కరోనాను అంతమొందించే యంత్రాన్ని కనుగొన్న తెలంగాణ శాస్త్రవేత్త
18-09-202018-09-2020 08:33:46 IST
2020-09-18T03:03:46.168Z18-09-2020 2020-09-18T03:03:28.774Z - - 22-04-2021

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తోన్న అలజడి అంతా ఇంతా కాదు. అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో అమెరికా మొదటిస్థానంలో ఉంటే, భారత్ రెండవ స్థానంలో నిలిచింది. ఇక వైరస్ వ్యాప్తికి కారణమైన చైనా మాత్రం 41వ స్థానంలో ఉంది. ఇప్పటికీ అర్థంకానీ విషయం ఏంటంటే కరోనా పుట్టినిల్లైన చైనాలో ఇప్పటికి కూడా 85 వేల కేసులుండటమే. కాగా.. వైరస్ ను పూర్తిగా అంతమొందించే వ్యాక్సిన్ కోసం అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రష్యాలో ఇప్పటికే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగా.. ఆ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు భారత్ కు చెందిన ప్రముఖ రెడ్డీస్ ల్యాబ్ ఈ వ్యాక్సిన్ కోసం భారీ మొత్తంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక అమెరికా విషయానికొస్తే నవంబరుకల్లా వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తామని చెప్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్. ఇలాంటి సమయంలో తెలంగాణకు చెందిన ఒక యువ శాస్త్రవేత్త ఇలా చేస్తే వైరస్ ను 15 సెకన్లలో చంపేయచ్చని చెప్తున్నాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ కు చెందిన యువ శాస్త్రవేత్త మండాలి నర్సింహాచారి ఫిలమెంట్ తో పని లేకుండా అధిక తీక్షణతో కూడిన అతినీలలోహిత కిరణాలు వెదజల్లే ఒక యంత్రాన్ని తయారు చేశాడు. ఈ యంత్రం ఉపరితలం పై ఉన్నవైరస్ ను కేవలం 15 సెకన్లలో నిర్వీర్యం చేస్తుందని చెప్తున్నాడు నర్సింహ. నర్సింహ తయారు చేసిన ఈ యంత్రాన్ని సెంరట్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంజీ)పరిశీలించింది. కరోనా వైరస్ ను నిర్వీర్యం చేయడంలో ఈ యంత్రం బాగా పనిచేస్తుండటంతో నర్సింహాచారితో సదరు బయాలజీ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుందట. ఈ విషయాన్ని స్వయంగా నర్సింహ నే వెల్లడించాడు. అలాగే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కూడా తనకు సహకారం అందించిందని తెలిపాడు. ఇంటర్నేషనల్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ కూడా నర్సింహా కనుగొన్న యూపీ పరికరాన్ని గుర్తించినట్లు పేర్కొన్నాడు. ఇది కరోనాతో పాటు ఇతర సూక్ష్మజీవులను కూడా నిర్వీర్యం చేయగలుగుతుందట. సరుకులు, కూరగాయల వంటి వాటిపై వైరస్ లేకుండా శుభ్రం చేసుకోవచ్చని శాస్త్రవేత్త నర్సింహాచారి చెప్తున్నాడు.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
6 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
9 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
12 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
13 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
13 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
11 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
a day ago

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా