newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనాకు రంజాన్ సెలవులిచ్చిన సీఎం కేసీఆర్?!

30-04-202030-04-2020 10:42:37 IST
Updated On 30-04-2020 11:12:35 ISTUpdated On 30-04-20202020-04-30T05:12:37.667Z30-04-2020 2020-04-30T05:12:35.504Z - 2020-04-30T05:42:35.862Z - 30-04-2020

కరోనాకు రంజాన్ సెలవులిచ్చిన సీఎం కేసీఆర్?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణాలో కరోనా వైరస్ కు కూడా సీఎం కేసీఆర్ రంజాన్ సెలవులిచ్చారని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. రంజాన్ మాసం కావడం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం లేదని.. రంజాన్ పండగ నాటికి పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేయాలని ఇప్పటి నుండే రాష్ట్రంలో కేసులే లేవనే భావన కలిగిస్తున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

తాజాగా లాంఛనంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కావాలనే రాష్ట్రంలో టెస్టులు తగ్గించి వైరస్ లేదని భావన కలిగిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం రోజుకి రెండువేల మందికి టెస్టులు చేసే అవకాశం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని.. సెకండరీ కాంటాక్ట్ కేసులకు టెస్టులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

మరోవైపు రాష్ట్రంలో కరోనా అధికంగా ఉన్న హైదరాబాద్ నగరంలో పలుచోట్ల యథేచ్ఛగా లాక్ డౌన్ పాటించకపోవడం.. రాత్రి సమయంలో కర్ఫ్యూని తుంగలో తొక్కి రంజాన్ షాపింగ్ చేసే వారి కోసం షాపులను తెరవడం, వరంగల్ లో రెడ్ జోన్ లో ఉన్న మండి బజార్ లో స్థానిక ఎమ్మెల్యే, స్థానిక పోలీసులు అనుమతులు ఇవ్వడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు కరోనా లక్షణాలున్నాయని స్వచ్ఛదంగా ప్రజలు కొందరు ఆసుపత్రులకు వెళ్తున్నా టెస్టులు చేయకుండానే వెనక్కు పంపుతున్నారని ఆరోపణలు సైతం వినిపించడం గమనార్హం. తాజాగా కింగ్ కోఠి ఆసుపత్రికి ప్రజలు తమకి లక్షణాలున్నాయని టెస్టులు చేయాలని కోరుతూ వచ్చినా సిబ్బంది ట్రావెల్ హిస్టరీ, పాత పాజిటివ్ రోగులతో కాంటాక్ట్ పరిశీలించి టెస్టులు చేయకుండానే వెనక్కు పంపినట్లుగా తెలుస్తుంది.

ఇక మరోవైపు ఇప్పటికే కరోనా వైరస్ సోకి గాంధీలో చికిత్స పొందుతున్న ముస్లిం రోగులకు రంజాన్ మాసం మొదలైన రోజు నుండే ఫుడ్ మెనూ మార్చేసిన సంగతి తెలిసిందే. రంజాన్ వేళలను బట్టి చికెన్ బిర్యానీతో సహా రంజాన్ ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రపంచంలో గల్ఫ్ దేశాలలో కూడా ప్రభుత్వాలు ఇలా కరోనా పేషేంట్లకు రంజాన్ ఆహారాన్ని అందించిన దాఖలు లేవని మండిపడుతున్నారు.

ఇక ఇప్పటి వరకు ఢిల్లీ నిజాముద్దీన్ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారి ప్రాంతాలలో కేసులు బయటపడగా గత వారం రోజులుగా కొత్త ప్రాంతాలలో కూడా కేసులు బయటపడుతున్నాయని.. అసలు వారిని వైరస్ ఎలా సోకిందో కూడా ప్రభుత్వం ట్రేస్ చేయడం లేదని.. మొత్తంగా కేసీఆర్ ప్రభుత్వం కరోనా వైరస్ కు కూడా రంజాన్ సెలవులు ప్రకటించిందని.. కానీ వైరస్ మాత్రం రంజాన్ సెలవులలో కూడా విస్తృతం పనిచేస్తుందని ఎద్దేవా చేస్తున్నారు.

కేసీఆర్ తన పాత బస్తీ మిత్రులు ఎంఐఎం కోసమే ఈ విధంగా ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున టెస్టులకు చేయాలని చెప్తున్నా.. ఇటు మిగతా రాష్ట్రాలు భారీగా టెస్టులు చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం రంజాన్ కోసం కేసులను దాచిపెట్టి లాక్ డౌన్ ఎత్తేయాలని ఆలోచనలో ఉందని విమర్శలు చేస్తున్నారు.

అయితే, కరోనా మహమ్మారి ఒక్క కేసీఆర్ ప్రభుత్వం దాచేస్తే దాగే మహమ్మారి కాదు.. ఏ మాత్రం అలసత్వం వహించినా చుట్టేయడం ఖాయం.. ఇప్పటికిప్పుడు దాచేయాలని ప్రయత్నించినా తర్వాత అదుపుచేయడం సాధ్యమయ్యేది కాదు. ఇది ప్రభుత్వాలకి తెలిసిన అంశమే. మరి కేసీఆర్ ప్రభుత్వం నిజంగానే బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల మాదిరి సెలవులు ఇచ్చిందా? అన్నది తెలియాలంటే రంజాన్ అయ్యే వరకు వేచి చూడాలి!

 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   13 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   17 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   14 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   21 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle