newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనాపై ఆ గ్రామాల యుద్ధం... ఆవారాలకు వింత శిక్షలు

24-03-202024-03-2020 11:53:12 IST
2020-03-24T06:23:12.262Z24-03-2020 2020-03-24T06:22:45.409Z - - 12-04-2021

కరోనాపై ఆ గ్రామాల యుద్ధం... ఆవారాలకు వింత శిక్షలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వ్యాధి తన తీవ్రతను చూపిస్తోంది. ఇటలీపై కరోనా వైరస్‌ జాలి, కనికరం చూపించడంలేదు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రజల ప్రాణాలు మాత్రం పిట్టల్లా రాలిపోతున్నాయి. సోమవారం రాత్రి వరకు ఆ దేశ అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం మరణాలు ఆరువేలు దాటగా.. 60వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అయితే వైరస్‌పై స్థానిక ప్రభుత్వం, ప్రజలు తొలి నుంచి అప్రమత్తంగా ఉండకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని వైద్య నిపుణులు అంటున్నారు. 

ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రతాపం చూపుతున్న వేళ అధికార యంత్రాగం అప్రమత్తం అయ్యింది. దీంతో అంతటా 144 సెక్షన్ అమలు జారీచేశారు. ఆదిలా బాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. ఇతర జిల్లాల నుంచి రోడ్లపైకి వస్తున్న ప్రయాణికులను పోలీసులు అడ్డుకుంటున్నారు.

కరోనా వైరస్ యొక్క తీవ్రత ఎలా ఉండబోతోందో రోడ్లు పైకి వస్తున్న ప్రయాణికులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కరోన  కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది దీనితో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ  మండలము  ఆడేగామ్- బి గ్రామ ప్రజలు నడుం బిగించారు కరోన మహమ్మరిని తరిమి కొట్టడానికి తమ గ్రామాన్ని దిగ్భంధించారు. తమ గ్రామము  నుండి ఎవరు బైటికి వెళ్లకుండా బైట వారు ఎవరు ఉరిలోకి రాకుండా గ్రామ అభివృద్ధి కమిటీ నిర్ణయం తీసుకుంది. 

తమ గ్రామంలో పండించిన కూరగాయలు,  పాలను వేరే  గ్రామాలకు పంపించకుండా తమ గ్రామస్థులకు ఫ్రీగా అందజేస్తామని ఎవరికైనా నిత్యవసర వస్తువులు అవవసరం ఉంటే గ్రామీణాభివృద్ధి కమిటీ నుండి సరఫరా చేయడానికి  ఒక మనిషిని ఇచ్చోడ మండల కేంద్రం నుండి సరఫరా చేస్తామని వారు తెలిపారు  అత్యవసరం అనుకుంటే  ఊరు బయట ఒక కారు ఉంటుందని వారు చెబుతున్నారు.

ఇటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్, పెద్ద షాపూర్ తండాలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నా గ్రామ సర్పంచులు. ఇతర ప్రాంతాలనుంచి గ్రామాల్లోకి రాకుండా ముళ్లకంచెలు వేసి రోడ్లను మూసివేశారు  గ్రామస్తులు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప గ్రామాల నుంచి బయటికి పోకుండా గ్రామాల్లోకి రాకుండా కరోనా వైరస్ నివారణ గురించి గ్రామస్తులు అందరూ సహకరించాలని గ్రామ సర్పంచులు కోరారు.

ఇదంతా ఒక ఎత్తయితే ప్రభుత్వం లాక్ డౌన్ విధించినా ప్రజలు రోడ్ల మీదికి వస్తున్నారు . కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల పోలీసులు కరోనా  ప్రజలకు మైకులు పెట్టి అవగాహన కల్పిస్తున్నారు. అయినా ప్రజలు మాత్రం పోలీసుల మాటలు బేఖాతరు చేసి బయటకు తిరుగుతుండటంతో  అనవసరంగా రోడ్ల మీదికి వస్తున్న యువకులను పట్టుకొని రోడ్డుపై గుంజీలు తీయిస్తున్నారు పోలీసులు.. మరో పక్క  పోలీసులు  ద్విచక్ర వాహన దారులకు ఫైన్ వేస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో వినూత్నంగా స్వీయ నిర్బంధం అమలుచేస్తున్న గ్రామాలను అధికారులు అభినందిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle