కరోనాతో ఉపాయంగా కలిసి బతకాల్సిందే.. కేసీఆర్‌దీ అదే పాటే
06-05-202006-05-2020 17:12:55 IST
Updated On 07-05-2020 12:18:53 ISTUpdated On 07-05-20202020-05-06T11:42:55.658Z06-05-2020 2020-05-06T11:42:00.314Z - 2020-05-07T06:48:53.142Z - 07-05-2020

తెలంగాణలో లాక్ డౌన్‌ను మే 29 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత వివాదాస్పదమైన అంశాన్ని మూడుముక్కల్లో తేల్చి చెప్పేశారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనాతో సహజీవనం తప్పదు అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపగా కేసీఆర్ సైతం అదే బాటలో కానీ కాస్త పాలిష్డ్గా చెప్పి తన వ్యాఖ్యల పట్ల వివాదం రాకుండా చూసుకున్నారు. అయితే కరోనాతో కలిసి బతకడం తప్పకున్నా ప్రజల సహకారముంటే, మరికొన్ని రోజులు ఓపికపడితే అన్నీ సర్దుకుంటాయని నచ్చచెప్పిన కేసీఆర్ పనిలోపనిగా మే 29వరకు లాక్ డౌన్ కొనసాగించనున్నట్లు తేల్చేశారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలనుంచి రాత్రి 9 గంటలవరకు సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ భేటీ అనంతరం కేసీఆర్ కొందరు మంత్రులతోపాటు ప్రగతి భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగానే ఆయన కరోనాతో ఉపాయంగా బతకడం ఎలాగో సూత్రీకరించారు. ఇప్పటివరకు మనల్ని మనం చాలా బాగా రక్షించుకున్నాం. ఇక ముందు కూడా రక్షించుకోవాలి. అతి శక్తివంతమైన అమెరికాలోనే కుప్పలు కుప్పలుగా కేసులు వస్తున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక్క రోజులోనే చాలా కేసులు వస్తున్నాయి. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్డౌన్, భౌతికదూరం పాటించడం. ఇప్పటివరకు ఈ భౌతిక దూరాన్ని పాటిస్తూ విజయం సాధించాం. పంటిబిగువనో, ఒంటిబిగువనో ఇంకొంచెం ముందుకు పోతే తక్కువ నష్టాలతో మన రాష్ట్రం, మన సమాజం బయటపడే అవకాశం ఉంటుందిని చెప్పారు. కరోనా అనేది కనిపించని శత్రువు. దీనిని ఎదుర్కొనేందుకు స్వీయ నియంత్రణ పాటించాలి. మనం ఎవరో బలవంత పెడితేనో, ఎవరి కోసమో ఈ స్వీయనియంత్రణ పాటిస్తున్నామని అనుకోవద్దు. కరోనా సమస్య రోజుల్లో పరిష్కారం కాదు. దానితో మనం కలిసి బతకాల్సిందే. ఈ ఆపద నుంచి బయట పడేందుకు శక్తి సంతరించుకోవాలి. ఇంతకాలం విజయం సాధించాం. ఇప్పుడు దీన్ని అతిక్రమిస్తే దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రత కూడా బాగా పెరిగిపోయింది. 39, 40 డిగ్రీలకు పోయింది. ఇంకా పెరుగుతుందంటున్నారు. బయటకు వెళ్లద్దు. పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉంది. ప్రజలు సహకరించాలి. కొద్దిరోజులు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని కేసీఆర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అనుభవాలు దృష్టిలో ఉంచుకోవడంతో పాటు యావత్ వైద్య ప్రపంచం, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వెలిబుస్తున్న అభిప్రాయం మేరకు 70 రోజులైతే చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది. అడపాదడపా అక్కడొకటి, అప్పుడొకటి వస్తే కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని పాటించాలి. రాష్ట్రాన్ని కచ్చితంగా కాపాడే ప్రయత్నం చేయాలి. టీవీ చానెల్ సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి. అందుకే రాత్రి కర్ఫ్యూ యథాతథంగా ఉంటుంది. రాత్రి 7 గంటల తరువాత ఎవరు బయటకు వచ్చినా పోలీసు చర్యలు తీసుకుంటారని కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో జోన్ల వివరాలు రెడ్‌జోన్ 1. హైదరాబాద్, 2. రంగారెడ్డి, 3. వికారాబాద్, 4. మేడ్చల్, 5. సూర్యాపేట, 6. వరంగల్ అర్బన్ ఆరెంజ్ జోన్ 7. ఆదిలాబాద్, 8. నిర్మల్, 9. ఆసిఫాబాద్, 10. నిజామాబాద్, 11, జగిత్యాల, 12. మంచిర్యాల, 13. కామారెడ్డి, 14. సిరిసిల్ల, 15. మెదక్, 16. సంగారెడ్డి, 17. జయశంకర్ భూపాలపల్లి, 18. జనగాం, 19. మహబూబ్‌నగర్, 20. నల్లగొండ,21. ఖమ్మం, 22. జోగులాంబ గద్వాల, 23. కరీంనగర్, 24. నారాయణ్‌పేట్ గ్రీన్‌జోన్ 25. సిద్దిపేట, 26. యాదాద్రి భువనగిరి, 27. వరంగల్ రూరల్, 28. మహబూబాబాద్, 29. భద్రాద్రి కొత్తగూడెం, 30. వనపర్తి, 31.నాగర్‌కర్నూల్, 32. పెద్దపల్లి, 33. ములుగు

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
8 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
13 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
17 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
18 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
20 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
21 hours ago
ఇంకా