కరోనాతో ఎవ్వరూ ఆడుకోవద్దు.. కేటీఆర్ హెచ్చరిక
09-07-202009-07-2020 07:41:50 IST
Updated On 09-07-2020 10:35:23 ISTUpdated On 09-07-20202020-07-09T02:11:50.855Z09-07-2020 2020-07-09T02:11:44.600Z - 2020-07-09T05:05:23.280Z - 09-07-2020

తెలంగాణలో ఎవరూ కూడా కరోనా వైరస్‌తో ఆషామాషీగా వ్యవహరించవద్దని రాష్ట్ర ఐటీశాఖ కేటీఆర్ పేర్కొన్నారు. నాకు కరోనా రాదన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు ఆ మరుసటి రోజే కరోనా పాజిటివ్ అని తేలిందని, అందుకే కరోనా నాకు రాదు అనే అపోహకు ఎవరూ గురికావద్దని మంత్రి చెప్పారు. కరీంనగర్ జిల్లాలోని ప్రతిమ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆరోగ్య రథం,టెలీ మెడిసిన్‌ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ పెడితే ఆర్థికంగా రాష్ట్రం కుప్పగూలే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంత్రి మాటల్లోనే చెప్పాలంటే.. 'ఎవరూ నాకు కరోనా రాదు... అనే అపోహతో ఉండొద్దు... ఇందుకు ఉదాహరణే డిప్యూటీ స్పీకర్ పద్మారావు. నేను ఓ కార్యక్రమానికి ఆయనతో కలిసి హాజరయినప్పుడు మాస్కు పెట్టుకోమంటే నాకు కరోనా రాదు అన్నారు.. కానీ మరుసటి రోజే కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని రాజకీయ విమర్శలు చేయడం దుర్మార్గపు చర్య. ఆ విమర్శలు వారి పైశాచిక ఆనందం కోసం మాత్రమే. ఇలా విమర్శలు చేయడం వల్ల మన కరోనా వారియర్స్ ను నిరుత్సాహ పరిచినట్లే. మేము కూడా కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చు. కానీ ఇది సరైన సందర్భం కాదని విమర్శలు చేయడం లేదు. కరోనా నుంచి కోలుకొని రికవరీ అయిన వారి గురించి ఎవరు మాట్లాడరు. రాష్ట్రంలో కరోనా టెస్టులు సరిగా చేయడం లేదు... ఫలితాలు దాస్తున్నారు అనడం సరికాదు. ప్రతిపక్షాలు అర్ధరహిత విమర్శలు మానుకోవాలని నా విజ్ఞప్తి. రాజకీయాలు చేయాలని అనుకుంటే ఇది అసలు సందర్భం కాదు. ఇలాంటి సమయంలో విమర్శలు చేయడం వల్ల ప్రజలు అయోమయంకు గురయ్యే అవకాశం ఉంది. దయచేసి కరోనా పై పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులను నిరుత్సాహపరిచే విధంగా విమర్శలు చేయడం మానుకోవాలి. కోవిడ్-19 కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు లాక్డౌన్ పెడితే ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఫలితంగా కరోనా మరణాల కంటే లాక్ డౌన్ వల్ల సంభవించే మరణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకొని నియంత్రణ చేసుకోవాలి. కరోనా రోగుల మరణాల రేటు జాతీయ స్థాయిలో 3 శాతం ఉండగా తెలంగాణలో 2 శాతం మాత్రమే నమోదవుతున్నాయని, కొన్ని దేశాల్లో అయితే ఇది 14 శాతం వరకు ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇంతవరకు 22 వేలమంది కరోనా రోగులు పాజిటివ్ అని తేలగా 98 శాతం మంది రికవర్ అయ్యారని, కేవలం 2 శాతమంది మాత్రమే చనిపోయారని మంత్రి చెప్పారు. కానీ మరణాల శాతాన్ని ఎక్కుగ చేసి మాట్లాడుతున్న పెద్దమనుషులు 98 శాతం మంతి కోలుకుని ఇంటికి వెళ్లిన సంగతిని దాచి పెడుతున్నారెందుకు అని కేటీఆర్ ప్రశ్నించారు. అందుకే వ్యతిరేక వార్తలను ప్రచురించడంలో మీడియా కాస్త సంయమనం పాటింది సానుకూల వార్తలకు ప్రాధాన్యమివ్వడం కరోనా సంక్షోభ సమయంలో చాలా అవసరమని కేటీఆర్ హితవు చెప్పారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం ఫార్మా రంగంలో ముందంజలో ఉంది. కరోనా వ్యాక్సిన్ తొందరలోనే రావాలని కోరుకుంటున్నా. ప్రతిమ ఫౌండేషన్ సేవలను నా చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం రావడం సంతోషం. 200 ఆరోగ్య ప్రతిమ కేంద్రాలు ఏర్పాటు చేసి మారుమూల గ్రామాలకు వైద్యం అందించడం గొప్ప విషయం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిమ ఫౌండేషన్ కోటి మాస్కులు పంపిణీ చేయడం గర్వించదగ్గ విషయం' అని కేటీఆర్ అన్నారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
3 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
4 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
4 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
8 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
9 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
8 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
10 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
10 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
6 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
12 hours ago
ఇంకా