనాపై నెగిటివ్ రిపోర్టులు.. ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు

07-03-202007-03-2020 08:57:50 IST
2020-03-07T03:27:50.660Z07-03-2020 2020-03-07T03:27:21.196Z - - 26-05-2020

కరోనాపై నెగిటివ్ రిపోర్టులు.. ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ దేశాల వెన్నులో చలి పుట్టిస్తోంది కరోనా వైరస్. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కరోనా పేరు చెబితే వణికిపోతున్నారు. తెలంగాణలో 611కు చేరారు కరోనా అనుమానితులు. ప్రస్తుతం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఒక్కటే కరోనా పాజిటివ్ కేసు. ప్రపంచవ్యాప్తంగా 3,356 మంది మృత్యువాత పడుతున్నారు. ప్రస్తుతం 89 దేశాలకు పాకింది ఈ  వైరస్.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బులిటెన్‌ను విడుదల చేశారు అధికారులు. రాష్ట్రంలో కరోనా అనుమానితుల శాంపుల్స్‌ అన్ని నెగిటివ్‌గా వచ్చాయని తెలిపారు. మొత్తం తొమ్మిది శాంపుల్స్‌ని టెస్ట్‌ చేయగా ఎవరికీ కరోనా లేదని తేల్చారు. మరోవైపు అనుమానితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 

కేరళలో హైదరాబాద్ వైద్య బృందం పర్యటించనుంది. అలెప్పీలోని ఐసోలేషన్ వార్డును సందర్శించనుంది ఈ వైద్యబృందం. కొన్ని దేశాలు అవసరమైన చర్యలు చేపట్టడం లేదని,  వైరస్‌తో పోరాడే క్రమంలో వెనకడుగు వేయవద్దు.. అన్ని మార్గాలు అన్వేషించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచిస్తోంది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అన్ని ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలంది ప్రపంచ ఆరోగ్యసంస్థ. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 31 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా రిపోర్టులు నమోదయ్యాయి. 

వైరస్ నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అటు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మురికివాడలు, పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని  తెలంగాణ హైకోర్టు ధర్మాసనం సూచించింది.  న్యాయస్థానానికి వచ్చే వారందరికీ మాస్కులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కక్షిదారులు కోర్టులకు రాకపోయినా ఒత్తిడి చేయకూడదని న్యాయవాదులకు సూచించింది. విచారణ ఖైదీలను జైలు సిబ్బంది కోర్టులో హాజరుపర్చలేకపోయినా మినహాయింపులు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. కరోనా వైరస్ పై తప్పుడు ప్రచారం చేసిన ఇద్దరు వ్యక్తులపై ఫిర్యాదు చేశాం..క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు తెలంగాణ డైరెక్టర్ హెల్త్ శ్రీనివాసరావు, 

కరోనా భయాల నేపథ్యంలో కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ఈనెల  31వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆధార్‌తో లింకై ఉన్న బయోమెట్రిక్‌ హాజరు మినహాయింపు ఇచ్చింది.  బయోమెట్రిక్ ద్వారా వైరస్‌ కారక క్రిములు ఇతరులకు సోకే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అన్ని శాఖలూ తమ ఉద్యోగులు రిజిస్టర్‌లో మాత్రమే హాజరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఈ మేరకు సిబ్బంది వ్యవహారాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

కరోనా అనుమానాలను. భయాందోళనలను పోగొట్టేయత్నం చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేరుగా అధికారులతో సమావేశం అయి.. కరోనా వైరస్‌ నేపథ్యంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఇటీవల కాలంలో విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను ఏపీ ప్రభుత్వం సేకరిస్తోంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మార్చి 5 వరకు 6వేల 927 మంది విదేశాల నుంచి రాగా.. వారికి స్క్రీనింగ్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఎయిర్‌పోర్టుల్లోనే కాదు.. నౌకాయానం ద్వారా వచ్చిన వారికి కూడా స్క్రీనింగ్‌ నిర్వహించినప్పటికీ.. రోగ నిరోధానికి ఉన్న అన్ని చర్యలను తీసుకుంటున్నట్టు చెప్పారు.

ఏపీ వ్యాప్తంగా వైద్యసిబ్బందిని అలర్ట్‌ చేసింది సర్కార్‌. ముందస్తుగా 351 బెడ్లను సిద్దం చేసింది. 47 వెంటిలేటర్లు, లక్షా 10వేల మాస్కులు, 12వేల 444 పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్లను అందుబాటులో ఉంచారు. మరో 12వేల పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్లను కొత్తగా కొనుగోలు చేయడంతో పాటు అదనంగా 50వేల మాస్కులను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు అధికారులు. ఎవరైనా అనుమానిత లక్షణాలుంటే.. కాల్‌ చేస్తే వెంటనే అంబులెన్స్‌ నేరుగా పంపించి ఆసుపత్రికి పంపించనున్నారు. 

ఏపీలో నమోదయిన 13 మంది అనుమానిత కేసుల్లో 9 నెగిటివ్‌గానే వచ్చాయన్నారు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని. కరోనా తీవ్రత లేకుండ చూడడమే కాదు.. ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదంటున్నారు మంత్రి ఆళ్ళ నాని.  ప్రజల్లో భయాందోళనలు మాత్రం తగ్గడం లేదు. విశాఖ, ఒంగోలు, ఏలూరు, విజయవాడ, కాకినాడ, శ్రీకాకుళం, తిరుపతి వంటి ప్రాంతాల్లో కరోనా లక్షణాలతో ఉన్న వారు ఆసుపత్రులకు చేరుతున్నారు. 

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   5 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   7 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   10 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   12 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   13 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   13 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   14 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   14 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   14 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle