కరీంనగర్ జిల్లాలో కరోనా అలజడి
21-07-202021-07-2020 10:27:50 IST
Updated On 21-07-2020 16:06:58 ISTUpdated On 21-07-20202020-07-21T04:57:50.852Z21-07-2020 2020-07-21T04:57:45.528Z - 2020-07-21T10:36:58.610Z - 21-07-2020

కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు భారీగానే పెరుగుతున్నాయి. దేశంలో కరోనా ప్రవేశించిన కొత్తలోనే జిల్లా వణికిపోయింది.ఢిల్లీ ఎఫెక్ట్ తో కేసులు ప్రారంభం అయ్యాయి. తాజాగా భారీగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కరీంనగర్ జిల్లాలో శ్రీకాకుళం జిల్లా పేరు పెట్టి మరీ హెల్త్ బులిటినె విడుదల చేశారు అధికారులు. దీంతో అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా హెల్త్ బులెటిన్ల పై అనేక అనుమానాలు రేకెత్తుతున్న సమయంలో కరీంనగర్ జిల్లా హెల్త్ బులెటిన్‌లో దొర్లిన తప్పులు ఆశ్చర్యాన్ని కలిగించాయి. కరీంనగర్ అర్బన్ లో శ్రీకాకుళం జిల్లా పేరు ప్రత్యక్షం అయింది. సైదాపూర్ మండలంలో లేని ఎరుకలగూడెం పేరు నమోదు అయింది. జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. అయితే కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో అధికారులు తగు జాగ్రత్తలు చేపట్టారు. మరోవైపు జిల్లాలో అన్నిచోట్ల కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గ్రామం, వార్డు, పట్టణం, కార్పోరేషన్ అనే తేడా లేకుండా చాపకింద నీరులా అది పెరిగిపోతోంది. జిల్లాలో ఆదివారం నాడే 27 కేసులు వచ్చాయి, అవి హుజురాబాద్ లో వచ్చాయి. కరోనా కట్టడికి అన్నిచర్యలు తీసుకుంటున్నా... అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కరీంనగర్ ఆస్పత్రిలోనే ఐదుగురు ఈ వ్యాధితో మృత్యువాత పడ్డారు. వీరిలో ముగ్గురు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించగా మరొకరు ప్రైవేట్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో, ఇంకొకరు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. తిమ్మాపూర్ మండలం రేణికుంటకు చెందిన ఒక వృద్ధుడి భార్య 15 రోజుల క్రితం మరణించగా అతని పరామర్శించడం కోసం పలువురు వచ్చి వెళ్ళారని సమాచారం. అతనికి 10 రోజులుగా జ్వరం, శ్వాససంబంధిత సమస్యలు ఉత్పన్నం కావడంతో ఈనెల 16న జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదేరోజు అతనికి కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ కాగా, మూడురోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఆదివారం ఉదయం అతను మరణించారు. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన మరో వ్యక్తికి కూడా ఈనెల 17న కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అతను హోం ఐసోలేషన్‌లో ఉండిచికిత్స తీసుకుంటుండగా ఈరోజు పరిస్థితి విషమించడంతో జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కిసాన్‌నగర్‌కు చెందిన ఒకరు వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ స్థానికంగా రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఈనెల 16న హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా చికిత్స పొందుతూ ఆయన ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. హుస్నాబాద్కుచెందిన ఒక మహిళ శ్వాససం బంధమైన సమస్యలతో జిల్లా ఆస్పత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం విషమించి ఆదివారం ప్రాణాలను కోల్పోయారు. జిల్లాలో ఒకే రోజు ఐదుగురు మృతిచెందడం తీవ్ర కలవరం సృష్టిస్తోంది. హుజూరాబాద్ మండలంలో ఐదుగురికి, జమ్మికుంటలో తొమ్మిది మందికి, సైదాపూర్ మండలంలో ఐదుగురికి, శంకరపట్నం మండలంలో ముగ్గురికి వ్యాధి సోకినట్లు తెలిసింది. హుజూరాబాద్ డివిజన్‌లోనే 22 మందికి వ్యాధి సోకినట్లు తెలుస్తుండగా మరో ఐదుగురు కరీంనగర్ డివిజన్‌కు చెందిన వారు ఉన్నారని వీరిలో చొప్పదండి మండలానికి చెందిన ఇద్దరు, తిమ్మాపూర్‌కు చెందిన ఒకరు ఉన్నారు. కరోనా బారినపడ్డవారిని హోం ఐసోలేషన్‌లో వుంచారు. కొన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛంధంగా లాక్ డౌన్ పాటిస్తున్నాయి.గతంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ప్రస్తుతం మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
9 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
12 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
15 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
6 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
16 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
13 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
16 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
17 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
10 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
19 hours ago
ఇంకా