newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనాపై తెలంగాణ పైచేయి .. ఆ క్షణాలు మన చేతుల్లోనే!

30-03-202030-03-2020 10:59:09 IST
Updated On 30-03-2020 11:03:01 ISTUpdated On 30-03-20202020-03-30T05:29:09.347Z30-03-2020 2020-03-30T05:29:04.866Z - 2020-03-30T05:33:01.511Z - 30-03-2020

కరోనాపై తెలంగాణ పైచేయి .. ఆ క్షణాలు మన చేతుల్లోనే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై తెలంగాణ రాష్ట్రం, ప్రజలు పైచేయి సాధించనున్నారు. యావత్ ప్రపంచం.. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, బ్రిటన్ లాంటి బడా బడా దేశాలు మృత్యుఘోషతో విలవిలాడుతుంటే భారత్ కొంత మెరుగుగానే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణ మాత్రం స్వల్ప నష్టాలతోనే కరోనాను అధిగమించేందుకు సిద్దమవుతుంది.

ప్రస్తుతానికి తెలంగాణలో డెబ్భై కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో తొలి కేసు బాధితుడు ఇప్పటికే డిశ్చార్జ్ కాగా మరో 11 కేసులు డిశ్చార్జ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ 11 మందికి ఇప్పటికే మూడు సార్లు పరీక్షించిన వైద్యులు నెగటివ్ రిపోర్టులు వచ్చినట్లుగా ప్రకటించారు. ఇదే విషయాన్ని అటు సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా తెలపగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ప్రకటించారు.

ఒకవిధంగా ఈ వార్త అటు ప్రజలకే కాదు.. రాష్ట్ర నాయకత్వానికి.. ప్రాణాలకు తెగించి వైద్యసేవలు అందిస్తున్న బృందాలకు ఊరట కలిగించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో ఒకే ఒక్కరు మృతి చెందారు. ఢిల్లీలో ఓ మత ప్రచారం సమ్మేళనానికి వెళ్లిన ఆ కేసులో కూడా ఎలాంటి చికిత్స తీసుకోకుండా చనిపోయాక అతనిలో కరోనా వైరస్ ఉన్నట్లుగా గుర్తించారు.

ఇక ఇప్పుడు చికిత్స తీసుకుంటున్న వారిలో కూడా ఎవరికీ విషమ పరిస్థితి లేదని.. అందరిలో ఒక్కరికి మాత్రమే వెంటిలేటర్ సపోర్ట్ ద్వారా చికిత్స అందిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. అంతేకాదు ఏప్రిల్ రెండో వారానికి కరోనా ఫ్రీ తెలంగాణగా అవతరించబోతుందని ఆయన ప్రకటించారు. దీంతో రాష్ట్ర ప్రజలకు ఎక్కడ లేని సంతోషం పుట్టుకొచ్చింది.

అయితే, ఇదంతా జరగాలంటే మాత్రం రాష్ట్రంలోని ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాల్సి ఉంది. ఇక్కడ నుండి ప్రధాని మోడీ దేశం మొత్తం విధించిన లాక్ డౌన్ కాలానికి సరిగా రెండు వారాలు సమయముంది. ఈరోజు నుండి రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటేనే సీఎం చెప్పినట్లుగా కరోనా ఫ్రీ తెలంగాణ సాధ్యమవుతుంది.

ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులతో పాటు ప్రస్తుతం అనుమానితులుగా పాజిటివ్ కేసులతో కాంటాక్ట్ ఉన్న క్వారంటైన్ లో ఉన్న అనుమానితులు.. లక్షణాలుండి ఐసోలేషన్ లో ఉన్నవారు... విదేశాల నుండి వచ్చి హోమ్ క్వారంటైన్ లో ఉన్న కేసులన్నీ ఈ రెండు వారాలలో రిజల్ట్ తేలిపోతుంది. ఈరోజు నుండి కొత్తగా వైరస్ వ్యాప్తి జరగకుండా ఉంటే ఆ కాలానికి పాజిటివ్ పేషేంట్లలో తప్ప వైరస్ ఎక్కడా బ్రతికి ఉండదు.

కానీ, ఇదంతా జరగాలంటే మాత్రం ప్రతి వ్యక్తి బాధ్యతగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఏ వ్యక్తి ఇంటి నుండి కదలకుండా సామజిక దూరం పాటిస్తూ.. శుభ్రతా ప్రమాణాలను పాటిస్తూ రోగ నిరోధక శక్తిని పెంచేలా ఆహారాన్ని తీసుకుంటూ కుటుంబం మినహా మరే వ్యక్తులతో సామజిక దూరాన్ని పాటించగలిగినపుడే కరోనా ఫ్రీ కల సాకారమవుతుంది. లేదంటే వైరస్ వ్యాప్తి.. లాక్ డౌన్ కొనసాగింపు తప్పని పరిస్థితికి చేరుతుంది. చేయి చేయి కలపకుండా.. ఇంట్లో కూర్చొని కరోనాపై పై చేయి సాధిద్దామా?!

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   3 hours ago


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   4 hours ago


షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

   4 hours ago


జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

   5 hours ago


అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

   6 hours ago


కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

   19 hours ago


కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

   a day ago


దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

   21 hours ago


Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle