newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

కరోనాను ఎదుర్కొనే శక్తి మన ప్రభుత్వాలకి ఉందా?

05-03-202005-03-2020 11:17:41 IST
2020-03-05T05:47:41.118Z05-03-2020 2020-03-05T05:47:38.668Z - - 26-05-2020

కరోనాను ఎదుర్కొనే శక్తి మన ప్రభుత్వాలకి ఉందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మన తెలుగు రాష్ట్రాలలో అడుగుపెట్టింది. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన బెంగళూరు వాసి ఈ మహమ్మారిని మోసుకొచ్చారని తెలుగు ప్రజలకు అందరికీ తెలిసిందే. ఆ యువకుడు గత 14 రోజులుగా మన దేశంలో ఎవరెవరిని కలిశారు అన్నది ఆరా తీసి అందరికీ పరీక్షలు నిర్వహించారు. హైద్రాబాద్ పరిధిలో యువకుడితో సన్నిహితంగా మెలిగిన 47 మందికి పరీక్షలు చేసి 45 మందికి వ్యాధి సోకలేదని తేల్చారు.

మిగతా ఇద్దరికీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినా నిర్ధారణ కోసం పూణే ల్యాబ్ కు పంపారు. మరోవైపు బుధవారం మైండ్ స్పేస్ ఐటీ కారిడార్ లో ఓ ఉద్యోగిని పాజిటివ్ రిపోర్ట్ రావడం కూడా ఒక్కసారిగా హైదరాబాద్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులలో వణుకు మొదలైంది. ఐటీ పరిశ్రమలో నిత్యం విదేశాల నుండి ప్రతినిధులు, క్లయింట్లు సంస్ధలుకు వచ్చి వెళ్లడం.. ఇక్కడ ఉద్యోగులు విదేశాలకు వెళ్లిరావడం షరా మూమూలు.

అందుకే, గత మూడు నెలలుగా విదేశాలకు వెళ్లి వచ్చిన వాళ్ళు.. వాళ్ళతో పరిచయం ఉన్నవాళ్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక మైండ్ స్పేస్ లో పనిచేసే సంస్థలన్నీ బుధవారం ఆఫీసులు ఖాళీ చేసి ఉద్యోగులను ఇళ్ళకి పంపించారు. అనంతరం అక్కడ మున్సిపల్ సిబ్బందితో శానిటేషన్ చేయించారు. ఒక్క మైండ్ స్పేస్ లో ఉన్న కంపెనీలే కాదు మిగతా ఐటీ సంస్థలు కూడా సాధ్యమైనంత వరకు ఇంటి నుండే కార్యకలాపాలను సాగించే విధంగా ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.

నిజానికి బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు హైదరాబాద్ లో మరి ముప్పైకి పైగా కరోనా కేసులు అంటూ మీడియా భారీ ప్రచారం చేసింది. కానీ మధ్యాహ్నం నుండి మీడియా వెర్షన్ మార్చేసింది. ముప్పైకి పైగా అనుమానితులు ఉన్న మాట వాస్తవమే కానీ అందులో ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళకి కూడా గురువారం పూణే ల్యాబ్ రిపోర్ట్ అందనుంది.

కాగా, ప్రభుత్వం కరోనా కోసం ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుండగా సమర్ధవంతంగా ఎదుర్కొంటామని ప్రకటించారు. అయితే, కరోనాను ఎదుర్కొనే శక్తి మన ప్రభుత్వాలకి ఉందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అందుకు కారణం వసతుల లేమిగా చెప్పుకోవచ్చు. గాంధీలో ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న వ్యక్తి ఒకరోజు మొత్తం పబ్లిక్ టాయిలెట్ ను ఉపయోగించినట్లుగా తెలుస్తుంది.

గాంధీలో అనుమానితులు.. పాజిటివ్ వ్యక్తులకు చికిత్స అందిస్తున్నా అక్కడ సిబ్బందికి మాత్రం పూర్తిస్థాయిలో భద్రత కలిగిన సౌకర్యాలను కలిగించలేదని వినిపిస్తుంది. చైనాలో చికిత్స అందించే ప్రతి సిబ్బంది వైరస్ ను నిరోధించే హజ్మత్ సూట్స్ ధరించి కనిపించారు. రోజుల తరబడి అక్కడి వైద్యులు, వైద్య సిబ్బంది ఆ షూట్స్ లోనే జీవించారు. కానీ గాంధీలో ఒక్కరూ ఆ షూట్స్ లో కనిపించలేదు.

ఇక మాస్క్ ల విషయానికి వచ్చిన ఎన్-95 మాస్కుల కొరత అప్పుడే మొదలైంది. ఒక్కరూ పేస్ మాస్క్ లు లేకుండా సాధారణ మాస్కులతోనే సిబ్బంది కనిపిస్తున్నారు. ఒక్కమాటగా చెప్పాలంటే అదేదో సాధారణ జ్వరానికి వైద్యులు, సిబ్బంది ఎప్పుడూ తీసుకొనే విధంగానే జాగ్రత్తలు తీసుకుంటూ కనిపించడం గాంధీకి వెళ్లిన వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీంతోనే కరోనాను ఎదుర్కొనే శక్తి మనకి ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   4 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   6 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   9 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   11 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   12 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   12 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   12 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   13 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   13 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle