newssting
BITING NEWS :
*రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు-కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ *ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ. 5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ మీటింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ *కొత్తకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ఢీ కొట్టి తుఫాన్ వాహనం బోల్తా. ఇద్దరు మృతి. 14 మందికి తీవ్రగాయాలు, హాస్పిటల్ కు తరలింపు * ఇవాళ కెసిఆర్ బర్త్ డే. కెసిఆర్ పుట్టినరోజును మొక్కల పండుగగా జరపాలని తెరాస పిలుపు. రేపు ఉదయం నుంచి మొక్కలు నాటడం... రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు *జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం. పనిచేసే కార్యకర్తలకే జనసేన పార్టీలో ప్రాధాన్యత. కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నా-పవన్ *రాజధాని మార్పు, పీఏఏల రద్దు తొందరపాటు నిర్ణయాలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి, శాసనమండలి రద్దు నిర్ణయం సరైంది కాదు-దగ్గుబాటి పురంధేశ్వరి*ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మూడోసారి సీఎంగా ప్రమాణం

కరీంన‘గరం’ బాబు అంతిమయాత్రలో టెన్షన్

01-11-201901-11-2019 16:57:07 IST
Updated On 01-11-2019 17:37:15 ISTUpdated On 01-11-20192019-11-01T11:27:07.908Z01-11-2019 2019-11-01T11:27:01.776Z - 2019-11-01T12:07:15.200Z - 01-11-2019

కరీంన‘గరం’ బాబు అంతిమయాత్రలో టెన్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ కార్మికుల సమ్మె 28వ రోజుకి చేరినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా కనిపించడంలేదు. మరోవైపు కరీంనగర్ అట్టుడికిపోతోంది. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో బుధవారం జరిగిన సకల జనుల సమరభేరిలో కరీంనగర్‌–2 డిపోకు చెందిన డ్రైవర్‌ నంగునూరి బాబు ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి పోలీసులు బాబు మృతదేహాన్ని స్వగ్రామం కరీంనగర్‌ రూరల్‌ మండలం ఆరెపల్లికి తరలించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనే డిమాండ్ తో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని అప్పటి వరకూ బాబు అంత్యక్రియలు నిర్వహించబోమని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రకటించారు.

ఆర్టీసీ జేఏసీ నేతలకు వివిధ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. బాబు మృతదేహం వద్దే బైఠాయించడం, పరామర్శకు వచ్చిన కరీంనగర్‌–2 డిపో మేనేజర్‌ మల్లేశంను కార్మికులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. భారీ సంఖ్యలో పోలీసు బలగాల మొహరించారు. బాబు మృతదేహంతో ఎంపీ బండి సంజయ్, ఆర్టీసీ కార్మికులు రాత్రంతా జాగరణ చేశారు, పొలిటికల్‌ జేఏసీ ఇచ్చిన కరీంనగర్‌ నగర బంద్‌ కొనసాగుతోంది. కరీంనగర్‌లో విద్యసంస్థల బంద్‌కు ఏబీవీపీ, వామపక్ష విద్యార్ధి సంఘాల మద్దతు తెలిపాయి. అలాగే ఛలో కరీంనగర్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చారు.

కార్మికులు పెద్ద ఎత్తున కరీంనగర్ చేరుకున్నారు. డ్రైవర్ బాబు నివాసం వద్ద ఆర్టీసీ కార్మికులు మానవహారంగా ఏర్పడ్డారు. అలాగే కోదండరాం తో పాటు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రంతో పాటు పలువురు వామపక్ష నేతలు అక్కడకు చేరుకున్నారు. ఆర్టీసీ కార్మికులు ఒక్కొక్కరుగా చనిపోతున్నా సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని కోదండరాం మండిపడ్డారు. 

ఆర్టీసీ డ్రైవర్‌ బాబు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బాబు కుటుంబ సభ్యుల అనుమతితోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. కరీంనగర్‌ బస్‌ డిపో వరకు శవయాత్ర నిర్వహించి తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయితే, డ్రైవర్ బాబు అంతిమయాత్ర ఉద్రిక్తంగా మారింది. అంతిమయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో...డ్రైవర్ బాబు కుటుంబసభ్యులతో పాటు పలు పార్టీల నేతలు అంతిమయాత్ర జరుపుతామంటున్నారు.

అంతిమయాత్రకు బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ సమాజం, ఉద్యోగులు, విద్యార్ధులు, వ్యాపారస్తులు మద్దతు తెలిపిన కేసీఆర్‌లో మార్పు రాలేదని ఆర్టీసీ జేఏసీ నేతలు విమర్శించారు. డ్రైవర్‌ బాబు కుటుంబానికి రూ. 50 లక్షల నష్ట పరిహారం, డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు, ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. 

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

   an hour ago


మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

   an hour ago


మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

   3 hours ago


కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

   3 hours ago


అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

   5 hours ago


రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

   5 hours ago


కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

   7 hours ago


కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

   7 hours ago


అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

   8 hours ago


‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

   9 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle