కరోనాకు భయపడవద్దు... జాగ్రత్తే మీకు రక్ష: మేయర్ బొంతు
29-07-202029-07-2020 12:48:08 IST
Updated On 29-07-2020 13:01:41 ISTUpdated On 29-07-20202020-07-29T07:18:08.938Z29-07-2020 2020-07-29T07:18:03.565Z - 2020-07-29T07:31:41.882Z - 29-07-2020

దేశవ్యాప్తంగా 15 లక్షలకు చేరుకున్నాయి కరోనా కేసులు. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా పాజిటివ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు.. డాక్టర్ల సలహాలు పాటించి కరోనాను జయించవచ్చు.. పాజిటివ్ రావడంతో ఇంట్లోనే వ్యాయామం చేస్తూ, ఆరోగ్య సూత్రాలను పాటించండి అంటున్నారు హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్. ఈమధ్యే కరోనా వైరస్ పాజిటివ్ బారిన పడిన రామ్మోహన్ ఇంట్లోనే వుంటున్నారు. హోం ఐసోలేషన్‌లో వుంటూ వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే ఆహారం తీసుకుంటున్నానని మేయర్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. తనకోసం ఏర్పాటుచేసుకున్న గదిలో వుంటున్నారు మేయర్ బొంతు రామ్మోహన్. వ్యాయామాలు చేస్తున్న వీడియో ఆయన విడుదల చేశారు. కరోనా హోం ఐసోలేషన్‌లో తాను ప్రతిరోజూ ఏం చేస్తున్నారో వివరించారు. మూడురోజుల క్రితం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. మేయర్ కుటుంబసభ్యులకు మాత్రం కరోనా నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కరోనా వైరస్ సమయంలో చేపట్టాల్సిన చర్యల మీద సమీక్షలు, ప్రత్యక్ష పరిశీలనల కోసం మేయర్ బొంతు రామ్మోహన్ ప్రజల్లో బాగా తిరగడంతో కరోనా వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. కరోనా ప్రారంభ సమయంలో ఆయన డ్రైవర్ కు కూడా కరోనా వచ్చింది. ఆ సమయంలో రామ్మోహన్ పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. బొంతు రామ్మోహన్‌కు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. మరోవైపు తెలంగాణలో నేతలకు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్ బారినపడి కోలుకుంటున్నారు. ప్రస్తుతం మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ సోకింది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఐసోలేషన్‌కు వెళ్లారు. ఇక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కరోనాబారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్ చికిత్స పొందుతున్నారు.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
6 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
9 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
12 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
13 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
13 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
11 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
a day ago

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా