కరెంటు బిల్లులు మాఫీ చేయాలి.. కేసీయార్‌కు ఉత్తమ్ లేఖ
06-07-202006-07-2020 12:36:56 IST
Updated On 06-07-2020 14:57:32 ISTUpdated On 06-07-20202020-07-06T07:06:56.160Z06-07-2020 2020-07-06T07:06:25.570Z - 2020-07-06T09:27:32.237Z - 06-07-2020

లాక్ డౌన్ అమల్లో ఉన్న కాలానికి పేదలకు విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బందుల్లో ఉందని.. తెలంగాణ దీనికి మినహాయింపు కాదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో ప్రజలకు సహాయపడటానికి ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకుంటున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఏమీ చేయడంలేదని ఆయన అన్నారు. డబ్ల్యూహెచ్ఓ యొక్క ‘ట్రేస్, టెస్ట్ అండ్ ట్రీట్’ విధానం రాష్ట్రం అమలు చేయలేదని ఎత్తిచూపారు. ప్రభుత్వం వైరస్‌ను నియంత్రించడంలో విఫలమవ్వడమే కాకుండా పౌరులపై ఆర్థిక భారం కూడా విధించిందని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. జూన్ నెలలో విద్యుత్ బిల్లులు అన్యాయంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికి తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. పేదలకు లాక్ డౌన్ లో ఆదాయం లేకుండా పోయింది.. విద్యుత్ చార్జీల భారం ప్రభుత్వం భరించాలన్నారు ఉత్తమ్. అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో విద్యుత్ అధికారుల కార్యాలయాల ముందు నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. దారిద్ర్యరేఖకు దిగువున వున్నవారికి టెలిస్కోపిక్ విధానం అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. చిన్న వ్యాపారస్తులు విద్యుత్ చార్జీలు కూడా మాఫీ చేయాలని , లాక్ డౌన్ లో వ్యాపారం జరగకనే ఇబ్బంది పడుతుంటే విద్యుత్ చార్జీలు అధికంగా రావడంతో మరింత ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. చిన్న వ్యాపారస్తుల విద్యుత్ ఛార్జీలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలో గాంధీ భవన్ నుండి ర్యాలీగా...విద్యుత్ సౌధ కి చేరుకోవాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీ స్థాయిలో ఆందోళనలు చేయాలని ఇప్పటికే పీసీసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి మండల కేంద్రం వరకు సమస్యను జనంలోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
10 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
15 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
11 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
15 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
13 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
18 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
17 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
20 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
16 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
21 hours ago
ఇంకా