newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనాకు బలయిన మాజీ ఎమ్మెల్యే సున్యం రాజయ్య

04-08-202004-08-2020 09:11:47 IST
2020-08-04T03:41:47.582Z04-08-2020 2020-08-04T03:41:39.366Z - - 19-04-2021

కరోనాకు బలయిన మాజీ ఎమ్మెల్యే సున్యం రాజయ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ నేతల్ని బలితీసుకుంటోంది. తెలుగు రాష్ట్రాలో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు, పార్టీల నేతలు కరోనా బారినపడి కోలుకుంటుంటే మరికొందరు నేతలు కరోనాకు బలవుతున్నారు. తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యేను కరోనా పొట్టన పెట్టుకుంది. భద్రాచలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్‌ నేత సున్నం రాజయ్య కన్నుమూశారు. 

కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భద్రాచలం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1999, 2004, 2014లలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హించారు.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. కోవిడ్ నిబంధనల మేరకు ఆయన స్వగ్రామం సున్నంవారి గూడెంలో మాజీ ఎమ్మెల్యే అంత్యక్రియలు జరగనున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన సున్నం రాజయ్య నిజాయితీకి మారుపేరుగా, నిబద్ధత కలిగిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. 

ఎమ్మెల్యే అయినా ఆడంబరాలు, రాజకీయ దర్పం లేకుండా అందరితో కలిసిపోయారు. చివరివరకూ నిరాడంబరమైన జీవితం గడిపారు. అసెంబ్లీకి ఆటోలో, బస్సుల్లో వెళ్ళేవారు. భాగ్యనగర వీధుల్లో అన్నపూర్ణ క్యాంటీన్ల వద్ద 5రూపాయల భోజనం చేసి కడుపు నింపుకునేవారు. నియోజకవర్డంలో సమస్యల పరిష్కారానికి ఎంతగానో శ్రమించారు. కరోనాకు సున్నం రాజయ్య బలికావడం పట్ల పలువురు సంతాపం తెలిపారు. సున్నం రాజయ్య ఆకస్మిక మరణంతో ఆయన స్వగ్రామం వీఆర్‌పురం మండలం సున్నం వారి గూడెంలో విషాదఛాయలు ఏర్పడ్డాయి. 

ఇదిలా ఉంటే ఆయన ఇద్దరు కొడుకులు, అల్లుడికి కరోనా సోకింది, దీంతో వారిని రాజమహేంద్రవరం దగ్గర బొమ్మూరులో చికిత్స అందిస్తున్నారు. తండ్రి మరణవార్త విని వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   3 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   25 minutes ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   7 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   8 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   9 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   18-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle