newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరీంనగర్‌లో కేటీయార్ బిజీబిజీ.. ఐటీ విస్తరణకు చిటికెలో అనుమతులు

21-07-202021-07-2020 18:49:32 IST
Updated On 22-07-2020 11:50:10 ISTUpdated On 22-07-20202020-07-21T13:19:32.380Z21-07-2020 2020-07-21T13:18:15.899Z - 2020-07-22T06:20:10.812Z - 22-07-2020

కరీంనగర్‌లో కేటీయార్ బిజీబిజీ.. ఐటీ విస్తరణకు చిటికెలో అనుమతులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఐదు ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హరిత హారంలో భాగంగా మొక్కను నాటిన కేటీఆర్.. అనంతరం పట్టణంలో ఇంటింటికి తాగునీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును రూ.109 కోట్లతో 2048 వరకు కరీంనగర్ అవసరాలకు సరిపడేలా రూపొందించామన్నారు. భవిష్యత్తులో కరీంనగర్ వాసులకు 24 గంటలూ తాగునీరు అందజేస్తామని మంత్రి తెలిపారు. 

తెలంగాణలోని మిగతా పట్టణాల్లోనూ కరీంనగర్‌ తరహాలోనే తాగునీరు అందిస్తామన్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఈ పథకానికి కేసీఆర్ జలం అని నామకరణం చేయడం గమనార్హం.సీఎం కేసీఆర్ మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెట్టారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే అందరికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తోన్న రాష్ట్రంగా నిలిచిందన్నారు. 

గోదావరి జలాలను కేసీఆర్ బీడు భూములకు మళ్లించారన్నారు. కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులను వాయు వేగంతో పూర్తి చేస్తున్నామన్నారు.భారతదేశానికే తెలంగాణ ధాన్య బాంఢాగారంగా మారిందన్న కేటీఆర్.. సాగునీటి శాఖ పేరును సీఎం కేసీఆర్ జలవనరుల శాఖగా మార్చారని తెలిపారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం కేసీఆర్ విద్య, ఆరోగ్య రంగాలపై దృష్టి సారించారని కేటీఆర్ అన్నారు.

కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఐదు ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హరిత హారంలో భాగంగా మొక్కను నాటిన కేటీఆర్.. అనంతరం పట్టణంలో ఇంటింటికి తాగునీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును రూ.109 కోట్లతో 2048 వరకు కరీంనగర్ అవసరాలకు సరిపడేలా రూపొందించామన్నారు. భవిష్యత్తులో కరీంనగర్ వాసులకు 24 గంటలూ తాగునీరు అందజేస్తామని మంత్రి తెలిపారు. 

Image

తెలంగాణలోని మిగతా పట్టణాల్లోనూ కరీంనగర్‌ తరహాలోనే తాగునీరు అందిస్తామన్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఈ పథకానికి కేసీఆర్ జలం అని నామకరణం చేయడం గమనార్హం. సీఎం కేసీఆర్ మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెట్టారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే అందరికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తోన్న రాష్ట్రంగా నిలిచిందన్నారు. గోదావరి జలాలను కేసీఆర్ బీడు భూములకు మళ్లించారన్నారు. కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులను వాయు వేగంతో పూర్తి చేస్తున్నామన్నారు.

భారతదేశానికే తెలంగాణ ధాన్య బాంఢాగారంగా మారిందన్న కేటీఆర్.. సాగునీటి శాఖ పేరును సీఎం కేసీఆర్ జలవనరుల శాఖగా మార్చారని తెలిపారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం కేసీఆర్ విద్య, ఆరోగ్య రంగాలపై దృష్టి సారించారని కేటీఆర్ అన్నారు.సాగునీరు, తాగునీరుకు సరిపడేలా కాళేశ్వరం జలాలను మిడ్ మానేర్, లోయర్ మానేరుకు అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. 

కరీంనగర్ పట్టణ ప్రజలకు 80 ఎకరాల్లో లంగ్ స్పేస్ కావాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారని.. దీనికి వెంటనే అంగీకరిస్తున్నానని కేటీఆర్ తెలిపారు.మానేరు మీద నిర్మిస్తోన్న కేబుల్ బ్రిడ్జి 90 శాతం పూర్తయ్యింది. దాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలోనే పూర్తి చేస్తాం. కరీంనగర్‌కు తోరణంలా అలుగునూరు జంక్షన్‌ను తీర్చిదిద్దుదాం. గతంలో రూపాయికే నల్లా కార్యక్రమం ప్రారంభించాం. తెల్లకార్డుదారులకు రూపాయికే నల్లా ఇస్తాం’’ అని కేటీఆర్ తెలిపారు.

కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్‌ను మంత్రి ప్రారంభించారు. 83 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కరీంనగర్‌లో ఐటీ టవర్‌ను నిర్మించాం. స్థానిక విద్యార్థుల్లో నవీన ఆవిష్కరణలకు పెద్దపీట వేద్దాం అని మంత్రి గంగుల అన్నారు.కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు అవుతున్న సంస్థలు రూ.15 వేల నుంచి రూ.60 వేలకు జీతాలు ఇవ్వనున్నాయి. కరీంనగర్‌తోపాటు వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఐటీ టవర్లు ఏర్పాటు అవుతున్నాయి. విదేశాల్లో స్థిరపడిన కరీంనగర్ వాసులు ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే నన్ను లేదా మంత్రి కమలాకర్‌ను సంప్రదిస్తే.. ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇస్తుంది’’ అని కేటీఆర్ తెలిపారు.

 

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle