newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

కరీంనగర్ ఎంపీ హాట్ కామెంట్స్

09-01-202009-01-2020 09:00:22 IST
Updated On 09-01-2020 09:30:39 ISTUpdated On 09-01-20202020-01-09T03:30:22.036Z09-01-2020 2020-01-09T03:30:18.046Z - 2020-01-09T04:00:39.288Z - 09-01-2020

కరీంనగర్ ఎంపీ హాట్ కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఏఏ, ఎన్నార్సీ ఆందోళనల నేపథ్యంలో బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఏఏను వ్యతిరేకించేవాళ‍్లంతా దేశ ద్రోహులేనని అన్నారు. 

పౌర సత్వ సవరణ చట్ట వ్యతిరేకులను బ్రేకుల్లేని బస్సులో పాకిస్థాన్‌కి పంపిస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వద్దకు మద్దతుగా జాతీయ వాదుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బహిరంగ సభలో ఎంపీ సంజయ్‌ మాట్లాడారు.

‘‘పచ్చ జెండాలతో ర్యాలీ తీసి ఈ ఓరుగల్లు గడ్డను అపవిత్రం చేశారు. మళ్లీ ఈ గడ్డను పవిత్రం చేయడానికే ఈ కాషాయం ర్యాలీ చేస్తున్నామన్నారు. వాస్తవాలను దాచి అవాస్తవాలను ప్రచారం చేస్తున్న మూర్ఖపు పార్టీల వల్లే ఈ ఆందోళనలు జరుగుతున్నాయన్నారు.

పౌరసత్వ సవరణ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు. పక్క దేశాలలో ఉన్న హిందూ శరణార్ధులు భారత భూభాగంలో నివసిస్తామంటే వారికి పౌరసత్వం ఇవ్వడానికే ఈ చట్టం తెచ్చాం. మహాత్మాగాంధీ, నెహ్రులు చెప్పిన విధివిధానాలే ఇందులో ఉన్నాయన్నారు.

ఆర్టికల్‌ 370, అయోధ్య తీర్పు వచ్చినప్పుడు జరగని ఆందోళనలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం దేశంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఈ ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. మీరు రాళ్లు వేస్తే..మేము బాంబులు వేస్తాం అన్నారు సంజయ్. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్ల కోసం కేసీఆర్‌ తాపత్రయపడుతున్నారన్నారు.

కేసీయార్ నిజమైన హిందువు అని చెప్పడానికి సిగ్గు పడాలన్నారు. ఒవైసీ సోదరులు, కేసీఆర్‌ కుటుంబం చేస్తున్న కుట్రలు ఇక తెలంగాణలో సాగవన్నారు. మునిసిపల్ ఎన్నికలలో ఓట్లు వేసేటప్పుడు ఓటర్లు ఈ విషయాలు గమనించాలన్నారు. దేశరక్షణ కోసమే సీఏఏ తెచ్చామన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle