newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరీంన‘గరం’.. విదేశీయులతో కరోనా భయం

19-03-202019-03-2020 09:01:09 IST
2020-03-19T03:31:09.816Z19-03-2020 2020-03-19T03:30:47.973Z - - 12-04-2021

కరీంన‘గరం’.. విదేశీయులతో కరోనా భయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా పడగ విప్పుతోందా? అవుననే అంటున్నారు వైద్యనిపుణులు. హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఈ మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 13కు చేరింది. ఒక్కరోజులోనే ఏకంగా 8 మందికి ఈ వైరస్ నిర్ధారణ అయింది. ఇక ఈ ఎనిమిది మందిలో ఏడుగురు ఇండోనేసియా పౌరులు కాగా.. మరొకరు స్కాట్‌ల్యాండ్ నుంచి మేడ్చల్ వచ్చిన ఓ యువకుడుగా గుర్తించారు.. మొట్టమొదటి కరోనా బాధితుడు డిశ్చార్జ్ కాగా.. ఇప్పుడు 12 మంది చికిత్స పొందుతున్నారు.

ఇండోనేషియా బృందంలో 8మందికి కరోనా పాజిటివ్‌ అని తేలడమే కాదు ప్రభుత్వం కూడా దీనిని ధృవీకరించింది. ఈమేరకు హెల్త్‌ బులెటిన్‌ విడుదలయింది. దీంతో కరీంనగర్‌పై దృష్టి సారించారు మంత్రులు ఈటల, గంగుల. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ సంజయ్‌. కరీంనగర్లోని  విదేశీ బృందం బస చేసిన ఏరియాను నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. మరో పదిమంది అనుమానితులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

ఈమధ్య ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన పది మంది బృందంలో కరోనా లక్షణాలున్నట్లు గుర్తించి, వైద్యపరీక్షల కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 8మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు వైద్యులు తేల్చిచెప్పగా... మిగతా వారికి కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో కరీంనగర్‌లో కరోనా ప్రమాదం పొంచి ఉందన్న భయం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. 

విదేశీయులకు మాత్రమే కరోనా వచ్చినప్పటికీ వారు కరీంనగర్‌లో నాలుగు రోజులు బసచేయడంతో ఇక్కడ ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. దీంతో అధికార యంత్రాంగం హైఅలర్ట్‌ ప్రకటించింది. అవసరమైతే కరీంనగర్‌లో అత్యవసర పరిస్థితులు విధించే అవకాశం ఉంది. ఇండోనేషియాకు చెందిన పది మంది మత బోధకుల బృందం ఈ నెల 9న  విమానంలో ఢిల్లీ చేరుకోగా అక్కడ స్క్రీనింగ్‌ పరీక్షలు సైతం నిర్వహించారు. అనంతరం రైలు మార్గంలో రామగుండంలో దిగి కరీంనగర్‌కు వచ్చారు. 

వీరిని వైద్యపరీక్షల నిమిత్తం ఉత్తరప్రదేశ్‌కు చెందిన గైడ్‌తోపాటు స్థానికులైన ఇద్దరు వ్యక్తులతో కలిసి ప్రభుత్వాసుపత్రికి చేరుకోగా... ఆసుపత్రి సిబ్బంది ఐసోలేషన్‌ వార్డుకు తరలించి, చెస్ట్‌ ఫిజీషియన్‌తో పరీక్షలు నిర్వహించారు. ఒకరికి జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం 108 వాహనాల్లో తరలించారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు కరోనా పాజిటివ్‌గా గుర్తించారు.  

దీంతో కరీంనగర్ ఉలిక్కిపడింది. విదేశీయులు బస చేసిన కలెక్టరేట్‌ సమీపంలోని ప్రార్థనా మందిరం చుట్టు పక్కల దుకాణాలను మూయించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన పది మంది సభ్యులు ఎక్కడ బసచేశారు.. ఎక్కడెక్కడ తిరిగారు... ఎవరిని కలిశారనే అంశాలపై పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఆరా తీస్తున్నారు. ప్రార్థనా మందిరంలో, మందిరం సమీపంలో నివసించే దాదాపు 10 మందిని హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా సదరు విదేశీయులు నగరంలో పలు ప్రార్థన మందిరాలకు కూడా వెళ్లినట్లు సమాచారం. దీంతో అన్ని ప్రాంతాల ప్రజలను వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది.

కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ శశాంక అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కరీంనగర్లో కరోనా అనుమానిత లక్షణాల నేపథ్యంలో  వైద్యులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌. ఇండోనేషియా టీంతో పాటు ఏపీ సంపర్క్‌ క్రాంతి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌(12708) రైలు ఎస్‌9 బోగీలో ప్రయాణించిన వారిని అప్రమత్తం చేశారు. ఆ బోగీలో వున్నవారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు.  100 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం కరీంనగర్‌లో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle