కరోనాను చంపేశక్తి లేదు.. కాస్త జాగ్రత్త.. మంత్రి ఈటెల
29-08-202029-08-2020 06:58:46 IST
2020-08-29T01:28:46.704Z29-08-2020 2020-08-29T01:28:40.844Z - - 14-04-2021

కరోనాకు చంపే శక్తి లేదని.. సత్వరమే గుర్తించి చికిత్స చేయించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దేశం నలుమూలల ఏ మంచి కార్యక్రమం జరిగిన దానిని అనుసరించామని తెలిపారు. అందులో భాగమే బస్తీ దవాఖాన అన్నారు. వీటిల్లో మందులకు కొదవ లేదని తెలిపారు. యూపీహెచ్సీ, బస్తీ దవాఖానలో కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా పోల్చితే తెలంగాణలోనే తక్కువ మరణాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ప్రపంచంలో కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి.. అప్పుడు ప్రజలు ఇంతలా భయపడలేదన్నారు మంత్రి ఈటల రాజేందర్. వైరస్‌ని మొదట్లోనే కనుగొని చికిత్స చేయిస్తే ప్రజల ప్రాణాలు నిలుస్తాయని, వారం రోజుల నుంచి రాష్ట్రంలో రోజుకు 50-60 వేల టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనాతో మరణిస్తున్న వారితో పోల్చితే.. తెలంగాణలో తక్కువగానే చనిపోతున్నారని మంత్రి ఈటల పేర్కొన్నారు. 80 శాతం మందికి మందులతో నయం అవుతుంది.. 4 శాతం మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం ఉంటుందన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యకులకు ఐసోలేషన్ కిట్లు ఇస్తున్నామన్నారు ఈటల. హైదరాబాద్ రెసిడెంట్స్ వెలిఫెర్ అసోసియేషన్‌కు తమ మద్దతుంటుందని తెలిపారు. ప్రజల్లో కరోనా పట్ల అవగాహన బాగానే పెరిగిందన్నారు. అంతేకాక రాబోయే రోజుల్లో కరోనాతో జీవించాలని మంత్రి ఈటల తెలిపారు. జంటనగరాల్లో 145 చోట్ల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, వీటికి అదనంగా మొబైల్ క్యాంపులు కూడా పెడుతున్నామని మంత్రి చెప్పారు. ఆసుపత్రిలో చేరకుండానే రాష్ట్రంలో 95 శాతం మంది రోగులు వైరస్ నుంచి బయటపడుతున్నారని కేవలం 5 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారని వెల్లడించారు. కరోనా పేషెంట్లు కేవలం లక్ష రూపాయల లోపు ఖర్చుతో కరోనా చికిత్స చేయించుకోవచ్చని కానీ ప్రైవేట్ ఆసుపత్రులు ఒక్కో రోగి నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేయడం ఏరకంగానూ సమర్థించలేమని మంత్రి ఈటల తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉత్తమ చికిత్స లభిస్తోందని, దయచేసి ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లవద్దని సూచించారు. తెలంగాణలో కరోనా మృతుల రేటు 0.7శాతంగా ఉందని ఇది జాతీయ సగటు కంటే రెండు శాతం తక్కువ అని మంత్రి ఈటెల చెప్పారు. కాగా, కేసీఆర్ సర్కార్ రిమ్స్ ఆస్పత్రికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క రిమ్స్‌లోనే 100 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇక్కడ ఐసోలేషన్‌లో పేషెంట్లు భయంతో ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. కరోనా బాధితులను సర్కార్ గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా చావులన్నీ ప్రభుత్వ హత్యలుగా పేర్కొన్నారు. తెలంగాణలో ఏ ఒక్క ఆస్పత్రి సరిగా లేదన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో 100 వైద్య పోస్టులు ఖాళీగా ఉంటే.. ప్రజలకు వైద్యం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. రిమ్స్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ మెషీన్ లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే శాసన సభ సమావేశాల్లో కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతామని హెచ్చరించారు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
15 minutes ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
an hour ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
2 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
3 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
4 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
6 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
6 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
21 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
21 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
a day ago
ఇంకా