newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

కరోనాకు వ్యాక్సిన్.. హైదరాబాద్ వర్శిటీ సైంటిస్ట్ ముందడుగు

29-03-202029-03-2020 09:27:28 IST
2020-03-29T03:57:28.968Z29-03-2020 2020-03-29T03:56:07.995Z - - 26-05-2020

కరోనాకు వ్యాక్సిన్.. హైదరాబాద్ వర్శిటీ సైంటిస్ట్ ముందడుగు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ నిరోధించే వ్యాక్సిన్‌ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. వ్యాక్సిన్ అభివృద్ధిపై యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. అందుకు అనువైన టి8సెల్‌ ఎపిటోప్స్‌ను రూపొందించింది.  పరిశోధన వివరాలపై తుది అంచనాకు వచ్చేందుకు దీనిని  ఇతర శాస్త్రవేత్తలకు అందజేసినట్లు యూనివర్సిటీ తెలిపింది. 

కరోనావైరస్ కు సంబంధించిన చిన్న మాలిక్యుల్స్‌ను పరిశోధనశాలలో రూపొందించామని, రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా వైరస్‌ కణాలను నాశనం చేయడానికి ప్రయత్నించినట్లు  యూనివర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన సీమా మిశ్రా తెలిపారు. కరోనా వైరస్ నిర్మాణ, నిర్మాణేతర ప్రోటీన్లను ఈ టీకా అడ్డుకోనుంది. ఈ టీకా వాడితే శరీరంలో వున్న కరోనా కణాలను నాశనం చేస్తుంది సీమా మిశ్రా చెప్పారు. ఇమ్యూనిటీని పెంచే క్రమంలో ఈ  వాక్సిన్లు హ్యూమన్‌సెల్స్‌కు ఏమాత్రం హాని చేయని విధంగా తయారు చేసినట్లు ఆమె చెప్పారు.  ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని అంటున్నారు.

వ్యాక్సిన్ వల్ల కలిగే ఫలితాలను ప్రయోగాత్మకంగా నిర్ధారించుకున్న తరువాత మాత్రమే ఒక అంచనాకు రాగలుగుతాం అని సీమా మిశ్రా అంటున్నారు. భారతదేశంలో కరోనా వాక్సిన్‌ తయారీ దిశగా జరుగుతున్న తొలి ప్రయోగం తమదేనని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ పేర్కొంది.  ప్రస్తుతానికి కరోనాను నివారించడానికి సామాజిక దూరాన్ని పాటించడం మినహా వేరే ప్రత్యామ్నాయం లేదని, లాక్ డౌన్ మంచి ఫలితాలు అందిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 10వేలమంది శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కనుగొనే పనిలో పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ ల్యాబరేటరీలను నిరవధికంగా మూసివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పదివేల మంది సైంటిస్టులు ఏదో విధంగానైనా వైరస్ సహాయక చర్యలు, పరిశోధనల్లో బిజీగా వున్నారు. ఇదిలా ఉంటే కోవిడ్ -19 ను ఎదుర్కోవడానికి జర్మన్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ సంస్థ అయిన బాష్ వేగవంతమైన కరోనా టెస్టులు జరపడానికి ఉపయోగపడే టెస్ట్ కిట్‌ను అభివృద్ధి చేసింది. ఈ టెస్ట్ కిట్‌తో ఫలితాలు 2.5 గంటల్లో లభిస్తాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అంతరాయం కలిగించిన వైరస్‌పై పోరాటాన్ని వేగవంతం చేస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   5 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   7 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   10 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   11 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   12 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   13 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   13 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   13 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   14 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle