newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనాతో తెలంగాణ ఉక్కిరిబిక్కిరి.. కొత్తరూపంలో హెల్త్ బులిటిన్

26-07-202026-07-2020 14:04:05 IST
Updated On 26-07-2020 14:06:19 ISTUpdated On 26-07-20202020-07-26T08:34:05.289Z26-07-2020 2020-07-26T08:33:53.284Z - 2020-07-26T08:36:19.052Z - 26-07-2020

కరోనాతో తెలంగాణ ఉక్కిరిబిక్కిరి.. కొత్తరూపంలో హెల్త్ బులిటిన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయితే వైద్య ఆరోగ్యశాఖ సరికొత్తగా హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1593 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్‌ సోకి 8 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 54,059కి చేరింది. మృతుల సంఖ్య 463 మందికి పెరిగింది. ఇప్పటి వరకు 41,332 మంది వైరస్‌ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

https://www.photojoiner.net/image/qSfQtyEK

తెలంగాణలో ప్రస్తుతం 12,264 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లోనే 641 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 171, వరంగల్ అర్బన్ 131, మేడ్చల్ - 91 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. 

ఈ హెల్త్ బులెటిన్‌లో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న హాస్పిటల్స్, బెడ్ల సంఖ్య, ఐసీయూలో ఎంతమంది ఉన్నారు, వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్‌లో ఏం జరుగుతుందన్న పూర్తి వివరాలను ఇచ్చారు. బులెటిన్‌లో సమగ్ర వివరాలను అందజేసేందుకు ప్రయత్నించారు. ర్యాపిడ్ టెస్టులు జరుగుతున్న హాస్పిటల్స్ వివరాలు జిల్లాల వారీగా ఉన్నాయి. అంతేకాదు, మరణాల రేటు 0.86 శాతం అంటే (2.3శాతం)గా వుందని తెలిపింది. తెలంగాణలో మిలియన్ కి 391 టెస్టులు చేస్తున్నామని తెలిపింది. జిల్లాల వారీగా కేసుల వివరాలను కూడా వెల్లడించారు. జీహెచ్ఎంసీ తర్వాత రంగారెడ్డి రెండవస్థానంలో కొనసాగుతోంది. 

మరోవైపు తెలంగాణలో కరోనా కేసులపై మండిపడుతున్నాయి విపక్షాలు. ప్రభుత్వం కోవిడ్ మరణాల సంఖ్యను దాచడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ మరణాలు, టెస్టులపై పత్రికలు, ప్రతిపక్షాలు వాస్తవాలు చెబితే ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందని విమర్శించారు. కోర్టులు తిడుతున్నా ప్రభుత్వానికి దున్నపోతు మీద వానపడ్డట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.మరణాలపై వాస్తవాలను మీడియా వెలికితీస్తోందని పొన్నం అన్నారు. హైకోర్ట్ జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని మందలించాలని పొన్నం కోరారు. మరణాలు, టెస్టులపై వాస్తవాలు చెప్పేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   42 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   a minute ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle