కరోనాపై అతిగా రాస్తే తాటతీస్తా.. మీడియాకు కేసీఆర్ హెచ్చరిక
15-03-202015-03-2020 08:06:25 IST
2020-03-15T02:36:25.223Z15-03-2020 2020-03-15T02:36:20.484Z - - 16-04-2021

కరోనా వైరస్ గురించి, దాని వ్యాప్తి గురించి రాష్ట్రంలో ఏ మీడియా కూడా అతిగా, అనవసరంగా రాయొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. సున్నితమైన ఈ అంశంలో మీడియా అతి చేస్తే తమ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో అందరికీ తెలిసివస్తుందని, హద్దు దాటిన తర్వాత ఎవరూ మీడియాను కాపాడలేరని కేసీఆర్ హెచ్చరించారు. కరోనా వైరస్ నివారణపై తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఆయన మాట్లాడారు. కరోనా నివారణకు రెండు దశల కార్యక్రమం రూపొందించామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈనెల 31వరకు అన్నిరకాల విద్యా సంస్థలు బంద్ పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోర్డు, సెట్ పరీక్షలన్నీ యథాతథంగా కొనసాగుతాయన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో హాస్టల్ వసతి కొనసాగుతుందని చెప్పారు. హాస్టళ్లలో ప్రత్యేక శానిటరీ చర్యలు తీసుకుంటారని తెలిపారు. "కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా ముందుజాగ్రత్తగా రాష్ట్రంలోని ఫంక్షన్ హాళ్లన్నీ మూసివేయాలని నిర్ణయించాం. ఇప్పటికే నిర్ణయమైన పెళ్లిళ్లు చేసుకోవచ్చు. శుభకార్యాలు లిమిటెడ్ మెంబర్స్‌తో చేసుకుంటే మంచిది. మార్చి 31 తర్వాత ఫంక్షన్ హాళ్లను ఎవరూ బుక్ చేసుకోవద్దు. బహిరంగసభలు, సమావేశాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, ఉత్సవాలు, ర్యాలీలు, ఎగ్జిబిషన్లు, కల్చరల్ ఈవెంట్లకు అనుమతులు ఇవ్వం అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇండోర్, ఔట్‌డోర్ స్టేడియాలు, స్విమ్మింగ్ పూల్స్, పార్క్, మ్యూజియాలు, థియేటర్లు, బార్లు, క్లబ్బులు మూసివేస్తామని, అదే సమయంలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు యథాతథంగా నడుస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే సూపర్మార్కెట్లు, మాల్స్, మార్కెట్లు మూసివేత జరగదని కూడా స్పష్టం చేశారు. తెలంగాణలో అన్నీ బంద్ చేస్తున్నారని, ఆర్టీసీ బస్సులు, ఆటోలను కూడా బంద్ చేయనున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా సాగుతున్న ప్రచారాన్ని కేసీఆర్ ఖండించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటం. ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ విషయంలో చాలా అతి చేస్తోంది.. అవాస్తవాలు రాస్తే పుకార్లు రేపితే ఎవరినీ క్షమించేది లేదు. కరోనాపై ఏ మీడియా అనవసరంగా రాయొద్దు. ఏం చర్యలు తీసుకుంటామో తర్వాత తెలుస్తది... ఎవరూ కాపాడలేరు’ అంటూ సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
8 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
12 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
16 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
18 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
20 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
20 hours ago
ఇంకా